ఆర్ధిక మాంద్యం వల్ల పోయిన ఉద్యోగాల కన్నా తర్వాత వచ్చినవే ఎక్కువ

Posted By: Super

ఆర్ధిక మాంద్యం వల్ల పోయిన ఉద్యోగాల కన్నా తర్వాత వచ్చినవే ఎక్కువ

జీవన శైలిలో సమూల మార్పులు తీసుకువస్తున్న ఇంటర్నెట్‌ ఉద్యోగావకాశాల కల్పనలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంటర్నెట్‌ రాకతో కోల్పోయిన ప్రతి ఉద్యోగానికి 2.4 ఉద్యోగాలను కల్పించిందని మెకిన్సే నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వృద్ధి, పురోగతిపై నెట్‌ బలమైన సానుకూల ప్రభావాన్ని చూపిందని మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. ఉద్యోగాల కల్పన, అభివృద్ధి, పురోగతిపై నెట్‌ ప్రభావాన్ని అంచనా వేయడానికి అధ్యయనాన్ని నిర్వహించింది. నేరుగా సంబంధం ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ఆన్‌లైన్‌ మార్కెటర్లు వంటి అనేక కొత్త ఉద్యోగావకాశాలను నెట్‌ కల్పించింది. అంతర్జాలం రాకతో పోయిన ఉద్యోగాల కంటే లభించిన ఉద్యోగాలే అధికమని నివేదిక స్పష్టం చేసింది.

గత 15 ఏళ్లల్లో నెట్‌ వల్ల 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే.. 12 లక్షల ఉద్యోగాలు లభించాయి. నికరంగా 7 లక్షల ఉద్యోగాలను అంతర్జాలం సృష్టించిందని మెకిన్సే తెలిపింది. జీ8 దేశాలతోపాటు బ్రెజిల్‌, చైనా, భారత్‌, దక్షిణ కొరియా, స్వీడన్‌లలో అధ్యయనం నిర్వహించారు. ఈ 13 దేశాల్లో సగటున ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తిలో ఇంటర్నెట్‌ వాటా 3.4% ఉంది. ఇంధనం, వ్యవసాయం వంటి అనేక రంగాల వాటా కంటే ఇది అధికం. కాగా పేదరికాన్ని తగ్గించడానికి, అన్ని ప్రాంతాల్లో వృద్ధిరేటు ఒకే విధంగా ఉండడానికి నెట్‌ విస్తరణ కీలకమని మిలినియం లక్ష్యాల్లో ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి ప్రస్తుత నెట్‌ కనెక్షన్‌ ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot