వాట్సాప్‌లో మెమోజి స్టిక్కర్లను ఉపయోగించడం ఎలా?

|

ఆపిల్ గత వారం iOS13 ను ఐఫోన్‌లకు విడుదల చేసింది. డార్క్ మోడ్, వీడియో ఎడిటింగ్, అప్‌గ్రేడ్ కెమెరా యాప్ వంటి ఇతర విషయాలతోపాటు ఆసక్తికరమైన ఫీచర్స్ లను iOS 13 ఐఫోన్‌లకు తీసుకువచ్చింది. iOS 13 మెమోజి స్టిక్కర్లను వాట్సాప్‌లో మరొకరికి పంపడానికి కూడా ఐఫోన్‌లకు తీసుకువచ్చింది.

ఐఫోన్

ఈ మెమోజి స్టిక్కర్లపై ఆధారపడి మెసేజ్ లను పంపేటప్పుడు వివిధ రకాల భావోద్వేగాలను తెలియజేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇందులో శుభవార్త ఏమిటంటే ఐఫోన్ వినియోగదారులు ఈ మెమోజీ స్టిక్కర్లను మెసేజ్ యాప్‌లో కాకుండా వాట్సాప్‌లో ఉపయోగించడం కుదరదు. కానీ ఈ ఫీచర్ ఐఫోన్ X మరియు ఆపిల్ కొత్త మోడళ్లలో లభిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మెమోజి స్టిక్కర్లను ఐఫోన్ X, ఐఫోన్ XR, ఐఫోన్ XS, ఐఫోన్ XS మాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో మరియు ఐఫోన్ 11 ప్రో మాక్స్‌లో మాత్రమే ఉపయోగించగలరు.

ఐఫోన్‌లు

మీ వద్ద ఈ ఐఫోన్‌లు ఏవైనా ఉంటే మరియు ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ను iOS 13కు అప్‌గ్రేడ్ చేసి ఉంటే వాట్సాప్‌లో మెమోజి స్టిక్కర్‌లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి కింది పద్ధతులు పాటించండి.


- మెసేజ్ యాప్ ను ఓపెన్ చేయండి.

- ఇప్పటికే ఉన్న మెసేజ్ విండోను ఓపెన్ చేయండి లేదా కొత్త మెసేజ్ ను సృష్టించడానికి యాప్ యొక్క కుడివైపు ఎగువ మూలలో ఉన్న క్రొత్త మెసేజ్ ఎంపికను నొక్కండి.

- మీరు ఇప్పటికే ఉన్న చాట్ విండోను తెరిస్తే యాప్ స్టోర్ ఐకాన్ పక్కన గల ముల్టీపుల్ ఫేసెలతో ఉన్న చిహ్నాన్ని నొక్కండి.

- ఇప్పుడు ఎడమవైపు ఎగువన మూలలో ఉన్న మూడు చుక్కలపై నొక్కండి. ఆపై కొత్త మెమోజి ఎంపికపై నొక్కండి.

- మీ స్కిన్ టోన్‌ను ఎంచుకోండి. ఆపై మీ చిన్న చిన్న మార్పులను ఎంచుకోవడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.

- చీక్స్ మరియు బ్యూటీ స్పాట్‌ను ఎంచుకోవడానికి మరింత క్రిందికి స్క్రోల్ చేయండి.

 

RS.10,000 భారీ డిస్కౌంట్ ధరతో గూగుల్ పిక్సెల్ 3ARS.10,000 భారీ డిస్కౌంట్ ధరతో గూగుల్ పిక్సెల్ 3A

 

హెయిర్‌స్టైల్

- తరువాత హెయిర్‌స్టైల్ ట్యాబ్‌పై నొక్కండి. తరువాత మీ అవతార్ కోసం మీకు నచ్చిన హెయిర్‌స్టైల్‌ను ఎంచుకోండి.

- తరువాత బ్రౌస్ ట్యాబ్‌పై నొక్కండి. ఇక్కడ కనుబొమ్మల కలర్ మరియు రకాన్ని ఎంచుకోవచ్చు.

- తరువాత హెడ్ ట్యాబ్‌పై నొక్కండి. ఇది వయస్సు మరియు తల ఆకారాన్ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది.

- తరువాత ముక్కు ఆకారాన్ని ఎంచుకోవడానికి నోస్ ట్యాబ్‌పై నొక్కండి. ఇక్కడ మీకు నచ్చిన రకాన్ని ఎంచుకోవచ్చు.

- తరువాత మౌత్ ట్యాబ్‌పై నొక్కండి. ఇక్కడ పెదవులు, దంతాలు, నోరు మరియు నాలుక ఆకారాన్ని ఎంచుకోవడానికి మరింత క్రిందికి స్క్రోల్ చేయండి.

- ఇప్పుడు చెవుల పరిమాణం మరియు వాటి కలర్ ను ఎంచుకోవడానికి ఇయర్స్ ట్యాబ్‌పై నొక్కండి. ఇక్కడ ఎయిర్‌పాడ్స్ వంటి ఆడియో డివైస్ ను కూడా జోడించవచ్చు.

- మీసం మరియు సైడ్‌బర్న్‌లను జోడించడానికి ఫేషియల్ హెయిర్ టాబ్‌పై క్లిక్ చేయండి.

- గ్లాస్ఎస్ కలర్ మరియు రకాన్ని ఎంచుకోవడానికి ఐవేర్ టాబ్‌పై నొక్కండి.

 

ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్ లకు తెరలేపిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్ లకు తెరలేపిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

 

హెడ్‌వేర్

- ఇప్పుడు హెడ్‌వేర్ యొక్క కలర్ మరియు రకాన్ని ఎంచుకోవడానికి హెడ్‌వేర్ టాబ్‌పై నొక్కండి.

- మీ అవతార్ ఎలా ఉందో చూడటానికి మీరు దీనిని చుట్టూ తిప్పవచ్చు. చివరగా "డన్" బటన్ పై క్లిక్ చేయండి.

- పైన చెప్పిన పద్ధతులు పాటించిన తరువాత మీ అవతార్ మెసేజ్ లలో కనిపిస్తుంది.

- మెసేజ్ లను క్లోజ్ చేసి వాట్సాప్‌లో చాట్ విండోను ఓపెన్ చేయండి.

- టైపింగ్ స్థలంలో క్లిక్ చేయండి. ఆపై స్మైలీ ఎంపికను నొక్కండి. మీ మెమోజి స్టిక్కర్లు ఎమోజీల ఎడమ వైపున కనిపిస్తాయి.

- మీరు ఇప్పుడు సృష్టించిన అవతార్ మెమోజీని ఎంచుకోవడానికి మూడు చుక్కలపై నొక్కండి.

- తరువాత మీరు పంపించదలిచిన దానిని ఎంచుకొని స్నేహితులకు పంపవచ్చు.

 

Best Mobiles in India

English summary
How iPhone users get Memoji Stickers for WhatsApp in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X