Home
News

Location Tracking మీరు ఎక్కడున్నా గూగుల్ మీ లొకేషన్‌ను ట్రాక్‌ చేస్తుందని తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ యూజర్‌ల లోకేషన్‌ను గూగుల్‌ అనేక విధాలుగా ట్రాక్‌ చేస్తుంటుంది. సాధారణంగా చాల మంది లోకేషన్‌ను ఆఫ్‌ చేయడం లేదా GPS ను ఆఫ్‌ చేయడం ద్వారా ట్రాకింగ్ నుంచి తప్పించుకోవచ్చని భావిస్తారు. అయితే నిజానికి GPS ఆఫ్‌ చేసిన కూడా అనేక మార్గాల్లో మన లోకేషన్‌ ట్రాకింగ్ అవుతుంది. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా లోకేషన్‌ ట్రాకింగ్ జరుగుతుందని చాలా మంది భావిస్తారు. దీంతోపాటు అనేక ఇన్‌బిల్ట్‌ యాప్‌ల ద్వారా లోకేషన్‌ ట్రాకింగ్ జరుగుతుంది. అయితే లోకేషన్‌ ట్రాకింగ్‌ నుంచి తప్పించుకొనేందుకు స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు.

సెల్‌ టవర్ల ద్వారా కూడా గూగుల్‌ మీ లోకేషన్‌ను ట్రాక్‌ చేయగలదు. మీ పరికరానికి అందుతున్న సిగ్నల్‌ను విశ్లేషించి, గూగుల్ మీ లోకేషన్‌ను గుర్తిస్తుంది. అయితే ఇది విధానం ద్వారా కచ్చితమైన లోకేషన్‌ సాధ్యం కాదు. దీంతోపాటు బ్లూటూత్‌ ద్వారా కూడా మీ లోకేషన్‌ను గుర్తించేందుకు వీలుంటుంది. కొన్ని ప్రాంతాల నుంచి మీరు ఎంత దూరంలో ఉన్నారనే సమాచారాన్ని అంచనా వేయగలదు.

Google is tracking your location by many methods

వైఫై పొజిషినింగ్‌ ద్వారా గూగుల్ లోకేషన్‌ను (Google Location Tracking) గుర్తించగలదు. కనెక్ట్‌ అయిన వైఫై నెట్‌వర్క్‌ లేదా మీ డివైస్‌ గుర్తించిన వైఫై ద్వారా గూగుల్‌ లోకేషన్‌ను గుర్తిస్తుంది. సమీపంలోని వైఫై రూటర్‌ల సిగ్నల్‌ ఆధారంగా లోకేషన్‌ను ట్రాక్‌ చేస్తుంది. వైఫై నెట్‌వర్క్‌ లోకేషన్‌కు సంబంధించిన డేటాబేస్‌ను కలిగి ఉంది.

మీరు ఉపయోగించే పరికరాల IP అడ్రస్‌ ద్వారా కూడా లోకేషన్‌ను గుర్తించవచ్చు. ఇంటర్నెట్ ప్రొవైడర్‌ భౌగోళిక ప్రాంతం ఆధారంగా సుమారుగా మీ లోకేషన్‌ను అంచనా వేయవచ్చు. ఈ విధానం ద్వారా కచ్చితమైన లోకేషన్‌ను అంచనా వేయడం వీలుకాదు. మీ ప్రాంతం వివరాలు మాత్రమే తెలిసే వీలుంటుంది.

స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న సెన్సార్‌ల ద్వారా కూడా లోకేషన్‌ను గుర్తిస్తుంది. యాక్సెలిరోమీటర్‌ మరియు గైరోస్కోప్‌ ద్వారా సాధ్యమవుతుంది. ఈ డేటాను విశ్లేషించి మీ లోకేషన్‌లో వచ్చిన మార్పులను అంచనా వేయగలదు. దీంతోపాటు యూజర్‌ల ఇన్‌పుట్‌ ద్వారా కూడా లోకేషన్‌ను అంచనా వేయగలుగుతుంది. దీంతోపాటు యాప్‌ లోకేషన్ అనుమతుల ద్వారా బౌగోళిక ప్రాంతాలను అంచనా వేయవచ్చు.

అయితే భద్రత కారణాలతో ఈ లోకేషన్‌ను ట్రాకింగ్ ను ఆఫ్‌ చేయవచ్చు. మీరు వినియోగించే పరికరాల సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ట్రాకింగ్‌ను కట్టడి చేయవచ్చు. గూగుల్ అకౌంట్‌లో My Activity పైన క్లిక్ చేయాలి. అనంతరం యాక్టివిటీ కంట్రోల్స్‌లోకి వెళ్లాలి. వెబ్‌ అండ్ యాప్‌ యాక్టివిటీలో మార్పులు చేయాలి. మరియు లోకేషన్‌ హిస్టరీని ఆఫ్‌ చేయాలి.

దీంతోపాటు ఇప్పటి వరకు సేకరించిన డేటాను డిలీట్‌ చేసేందుకు మై గూగుల్ యాక్టివిటీలోకి వెళ్లాలి. అనంతరం ఎప్పటి నుంచి డిలీట్‌ చేయాలని భావిస్తున్నారో ఆ సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం డీలిట్ చేయాలి. మొత్తం డేటాను డీలిట్‌ చేయవచ్చు లేదా ఎంచుకున్న సమయంలో డేటాను డీలిటీ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.

* గతంలో గూగుల్ కీలక ప్రకటన చేసింది. గూగుల్‌ మ్యాప్స్ డేటాను తమ సర్వర్‌లో కాకుండా యూజర్‌ల డివైస్‌లోనే భద్రపరచనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం డిసెంబర్‌ 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. క్లౌడ్‌లో ప్రైవసీ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో వెల్లడించింది.

యూజర్ల తమ పాత ప్రయాణాలకు సంబంధించిన డేటాను తమ డివైజ్‌లతో భద్రపరిచేందుకు డిసెంబర్‌ 1 వరకు సమయం ఇస్తున్నట్లు గతంలో పంపిన మెయిల్‌లో యూజర్‌లకు సూచించింది. డిసెంబర్‌ 1 నుంచి పాత డేటాను తొలగించడం ప్రారంభం అవుతుందని పేర్కొంది. ఆండ్రాయిడ్‌, iOS వెర్షన్‌ గూగుల్‌ మ్యాప్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
how google usually tracking location and how to disable the settings here is the guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X