మీ అకౌంట్ హ్యాక్ అయితే ఎవరిని అడగాలో తెలుసా?అయితే ఇది చదవండి

By Anil
|

ఆన్‌లైన్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయ్.. సైబర్ నేరగాళ్లు ప్రమాదకర వైరస్‌లను వ్యాపింపజేస్తూ నెటిజనులు వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తున్నారు. ముఖ్యంగా హ్యాకర్లు బ్యాంక్ అకౌంట్‌లకు సంబంధించిన వివరాలను దొంగిలించేందుకు రకరకాల వ్యూహాలను రచిస్తున్నారు. ఈ నేపథ్యం లో RBI తాజాగా కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. దేశవ్యాప్తంగా ఆన్ లైన్ మోసాలు, అనాథరైజ్డ్ మనీ విత్ డ్రా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వార్షిక నివేదక సందర్భంగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.అవేంటో ఓ సారి చెక్ చేసుకోండి .

కస్టమర్ తో ప్రమేయం లేకుండా....
 

కస్టమర్ తో ప్రమేయం లేకుండా....

కస్టమర్ తో ప్రమేయం లేకుండా ఓ తప్పు జరిగితే అందుకు కస్టమర్ బాధ్యత వహించడు. అయితే ఆ అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ బ్యాంకు వల్లే జరిగిందని రుజువైతే ఆ డబ్బు చెల్లంచాల్సిన బాధ్యత బ్యాంకుదే. అయితే ఇందుకు సంబంధించి కస్టమర్ కు వచ్చిన కమ్యూనికేషన్ ను 3 రోజుల్లోపు బ్యాంక్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ కస్టమర్ నిర్లక్ష్యం కారణంగానో, అవగాహనా రాహిత్యంతోనో సొమ్ము నష్టపోతే....

ఒకవేళ కస్టమర్ నిర్లక్ష్యం కారణంగానో, అవగాహనా రాహిత్యంతోనో సొమ్ము నష్టపోతే....

ఒకవేళ కస్టమర్ నిర్లక్ష్యం కారణంగానో, అవగాహనా రాహిత్యంతోనో సొమ్ము నష్టపోతే ఆ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లేదాకా పూర్తి బాధ్యత కస్టమరే వహించాలి. ఒకవేళ అనధికారిక ట్రాన్సాక్షన్ కస్టమర్ నుంచీ కాక, బ్యాంకు నుంచీ కాక థర్డ్ పర్సన్ వల్ల జరిగితే.. ఆ సమాచారాన్ని 4 నుంచి 7 రోజుల ఆలస్యంతో కస్టమర్ గనక బ్యాంకుకు తెలియజేస్తే దానికి కస్టమర్ తన టైప్ ఆఫ్ అకౌంట్ ను బట్టి రూ. 5 వేల నుంచి రూ. 25 వేల వరకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

అనధికార ట్రాన్సాక్షన్ తాలూకు సమాచారాన్ని 7 రోజుల తరువాత బ్యాంకు దృష్టికి తీసుకెళ్లినట్టయితే .....

అనధికార ట్రాన్సాక్షన్ తాలూకు సమాచారాన్ని 7 రోజుల తరువాత బ్యాంకు దృష్టికి తీసుకెళ్లినట్టయితే .....

ఒకవేళ అనధికార ట్రాన్సాక్షన్ తాలూకు సమాచారాన్ని 7 రోజుల తరువాత బ్యాంకు దృష్టికి తీసుకెళ్లినట్టయితే బ్యాంకు నిర్దేశించుకున్న పాలసీని బట్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కస్టమర్ నుంచి కంప్లయింట్ అందుకున్న 10 రోజుల్లోగా ఆ సొమ్మును షాడో రివర్సల్ పద్ధతిలో క్రెడిట్ చేయాలి. అయితే కంప్లయింట్ అందిన 90 రోజుల్లోగా ఆ కేసులో కస్టమర్ బాధ్యత ఎంతవరకో వివరిస్తూ సమస్యను పరిష్కరించాలి. ఈ క్రమంలోనే బ్యాంక్ అకౌంట్లను మొబైల్ నెంబర్లతో అనుసంధానం చేసేలా స్ట్రిక్టు గైడ్ లైన్స్ ప్రిపేరయ్యాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How much is the bank liable if your account gets hacked? Here's what RBI says .To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X