జియోకు ముందు, జియోకి తరువాత.. దేశం ఎలా తయారైందంటే..

Written By:

జియో..టెల్కో మార్కెట్లో ఓ సునామి..ఉచిత ఆఫర్లతో దేశం మొత్తాన్ని తన వైపు ఆకర్షించుకున్న దిగ్గజం. మరి జియో రాక ముందు దేశంలో టెలికం పరిస్థితులు ఎలా ఉన్నాయి. జియో వచ్చిన తరువాత ఎలా ఉన్నాయి అనే విషయాలను విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు మనకు తెలుస్తాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

అమెరికాకు దిమ్మతిరిగింది, ఇచ్చిందెవరో తెలిస్తే ఇంకా షాక్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేటికి ఏడాది

జియో వచ్చి నేటికి ఏడాది. టెలికం మార్కెట్లో జియో సృష్టించిన ప్రభంజనానికి దిగ్గజ టెల్కోలు సైతం భారీ నష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. డేటా విషయంలో జియోకు ముందు.. జియోకు తర్వాత అని చెప్పుకునే స్థాయికి చేరింది.

2జి సామ్రాజ్యాన్ని

గత పాతికేళ్లలో పాత ఆపరేటర్లంతా కలిసి స్థాపించిన 2జి సామ్రాజ్యాన్ని జియో వచ్చి రావడంతోనే నేల మట్టం చేసింది. 4జీ నెట్ వర్క్ తో ఓ సునామిని క్రియేట్ చేసింది. ఈ సునామికి పట్టిన సమయం 3 ఏళ్లు మాత్రమే.

ఉచిత డేటా వాయిస్ కాల్స్ తో

కాల్స్ ధరలు చుక్కలనంటిన నేపథ్యంలో జియో వచ్చి రావడంతోనే ఉచిత కాల్స్ అంటే ఎలా ఉంటోయో టెల్కోలకు రుచిచూపించింది. ఉచిత డేటా వాయిస్ కాల్స్ తో యూజర్లకు పండగ వాతావరణాన్ని అందించింది.

ఏకంగా 125 కోట్ల జీబీకి

జియో రాకముందు నెలకు 20 కోట్ల జీబీ మాత్రమే భారతీయులు వినియోగించే వారు జియో రాకతో అది ఏకంగా 125 కోట్ల జీబీకి చేరింది.

మొబైల్‌ డేటా వినియోగంలో

మొబైల్‌ డేటా వినియోగంలో జియోకు ముందు భారత్‌ 155వ స్థానంలో ఉండగా.. ఇపుడు నంబర్‌ 1 స్థానంలో ఉంది. టీవీని చూసే సమయంతో పోలిస్తే అంతకు ఏడు రెట్లు మొబైల్‌పై భారతీయులు గడుపుతున్నారంటే అదంతా జియో చలవే.

170 రోజుల్లో 10 కోట్ల వినియోగదార్లను

ప్రపంచంలో ఏ కంపెనీ కూడా 170 రోజుల్లో 10 కోట్ల వినియోగదార్లను సొంతం చేసుకోలేదు. అది జియోకు మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం 13 కోట్ల మందికి జియో తన సేవలందిస్తోంది.

ఒక జీబీ రూ.50 కంటే తక్కువకే

జియో రాకముందు 1జీబీకి రూ.250 నుంచి రూ.4000 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇపుడు ఒక జీబీ రూ.50 కంటే తక్కువకే లభిస్తోంది.

84 రోజులకు రోజూ 1 జీబీ

84 రోజులకు రోజూ 1 జీబీ జియో వినియోగదార్లకియతే 84 రోజులకు రోజూ 1 జీబీ చొప్పున రూ.399కే వస్తోంది. అంటే రూ.50/జీబీ కంటే చాలా తక్కువన్నమాట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
How jio changed Indian telecom market here is answer Read more at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting