కేవలం 2.5 నిమిషాల్లో 3.6 కోట్లు, మైండ్ బ్లాకయ్యే న్యూస్ ఇది
మీరు క్రికెట్ అభిమానులా..అయితే మీరు సమ్మర్ లో హాట్ హాట్ గా మొదలైన ఐపీఎల్ 2019 మ్యాచ్ లు చూస్తుంటారు కదా.. అయితే మ్యాచ్ జరిగే సమయంలో మీరు కొన్నింటిని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు దిమ్మతిరిగిపోద్ది..
మీరు క్రికెట్ అభిమానులా..అయితే మీరు సమ్మర్ లో హాట్ హాట్ గా మొదలైన ఐపీఎల్ 2019 మ్యాచ్ లు చూస్తుంటారు కదా.. అయితే మ్యాచ్ జరిగే సమయంలో మీరు కొన్నింటిని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు దిమ్మతిరిగిపోద్ది.. ముఖ్యంగా మీరు మ్యాచ్ జరిగే సమయంలో బాగా అబ్జర్వ్ చేసిట్లయితే మధ్యలో స్ట్రాటజిక్ టైమ్ ఔట్ అని పడుతూ కనిపిస్తుంది. ఇందులో ఓ కంపెనీ పేరు కనపడుతూ ఉంటుంది.

ఈ ఐపిఎల్ మ్యాచుల్లో ప్రముఖ టైర్ల ఉత్పత్తి కంపెనీ సియట్ పేరు కనపడుతోంది. మరి అలా కనపడేందుకు సియట్ చెల్లించిన మొత్తం ఎంతో తెలుసా.. రూ.31 కోట్లు. మూడేళ్లపాటు ఈ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. దీని ద్వారా మ కంపెనీని ప్రమోట్ చేసుకుంటోంది. ఇంతకీ స్ట్రాటజిక్ టైమ్ ఔట్ అంటే ఏంటో ఓ సారి చూద్దాం.

ఆటగాళ్లంతా కలిసి
మ్యాచులు జరిగే సమయంలో ఆటగాళ్లు తీసుకునే స్వల్ప కాల విరామ సమయాన్ని స్ట్రాటజిక్ టైమ్ ఔట్ అని పిలుస్తారు.ఈ స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయంలో ఆటగాళ్లంతా కలిసి ముందు అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించుకుంటారు. ఇదివరకటి వ్యూహాల్లో ఏమైనా మార్పులు ఉంటే చర్చిస్తారు. అలాగే స్టేడియంలోని వీక్షకులు కూడా ఈ సమయంలో వారికి కావలసిన ఆహార పదార్థాలను తెచ్చుకుంటారు.

అడ్వర్టైజ్‌మెంట్ల రూపంలో ..
ఈ స్ట్రాటజిక్ టైమ్ ఔట్ వల్ల ప్లేయర్లు, వీక్షకులు మాత్రమే కాదు.. బ్రాడ్‌క్యాస్టింగ్ కంపెనీకి కూడా అదిరిపోయే ప్రయోజనం లభిస్తోంది. అడ్వర్టైజ్‌మెంట్ల రూపంలో అదనపు ఆదాయం గడిస్తోంది. దీని విలువ ఏకంగా రూ.3.6 కోట్లుగా ఉంది.

రెండు స్ట్రాటజిక్ టైమ్ ఔట్స్
కాగా ప్రతి ఇన్నింగ్స్‌లోనూ రెండు స్ట్రాటజిక్ టైమ్ ఔట్స్ ఉంటాయి. బౌలింగ్ చేసే టీమ్ 6-8 ఓవర్ల మధ్యలో, బ్యాటింగ్ టీమ్ 11-16 ఓవర్ల మధ్యలో ఈ టైమ్ ఔట్ తీసుకుంటారు. ఇక్కడ కంపెనీ ప్రమోషన్ భారీగా జరుగుతూ ఉంటుంది.

2009లో అమలులోకి
స్ట్రాటజిక్ టైమ్ ఔట్ అనేది 2009లో అమలులోకి వచ్చింది. అప్పుడు భారత్‌లో ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ జరిగింది. అక్కడే స్ట్రాటజిక్ టైమ్ ఔట్‌ను తీసుకువచ్చారు. మొదట్లో ఇది 7.5 నిమిషాల బ్రేక్ ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు 2.5 నిమిషాలకు తగ్గించారు.

పది సెకన్ల యాడ్‌కు
కేవలం ఈ 2.5 నిమిషాల్లో స్పాన్సర్లు సాధ్యమైనంత ఆదాయం పొందేందుకు ప్రయత్నిస్తారు. బ్రాడ్‌క్యాస్టింగ్ స్పాన్సర్ (స్టార్ నెట్‌వర్క్) అడ్వర్జైజర్ల నుంచి పది సెకన్ల యాడ్‌కు రూ.10 లక్షలు వసూలు చేస్తుంది.

రూ.34.8 కోట్ల ఆదాయం
అన్ని స్ట్రాటజిక్ టైమ్ ఔట్స్, బ్రేక్స్, వికెట్స్‌ను లెక్కలోకి తీసుకుంటే రూ.34.8 కోట్ల ఆదాయం వస్తోంది. కేవలం ఒక్క ఐపీఎల్ సీజన్ ద్వారా స్టార్ రూ.2,880 కోట్లు గడిస్తుంది. అది కూడా కేవలం అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారానే అంటే అందరూ నమ్మి తీరాల్సిందే..


Click it and Unblock the Notifications








