ఫైర్‌ఫాక్స్‌ వేగం పెంచాలంటే SpeedyFox ఉండాల్సిందే....!!!

Posted By: Staff

ఫైర్‌ఫాక్స్‌ వేగం పెంచాలంటే SpeedyFox ఉండాల్సిందే....!!!

డౌన్‌లోడ్‌ చేసే సమాచారాన్ని, పాటల్ని, సాఫ్ట్‌వేర్‌లను పర్యవేక్షించే మేనేజర్‌ కావాలంటే Free Download Managerను నిక్షిప్తం చేసుకోండి. టూల్‌బార్‌లో ఎన్నో అదనపు సౌకర్యాలు. ఏదైనా ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయగానే టూల్‌ వస్తుంది. డౌన్‌లోడ్‌ చేసే ఫైల్‌ ఎక్కడ సేవ్‌ అవ్వాలో ముందే నిర్ణయించవచ్చు. వీడియో ఫైల్స్‌ డౌన్‌లోడ్స్‌ని ప్రివ్యూ చూడొచ్చు కూడా.

ఒకే క్లిక్కుతో ఫైర్‌ఫాక్స్‌ వేగాన్ని పెంచాలంటే SpeedyFoxను పొందండి. రన్‌ చేయగానే వచ్చిన విండోలో Speed Up my Firefoxపై క్లిక్‌ చేసి తగ్గిన వేగాన్ని పెంచొచ్చు.

సైట్‌ అడ్రస్‌, బుక్‌మార్క్‌ల అవసరం లేకుండా MyStart Social Toolbar టూల్‌బార్‌ ద్వారా ఒకే క్లిక్కుతో కావాల్సిన సోషల్‌ నెట్‌వర్క్‌లోకి వెళ్లొచ్చు. టూల్‌బార్‌లో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, మైస్పేస్‌... నెట్‌వర్క్‌లు వరుసగా కనిపిస్తాయి. WebTV గుర్తుపై క్లిక్‌ చేసి టీవీ చూడొచ్చు. ఈ-షాపింగ్‌ సర్వీసుల్ని ఒకేచోట పొందొచ్చు.


బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయకుండానే సెర్చ్‌, న్యూస్‌, ఆన్‌లైన్‌ నిఘంటువు, కరెన్సీ కన్వర్టర్‌, పాస్‌వర్డ్‌ కీపర్‌, వాతావరణ వివరాలు... లాంటి సర్వీసుల్ని పొందాలంటే A-ToolBar ఉంటే సరి. ఐకాన్ల రూపంలో మొత్తం సర్వీసులు తెర పైనే ప్రత్యేక టూల్‌బార్‌లో కనిపిస్తాయి. గేమ్స్‌ కూడా ఉన్నాయి.

ఎప్పుడైనా SLIMBROWSER వాడారా? బ్రౌజింగ్‌లో సందర్శించిన పేజీలను Share this pageతో సులభంగా సోషల్‌నెట్‌వర్క్‌ సభ్యులతో పంచుకునే వీలుంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, బజ్‌, StumbleUpon ఉన్నాయి. వెబ్‌ పేజీలను ఇతరులకు మెయిల్‌ చేయవచ్చు. జీమెయిల్‌, యాహూ, హాట్‌మెయిల్‌ సర్వీసులు సిద్ధంగా ఉన్నాయి. Groups, AutoLogin మెనూలతో అదనపు సౌకర్యాల్ని పొందొచ్చు. దీని ద్నారా ట్యాబ్‌ విండోలను మాయం చేయవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting