పాస్‌వర్డ్‌తో పెన్‌డ్రైవ్ లోని ఫైల్లను భద్రపరచడం ఎలా?

Posted By: Staff

How to Password Protect a Pen Drive?

విండోస్ ఆపరేటింగ్ సిస్టం లోని “బిట్ లాకర్” అనే ప్రోగ్రాం సాయంతో ఎటువంటి ఇతర సాప్ట్ వేర్ సహాయం లేకుండానే మన పెన్‌‌డ్రైవ్ కు పాస్‌వర్డ్‌ని సెట్ చేసుకొని మన ఫైల్స్ కు భద్రత కల్పించుకోవచ్చు. అది ఎలా అన్నది చూద్దాం.

మీ పెన్‌‌డ్రైవ్‌ను కంప్యూటర్‍కు కనెక్టు చేసి, దానిపై రైట్ క్లిక్ చేసి ‘టర్న్ ఆన్ బిట్ లాకర్’ అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి. అప్పుడు ఓపెన్ అయ్యే విండోలో మీరు ఒక పాస్‍వర్డ్ ఎంచుకోండి. తరవాత next పై క్లిక్ చేసాక save the recovery key to file అనే ఆప్షన్ ద్వారా మీ పాస్‍వర్డ్ కంప్యూటర్ లో ఎక్కడైనా సేవ్ చేసుకొని మరచి పోయినపుడు పొందవచ్చు.

Start encryption అని ప్రెస్ చెయ్యడం తోనే మీ పైల్స్ అన్నీ encrypt చేయబడుతాయి. (మీ పైల్స్ సైజును బట్టి ఈ సమయం ఆధారపడి ఉంటుంది). అది పూర్తి అయ్యాక పెన్‌‌డ్రైవ్ ను తీసి మరలా కనెక్ట్ చెయ్యండి. ఇకపై మీరు ఎప్పుడు ఏ పీసీకి కనెక్టు చేసినా ఇలా Password ఇస్తేనే ఓపెన్ అవుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting