Home
News

స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎంత ఉంటే ఫోన్ ఫర్పెక్ట్‌గా రన్ అవుతుంది

By Gizbot Bureau

స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర అనేది కీలకమైనప్పటికి అది కొంత వరకు మాత్రమేనని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరి ఇలాంటపుడు ఒక స్మార్ట్‌ఫోన్ పర్‌ఫెక్ట్‌గా పనిచేయాలంటే ఎంత ర్యామ్ ఉంటే సరిపోతుంది..? ఇప్పటి ఫోన్లలో 3,4,6,8,జిబి ర్యామ్ అందుబాటులో ఉంది. అదే పదేళ్లు వెనక్కు వెళితే కేవలం 192 ఎంబీ ర్యామ్ మాత్రమే ఉందంటే నమ్ముతారా? అంతేకాదు... 3.15 మెగాపిక్సెల్ కెమెరా, 1,150 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉండేది.

How Much RAM Does My Smartphone Really Need?

తరం మారింది. అలాగే టెక్నాలజీ పుంజుకుంది. స్మార్ట్‌ఫోన్ పెర్ఫామెన్స్ బాగుండాలన్నా, మల్టీ-టాస్కింగ్‌లో సమస్యలు రావొద్దన్నా ర్యామ్ చాలా ముఖ్యం. ప్రాసెసర్ ఒక్కటే బాగుంటే సరిపోదు... ర్యామ్ కూడా సరిపడా ఉండాలి. మరి ఎంత వరకు ర్యామ్ ఉండాలనే దానిపై ఓ లుక్కేద్దాం.

RAM అంటే ఏంటి..?

RAM అంటే ఏంటి..?

ర్యామ్ (ర్యాండమ్ యాక్సెస్ మెమరీ) అనేది ఫోన్‌ను రన్ చేసేందుకు అవసరమైన ఆపరేటింగ్ సిస్టం, రన్ అవుతోన్న యాప్స్ ఇంకా కొంత టెంపరరీ డేటాను తనలో స్టోర్ చేసుకుంటుంది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ కంటే వేగంగా స్పందించ గల సామర్థ్యం ర్యామ్‌కు ఉంటుంది. ర్యామ్‌లో స్టోర్ కాబడిన డేటాను వేగవంతంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

RAM తన పరిధిని ఎట్లా విస్తరించుకుంది..?

RAM తన పరిధిని ఎట్లా విస్తరించుకుంది..?

మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి. వీటిలో మల్టీ టాస్కింగ్ మందకొడిగా ఉండేది. ఈ నేపధ్యంలో మల్టీ టాస్కింగ్ వేగాన్ని మరింత పెంచుతూ 1జీబి, 2జీబి, 3జీబి, 4జీబి, 6జీబి ర్యామ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి.

ప్రస్తుత అవసరాలను బట్టి చూస్తే స్మార్ట్‌ఫోన్‌ను తక్కువగా ఉపయోగించేవారికి 2జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ సరిపోతుంది. కాస్త ఎక్కువగా ఉపయోగించేవాళ్లయితే 3జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ తీసుకోవచ్చు. ఒకవేళ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఎక్కువగా వాడుతున్నారంటే 4జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ తీసుకోవాల్సిందే. అంతకన్నా ఎక్కువ ర్యామ్ ఉన్న ఫోన్‌లు పెద్దగా అవసరమే ఉండదు. 4జీబీ ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్‌ను చక్కగా ఉపయోగించుకుంటున్నప్పుడు 6జీబీ, 8జీబీ ర్యామ్ ఉన్న ఫోన్లు అవసరమే లేదు. ఓ రెండేళ్ల తర్వాత అయితే అప్పటి యాప్స్, అవసరాలను బట్టి 6జీబీ లేదా 8జీబీ ర్యామ్ ఉన్న ఫోన్లు తీసుకోవచ్చు.

 

కంప్యూటర్లు

కంప్యూటర్లు

మార్కెట్లో లభ్యమయ్యే చాలా వరకు కంప్యూటర్లు 4జీబి అంతకన్నా తక్కువ ర్యామ్ సామర్థ్యంతో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంప్యూటర్ కన్నా చాలా తక్కువ పరిమాణంలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు 6జీబి ర్యామ్ అవసరమా అన్న సందిగ్థత పలువురిలో వ్యక్తమవుతోంది. మైక్రోసాఫ్ట్ ఇటీవల తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ డాక్యుమెంటేషన్‌ను విడుదల చేసింది. ఈ డాక్యుమెంటేషన్ ప్రకారం విండోస్ 10 ఓఎస్‌ను రన్ చేసేందుకు 32 బిట్ వర్షన్‌కు 1జీబి ర్యామ్, 64 బిట్ వర్షన్‌కు 2జీబి ర్యామ్ సరిపోతుందట. అన్ని విండోస్ 10 కంప్యూటింగ్ డివైస్‌లకు ఇది వర్తిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టంల మధ్య తేడాలు

ఆపరేటింగ్ సిస్టంల మధ్య తేడాలు

ఆపరేటింగ్ సిస్టంల మధ్య తేడాలు నెలకున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ఎక్కువ ర్యామ్ అవసరమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు ఆండ్రాయిడ్ యాప్స్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, యాప్‌కు సంబంధించిన మెమరీ రీసైకిలింగ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియనే గార్బేజ్ కలెక్షన్ అని కూడా అంటారు. ఇదే సమయంలో ఐఓఎస్ ప్లాట్‌ఫామ్ కోసం డిజైన్ చేయబడిన iOS యాప్స్‌కు ఇంత తతంగం అవసరం ఉండదు.

ర్యామ్ వినియోగం

ర్యామ్ వినియోగం

ఒక్కో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒక్కోరకమైన సాఫ్ట్‌వేర్‌తో వస్తోన్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ర్యామ్ వినియోగం విస్తృతమవుతోంది. ఉదాహరణకు, గూగుల్ నెక్సుస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు 1.2జీబి ర్యామ్ అవసరమవుతుంది (యాప్స్‌తో సంబంధం లేకుండా). ఇదే సమయంలో ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం 1.39జీబి ర్యామ్‌ను ఉపయోగించుకుంటుంది. గెలాక్సీ నోట్ 5 ఫోన్ 1.7జీబి ర్యామ్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అదనంగా బ్యాక్ గ్రౌండ్ సర్వీసులు రన్ చేస్తున్నట్లయితే ర్యామ్ వినియోగం మరింత అవసరమవుతుంది. ఫోన్‌లో ఏ విధమైన యాప్స్ లేకపోయినట్లయితే 1జీబి లేదా 2జీబి ర్యామ్ ఫోన్ మీ మల్టీ టాస్కింగ్‌కు సరిపోతుంది. అలా కాకుండా మీ ఫోన్‌లో పిచ్చాపాటిగా యాప్స్ ఉన్నట్లయితే ర్యామ్ పై ఒత్తిడి మరింత పెరిగి ఫోన్ నెమ్మదించే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ యాప్స్‌ను రన్ చేసే అలవాటున్న వారికి 4జిబి ర్యామ్ ఫోన్ సరిపోతుంది!.

More from GizBot

Best Mobiles in India

English summary
How Much RAM Does My Smartphone Really Need?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X