భూమి అంతమయితే సూర్యుని రూపం ఇదేనా ?

By Hazarath
|

భూమి అంతమయితే మన సూర్యుడు ఎలా ఉండబోతున్నాడు. ప్రపంచం ఒకవేళ కనుమరుగయితే సూర్యుడు తన రూపాన్ని అలాగే ప్రకాశవంతంగా ఉంచుకోనున్నాడా..లేక తన శక్తిని కోల్పోనున్నాడా..దాదాపు పూర్తిగా కనిపించకుండా పోయే స్థితిలోకి రానున్నాడా.. అంతటి వేడిని కురిపించే భానుడు ఇక చచ్చిపోనున్నాడా అంటే అవుననే అంటోంది యూరోపియన్ ఏజెన్సీ హుబుల్

Read more: అందమైన అమ్మాయిలు మార్స్ మీద చక్కర్లు

sun

భూమి అంతమయ్యే సమయంలో సూర్యుడు తన ప్రాభవాన్ని కోల్పోనున్నాడని ఇది జరగడానికి దాదాపు అయిదు బిలియన్ల సంవత్సరాల కాలం పట్టవచ్చని హుబుల్ చెబుతోంది. గ్యాస్ నుంచి వెలువడే అనేక ఉద్గారాలు సూర్యుని రూపురేఖలు మార్చివేస్తాయని ఎర్రని సూర్యడు పచ్చని రంగులోకి మారుతాడని యూరోపియన్ స్సేస్ ఏజెన్సీ చెబుతోంది. అయితే ఇది జరగడానికి అయిదు బిలియన్ల సంవత్సరాల కాలం పట్టే అవకాశం ఉందని అప్పటిదాకా సూర్యుడు తన రూపును కోల్పోతూ వస్తూ ఉంటాడని వారు తీసిన ఇమేజ్ ను బట్టి తెలుస్తోంది.

Read more: మామ్ ఏడాది పయనంలో మరచిపోలేని చిత్రాలెన్నో..

sun

సూర్యుడు తన వేడి కిరణాలను క్రమక్రమంగా కోల్పోతూ చల్లని తెల్లని కిరణాలను ప్రసరింపచేస్తాడని అప్పుడు భూమి అంతమవుతుందని సూర్యుడు మరణిస్తాడని వారు అంటున్నారు. అయితే దీన్ని కొందరు కొట్టిపారేస్తున్నారు. అదంతా ఓ భూటకమంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. న్యూక్లియర్ వినాశనం వల్ల కూడా ఇది జరిగే అవకాశం ఉందని హుబుల్ చెబుతోంది.

Read more: ఇస్రో: భారతీయులు తెలుసుకోవాల్సిన నిజాలు !

sun

దీనికి ఊతంగా హుబుల్ టెలిస్కోప్ నుంచి వైడ్ ఫీల్డ్ ప్లానెటరీ కెమెరాతో తీసిన ఈ ప్రెట్టీ ఫోటోనే సాక్ష్యంగా చూపుతున్నారు. మరి అది నిజమా కాదా అన్నది తెలియాలంటే మరో పరిశోధన తప్పదు. ఇదిలా ఉంటే పై నుంచి మృత్యువు ముంచుకొస్తోంది. రకరకాల వస్తువులు భూమి మీద పడబోతున్నాయని నాసా శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Read more: అంతరిక్షంలో జంతువుల హడావుడి

1

1

అమెరికా అంతరిక్ష సంస్థ - నాసా ప్రకారం 20వేలకు పైగా శాటిలైట్ వ్యర్థాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. వీటిలో చాలా వస్తువులు ఫుట్ బాల్ కంటే పెద్ద సైజులో ఉన్నాయి.

 

 

2

2

వీటితోపాటు మరో 5లక్షల చిన్న వ్యర్థాలు కూడా శూన్యంలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. ఇవి నట్లు, బోల్టులు, మేకుల వంటివి. ఇక గుర్తుపట్టలేనంత చిన్న వస్తువులు లక్షలాదిగా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.

3

3

ఇవి గంటకు 28వేల కిలోమీటర్లకు పైగా వేగంతో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. మనం విసిరే రాయి తలకు తగిలితేనే బ్లడ్ వస్తుంది. అలాంటిది ఇంత వేగంతో తిరిగే వస్తువు వ్యోమగాములకు తగిలితే ఏమవుతుందో ఊహించారా?

 

 

4

4

అది మన శరీరాన్ని రెండుగా చీల్చుకుంటూ వెళ్లిపోవడం ఖాయం. గన్ నుంచి వచ్చే బుల్లెట్ గంటకు 4,500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ అంతరిక్ష వస్తువులు అంతకు ఆరు రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తున్నాయి.

 

 

5

5

అభివృద్ధి పేరుతో మనం భూమి చుట్టూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాం. ప్రపంచ దేశాల శాటిలైట్లు భూకక్ష్యలో తిరుగుతూ సేవలు అందిస్తున్నాయిగానీ, కాలపరిమితి ముగిసినవి మాత్రం ముక్కలైపోతూ అంతరిక్ష చెత్తలా మారుతున్నాయి.

 

 

6

6

వాటిని తిరిగి భూమికి తెచ్చేందుకు ఏ దేశమూ ప్రయత్నించట్లేదు. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం మరి. చిన్న చిన్న వ్యర్థాల వల్ల ప్రస్తుత శాటిలైట్లకూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చాలా నష్టం జరుగుతోంది. స్పేస్ షటిల్స్ అద్దాలు, కిటికీలూ, సోలార్ ప్లేట్లూ దెబ్బతింటున్నాయి.

 

 

7

7

2009లో అమెరికాకు చెందిన ఇరిడియం శాటిలైట్ ను రష్యాకు చెందిన పాతకాలపు ఉపగ్రహం ఢీకొట్టింది.

 

 

8

8

2007లో ఓ పాతకాలపు వాతావరణ శాటిలైట్ ను నాశనం చేసేద్దామని చైనా ఓ క్షిపణిని ప్రయోగించింది. క్షిపణి దాడికి శాటిలైట్ ముక్కలై 3వేల వ్యర్థాలు శూన్యంలో తిరగడం మొదలుపెట్టాయి. ఇప్పటికీ అవి తిరుగుతూనే ఉన్నాయి.

 

 

9

9

ఈ అంతరిక్ష వ్యర్థాలు ఒక్కోసారి గతి తప్పి భూమిపై పడుతున్నాయి. ఇళ్లు, అపార్ట్ మెంట్లపై కూలుతున్నాయి. అగ్ని ప్రమాదాలు, కార్చిచ్చులకు కారణమవుతున్నాయి.

 

 

10

10

ఫలితంగా తీవ్ర ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం జరుగుతోంది. శాటిలైట్ ను పైకి పంపించేటప్పుడే, దాని కాలపరిమితి ముగిసిన తర్వాత, తిరిగి భూమిపై పడిపోయేలా చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

 

 

11

11

2002లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇంటెగ్రల్ మిషన్ ను పైకి పంపించింది. దాని కాలపరిమితి 2028లో ముగుస్తుంది.

 

 

12

12

అదే ఏడాది లేదా తర్వాతి సంవత్సరం అది భూమిపై పడేలా ప్రోగ్రాం రూపొందించారు. ఆ ఫలితాలు తేలడానికి మనం దశాబ్దం పైనే ఆగాలి.

 

 

Best Mobiles in India

English summary
Here Write How our world will end: Hubble image gives a glimpse of what the sun will look like when it dies (but don't worry, we've got at least 5 BILLION years left)

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X