PF అడ్వాన్స్‌గా తీసుకుంటే ఎంత వస్తుంది?EPFO రూల్స్ ఏంటీ ?

By Gizbot Bureau
|

ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ అకౌంట్ కలిగి ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో మనల్ని ఆదుకుంటాయి. కేవలం రిటైర్మెంట్ తర్వాతే కాకుండా అంతకన్నా ముందే అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటాయి.

 
 PF అడ్వాన్స్‌గా తీసుకుంటే ఎంత వస్తుంది?EPFO రూల్స్ ఏంటీ ?

ఉద్యోగులు తమ జీవితంలో ఒక్కసారైనా పీఎఫ్ అడ్వాన్స్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారు. ఏవైనా అవసరాలకు పీఎఫ్ అడ్వాన్స్‌గా తీసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా EPFO కూడా వారు సర్వీస్‌లో ఉండగానే ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మరి దీని ప్రాసెస్ ఏంటీ ? అడ్వాన్స్ ఎంత ఇస్తారు లాంటి విషయాలు ఓ సారి తెలుసుకుందాం.

 Illness ( అనారోగ్యం )

Illness ( అనారోగ్యం )

Illness ( అనారోగ్యం ) మెడికల్ కోసం ఉద్యోగి PF money డ్రా చేసుకోవచ్చు. అనారోగ్య కారణాలు, వైద్య ఖర్చుల కోసం ఉద్యోగి పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి, వారి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులకు కూడా ఇది వర్తిస్తుంది. 6 నెలల బేసిక్ సాలరీ, డీఏ లేదా ఉద్యోగి మొత్తం వాటాలో ఏది తక్కువ అయితే అది విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్, కనీస సర్వీస్ కాలం లాంటి నియమాలు ఉండవు. ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు.

Higher studies ( ఉన్నత విద్య )

Higher studies ( ఉన్నత విద్య )

7Years సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగి తన పిల్లల ఉన్నత విద్య కోసం పీఎఫ్ అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. ఉద్యోగి వాటాలో వడ్డీతో కలిపి 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ కారణంతో మూడు సార్లు పీఎఫ్ అడ్వాన్స్ తీసుకునే సౌకర్యాన్ని EPFO కల్పిస్తోంది.

Marriage (పెళ్లి)
 

Marriage (పెళ్లి)

ఉద్యోగి లేదా తన సోదరి, సోదరుడు, పిల్లల పెళ్లిళ్లకు ఈపీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న మొత్తంలో దాదాపు 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలా డ్రా చేసుకోవాలంటే గత ఏడేళ్లుగా ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్ ఉండాలి. మొత్తంగా తన సర్వీస్ కాలంలో మూడుసార్లు పెళ్లి కారణంతో ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. అది కూడా గరిష్టంగా 50% వరకే పరిమితం.

Purchase or construction of a house ( ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు)

Purchase or construction of a house ( ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు)

ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నవారు కొత్త ఇల్లు, ప్లాట్, ఫ్లాట్ కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. అది కూడా సర్వీస్ కాలంలో ఒకసారి మాత్రమే ఈ కారణంతో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవాలి. 36 నెలల బేసిక్ వేతనం+డీఏ లేదా ఉద్యోగి, యజమాని వాటా మొత్తం వడ్డీతో లేదా ఇల్లు కొనుగోలుకు అయ్యే మొత్తం వీటిలో ఏది వర్తిస్తే అది మాత్రమే అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. ఇది కూడా సబ్‌స్క్రైబర్ పేరు మీద లేదా ఉద్యోగి జీవిత భాగస్వామి పేరు మీద లేదా ఉమ్మడిగా కొనే ఇంటికే వర్తిస్తుంది.

Retirement ( రిటైర్మెంట్ )

Retirement ( రిటైర్మెంట్ )

ఉద్యోగి 54 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఈపీఎఫ్ మొత్తంలో 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా రిటైర్మెంట్‌కు ఏడాది ముందు పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు.

 Unemployment (నిరుద్యోగం )

Unemployment (నిరుద్యోగం )

EPF సబ్‌స్క్రైబర్ నెల రోజుల కన్నా ఎక్కువ ఉద్యోగం లేకుండా ఉంటే ఈపీఎఫ్ మొత్తంలో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వీలుంది.

పీఎఫ్ అకౌంట్‌ను ఆన్ లైన్ ద్వారా మార్చుకోవడం ఎలా ?

పీఎఫ్ అకౌంట్‌ను ఆన్ లైన్ ద్వారా మార్చుకోవడం ఎలా ?

ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ అకౌంట్‌ను ఆన్ లైన్ ద్వారా మార్చుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మార్చుకోవచ్చు.మరి దాన్ని ప్రాసెస్ ఇదే.

ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్లో... https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ లాగిన్ కండి. అక్కడ మీ UAN నెంబర్, పాస్‌వర్డ్ టైప్‌తో ఎంటర్ అవండి. ఆ తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్‌లోని 'One Member - One EPF Account (Transfer Request)' ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్, పేరు, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ధృవీకరించుకోవడం మంచిది. Get details పైన క్లిక్ చేయండి. అప్పుడు మీ గత కంపెనీకి చెందిన పీఎఫ్ ఖాతా వివరాలు చూడగలుగుతారు. ఆ తర్వాత పాత కంపెనీ లేదా కొత్త కంపెనీ నుంచి ధృవీకరించిన ఆధారాలు ఉండాలి. మీరు పాత కంపెనీని ఎంచుకోవచ్చు. అక్కడ మెంబర్ ఐడీ, యూఏఎన్ నెంబర్ ఇవ్వాలి. ఇది పూర్తయ్యాక తదుపరి దశలో మీకు OTP వస్తుంది. క్లిక్ చేసి సబ్‌మిట్ చేస్తే, ఈపీఎఫ్ఓ వద్ద రిజిస్టర్డ్ మీ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. OTPని అక్కడ ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్ చేసి, సబ్‌మిట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఫాం 13ని నింపవలసి ఉంటుంది. ప్రస్తుత, పాత కంపెనీల పీఎఫ్ అకౌంట్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాలి. ట్రాన్సఫర్ క్లెయిమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత సబ్‌మిట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత పది రోజుల్లో ప్రాసెస్ పూర్తవుతుంది.

 

Best Mobiles in India

English summary
EPF advance: Check how much money you can withdraw from your PF account

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X