పర్సు అక్కర లేదు, త్వరలో క్రెడిట్ కార్డుగా మొబైల్

Posted By: Staff

పర్సు అక్కర లేదు, త్వరలో క్రెడిట్ కార్డుగా మొబైల్

ప్రపంచం చాలా ఫాస్టుగా అభివృద్ది చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహాం లేదు. రోజు రోజు ఎన్నో కొత్త టెక్నాలజీలను మొబైల్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి టెక్నాలజీనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. స్మార్ట్ ఫోన్ అమ్మేవారు, మొబైల్ ఆపరేటర్స్ రాబోయే కాలంలో సంయుక్తంగా కస్టమర్స్ కోసం వైర్ లెస్ పేమంట్ టెక్నాలజీస్‌ని ప్రవేశపెట్టనున్నారు. ఈ టెక్నాలజీ గనుక వాడుకలోకి వస్తే ఎవరెవరైత్ పర్సలను(wallet) వాటికి ఇంట్లోనే పెట్టి మొబైల్ ఒక్కదాన్ని బయటకు తీసుకొని వెళ్శవచ్చునన్నమాట. మొబైల్ లోనే వారియొక్క ఆర్దిక లావాదేవీలను చూసుకొవచ్చన్నమాట.

మొబైల్ సహాయంతోనే వారి అన్ని రకాల స్టేట్‌మెంట్స్‌లను తెలసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగినటువంటి స్మార్ట్ పోన్స్‌లలో ప్రవేశపెట్టడానికి ఎన్‌ఎఫ్‌సి అన్ని రకాల ప్రయత్నాలను మొదలు పెట్టింది. రిలయన్స్, నోకియా కూడా ఈ టెక్నలజీ‌పై అవగాహానకు రావడం జరిగింది. ఆపిల్ కొత్తగా రూపోందిస్తున్నటువంటి ఐఒఎస్ డివైజెస్‌లలో కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. గూగుల్ ప్లస్‌లో ఈ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటలో ఉంచడం జరిగింది. మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్‌ని https://www.gplus.com/Infographic/INFOGRAPHIC-Goodbye-Wallets-How-Mobile-Payments ఉన్న సమాచారాన్ని చూడండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot