ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో అన్నా హజారేకి పూర్తి మద్దతు

Posted By: Staff

ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో అన్నా హజారేకి పూర్తి మద్దతు

సామాజిక వెబ్ సైట్లు అయిన ట్విట్టర్, ఫేస్ బుక్ లలో అన్నా హజారే బృందం తలపెట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు విస్తృతంగా లభిస్తోంది. ఐతే ఇది ఉద్యమం బౌతికంగా వ్యాప్తి చెందడానికి దోహదపడడం లేదు. అది వీలు కూడా కాదు. నిజ జీవితంలో ప్రజా సంఘాలు అనేక కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు, ధర్నాలు అనేకం చేస్తుంటాయి. వీటిని చూసి లేదా విని స్పందించని జనం, వంటరిగా కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యమాల వార్తలు చదివి ప్రేరేపణ పొందుతారని భావించడం సరైన పద్దతి కాదు.

అయితే అప్పటికే అన్నా ఉద్యమం నుండి స్ఫూర్తి పొందిన వారు ఇంటర్నెట్ తో కూడా పరిచయం, సంబంధం ఉన్నట్లయితే వారి చురుకుదనం ఇంటర్నెట్ కి కూడా వ్యాపించడం జరుగుతోంది తప్ప కొత్తగా ఉద్యమాన్ని పుట్టించగల శక్తి, వ్యాప్తి చేయగల శక్తి ఇంటర్నెట్ ప్రచారానికి లేదు. అన్నా హజారే ఉద్యమం గ్రామీణ ప్రజలెవ్వరికీ తెలీదు. అది ప్రధానంగా చదువరులు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల మధ్య తరగతి ప్రజానీకన్నే ఇప్పటివరకూ ఆకర్షించ గలిగింది. ట్విట్టర్ , ఫేస్ బుక్ లలో అన్నా ఉద్యమ వ్యాప్తికి సంబంధించిన ఇమేజిని ప్రక్కన చూడోచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting