షాకింగ్.. ఐఫోన్ తయారీకి రూ.17,000 చాలట..?

Written By:

ఐఫోన్ చేతిలో ఉంటే ఆ హుందానే వేరు. ప్రపంచవ్యాప్తంగా వందల మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నప్పటికి యాపిల్ ఐఫోన్ వాడటంలో ఉన్నంత మజా ఎక్కడా దొరకదని కొందరు అభిప్రాపయపడుతుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీని మేళవించి, యాపిల్ అభివృద్థి చేస్తోన్న ఐఫోన్ లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ మిన్నంటుతోంది.

షాకింగ్.. ఐఫోన్ తయారీకి రూ.17,000 చాలట..?

సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి మాత్రం యాపిల్ ఐఫోన్ ఓ అందని ద్రాక్షలానే మిగిలింది. మార్కెట్లో రిలీజ్ అయ్యే కొత్త ఐఫోన్ లను సొంతం చేసుకోవాలంటే దాదాపు రూ.50,000 వరకు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి.

Read More : ఫిబ్రవరిలో లాంచ్ అయిన 20 స్మార్ట్‌ఫోన్‌లు

ఇటీవల మార్కెట్లో విడుదలైన యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్‌కు సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. టెక్నాలజీ పై విశ్లేషణలు జరిపే ప్రముఖ రిసెర్చ్ కంపెనీ IHS Technology సరికొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సంస్థ చెబుతోన్న దాని ప్రకారం ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ తయారీ అయ్యే ఖర్చు కేవలం 17,000నట. మార్కెట్లో ఈ ఫోన్ ఖరీదు మాత్రం 51,000. అంటే 3 రెట్లు ఎక్కువనమాట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెటీరియల్ ఖర్చు 15,800 మాత్రమేనట

షాకింగ్.. ఐఫోన్ తయారీకి 17,000 చాలట!

ఐఫోన్ 6ఎస్ ప్లస్ (16జీబి వర్షన్) తయారీకి అవసరమయ్యే ముడి మెటీరియల్ ఖర్చు 15,800 మాత్రమేనట. తయారీ వ్యయంతో కలుపుకుంటే 17,000 అవుతుందట.

ఆ కాంపోనెంట్ ఖరీదు 3,580

షాకింగ్.. ఐఫోన్ తయారీకి 17,000 చాలట!

ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఫోన్‌కు 3డీ టచ్ ఫీచర్ ప్రధాన కాంపోనెంట్‌గా నిలుస్తుంది. స్ర్కీన్‌లా ఉండే ఈ కాంపోనెంట్ ఖరీదు 3,580 మాత్రమేనట.

కెమెరాల ఖర్చు 1,530

షాకింగ్.. ఐఫోన్ తయారీకి 17,000 చాలట!

ఫోన్ ముందు, వెనుక భాగాల్లో కెమెరాలను ఏర్పాటు చేసేందుకు అయిన ఖర్చు 1,530 అట.

తేడా 1200 మాత్రమే

షాకింగ్.. ఐఫోన్ తయారీకి 17,000 చాలట!

ఫోన్ 6ఎస్ ప్లస్ ఫోన్ 64జీబి వర్షన్‌ను సొంతం చేసుకోవాలంటే అదనంగా 7,000 చెల్లించాల్సి ఉంటుంది. తయారీ విషయానికి వచ్చేసరికి 64జీబి వర్షన్ తయారీకి 16జీబి వర్షన్‌తో పోలిస్తే అదనంగా 1200 మాత్రమే ఖర్చవుతుందట.

కార్మికులకు తక్కువ జీతాలు

షాకింగ్.. ఐఫోన్ తయారీకి 17,000 చాలట!

ఒక్క ఐఫోన్ యూనిట్‌ను పూర్తిగా అసెంబుల్ చేయాలంటే 24 గంటల సమయం పడుతుందట. ఇంత కష్టపడుతున్న కార్మికులకు యాపిల్ చెల్లిస్తున్న మొత్తం గంటకు 120 మాత్రమేనట.

బోలెడంత లాభం!

షాకింగ్.. ఐఫోన్ తయారీకి 17,000 చాలట!

ఫోన్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, షిప్పింగ్, లైసెన్సింగ్, మార్కెటింగ్ ఇంకా ఇతర తృతీయ ఖర్చులను కలుపుకున్నప్పటికి ఒక్కో ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ యూనిట్ పై యాపిల్‌కు భారీ స్థాయిలోనే లాభాలు ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
టీవల మార్కెట్లో విడుదలైన యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్‌కు సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. టెక్నాలజీ పై విశ్లేషణలు జరిపే ప్రముఖ రిసెర్చ్ కంపెనీ IHS Technology సరికొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సంస్థ చెబుతోన్న దాని ప్రకారం ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ తయారీ అయ్యే ఖర్చు కేవలం 17,000నట. మార్కెట్లో ఈ ఫోన్ ఖరీదు మాత్రం 51,000. అంటే 3 రెట్లు ఎక్కువనమాట.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot