Home
News

Aadhaar Card Update ఆధార్‌ కార్డులో మీ పేరును ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేసుకోవచ్చో తెలుసా?

ఆధార్‌ కార్డు ప్రతి భారతీయుడు కలిగి ఉండాల్సిన గుర్తింపు కార్డుల్లో ఒకటి. ఈ కార్డుల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు సహా అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. బ్యాంకు అకౌంట్‌లు తెరవడం దగ్గర నుంచి సిమ్‌ కార్డులు, పాస్‌పోర్టుల దరఖాస్తులకు ఆధార్‌ ప్రధాన గుర్తింపు కార్డుగా ఉంది. ప్రస్తుతం ఆధార్‌ కార్డులోని అనేక వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఆధార్‌ గడువును అనేకసార్లు పొడిగించిన UIDAI (యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా).. డిసెంబర్‌ 14 వరకు గడువును విధించింది.

ఆధార్‌ కార్డులోని పేరు, పుట్టినరోజు, అడ్రస్, ఫోటో, ఫోన్‌ నంబర్ సహా ఇతర వ్యక్తిగత వివరాలను అప్‌డేట్‌ చేసేందుకు అవకాశం ఉంది. ఆధార్‌ కార్డులోని కొన్ని వివరాలను ఇంటినుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఫోటో మార్పు వంటి అప్‌డేట్‌ కోసం కచ్చితంగా ఆధార్‌ సేవా కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డులో సరైన వివరాలు కలిగి ఉండడం వల్ల ప్రభుత్వ ప్రయోజిత పథకాలను పొందగలుగుతారు.

UIDAI allow users to update their aadhaar card

అయితే ప్రస్తుతం ఆధార్‌ కార్డును (Aadhaar Card) ఉచితంగా అప్‌డేట్‌ చేసుకొనేందుకు అవకాశం ఉన్నా.. కొన్ని వివరాలను అప్‌డేట్‌ చేసుకొనేందుకు పరిమితులు ఉన్నాయి. అయితే ఆధార్‌ కార్డులోని అడ్రస్‌ను మార్చుకొనేందుకు ఎటువంటి పరిమితి లేదు. ఎన్నిసార్లు అయినా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డులో పేరు మార్చుకొనేందుకు మాత్రం పరిమితి (Limit) ఉంది.

ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయం నుంచి ప్రత్యేక అనుమతి :
ఆధార్‌ కార్డులో వ్యక్తి పేరును జీవితకాలంలో కేవలం రెండు సార్లు మార్చుకొనేందుకు మాత్రమే అవకాశం ఉందని ఆధార్ ప్రాధికార సంస్థ UIDIA పేర్కొంది. అంతకంటే ఎక్కువసార్లు పేరు మార్చుకొనేందుకు సరైన ధ్రువపత్రాలతో ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

30 రోజుల్లో పరిష్కారం :
ప్రస్తుతం ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ విజ్ఞప్తుల్లో గరిష్ఠంగా 90 శాతం 30 రోజుల్లోనే పరిష్కారం చేస్తున్నారు. అయితే ఏదైనా కారణాలతో 90 రోజుల్లోగా ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ కాకపోతే.. ఆధార్‌ కాల్ సెంటర్ నంబర్‌ 1947 కు సంప్రదించవచ్చు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అయిన ఆధార్‌ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని UIDAI సూచించింది.

డిసెంబర్‌ 14 వరకు అప్‌డేట్‌కు అవకాశం :
ఆధార్‌ కార్డుల అప్‌డేట్‌ గడువును UIDAI ఇప్పటికే అనేక సార్లు పెంచింది. గత సంవత్సరం డిసెంబర్‌ 15 నుంచి మార్చి 14 వరకు.. అనంతరం ఆ గడువును జూన్‌ 14 వరకు పొడిగించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14 నుంచి డిసెంబర్‌ 14 వరకు గడువును పొడిగించింది. మైఆధార్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ఆధార్‌ కార్టులోని పుట్టిన తేదీ, అడ్రస్‌ వంటి వివరాలను సరైన ధ్రువపత్రాలతో మైఆధార్‌ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే ఫోటో, పేరు అప్‌డేట్‌ చేసేందుకు ఆధార్‌ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అప్‌డేట్ సమయంలో ఆధార్‌ కార్డుతో లింక్ చేసి ఉన్న మొబైల్‌ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచుకోవాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
How many times allowed to update name on the aadhaar card full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X