దూసుకొస్తున్న క్వాల్కమ్ కొత్త చిప్

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ చిప్ మేకర్ క్వాల్కమ్ (Qualcomm) గత వారం న్యూయార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా తన తదుపరి వర్షన్ స్నాప్‌డ్రాగన్ 820 సీపీయూను లాంచ్ చేసింది. 2016లో అందుబాటులోకి రాబోతున్న తమ ఫ్లాగ్‌షిప్ చిప్‌‍సెట్ హై-స్పీడ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుందని క్వాల్కమ్ చెబుతోంది.

పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఈ చిప్‌సెట్ ఫోన్ బ్యాటరీతో పాటు పనితీరును రెట్టింపు చేస్తుందని కంపెనీ థీమా వ్యక్తం చేస్తోంది. స్నాప్‌డ్రాగన్ 820 చిప్ సెట్ 600 ఎంబీపీఎస్ వరకు 4జీ ఎల్టీఈ స్పీడ్‌లను ఆఫర్ చేయగలదని తెలుస్తోంది . 64 బిట్ Kryo సీపీయూ, 14ఎన్ఎమ్ క్వాడ్ సీపీయూ, అడ్రినో 530 జీపీయూలతో ఈ సరికొత్త చిప్‌సెట్‌ను క్వాల్కమ్ అభివృద్థి చేసింది. క్వాల్కమ్ కొత్త చిప్‌కు సంబంధించి 5 ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దూసుకొస్తున్న క్వాల్కమ్ కొత్త చిప్

పాత చిప్‌సెట్‌లతో పోలిస్తే క్వాల్కమ్ కొత్త చిప్‌సెట్ వేగవంతంగా అదే సమయంలో ఖచ్చితత్వంతో స్పందిస్తుంది. కేవలం 30 శాతం ఎనర్జీని మాత్రమే ఈ చిప్ కన్స్యూమ్ చేసుకుంటుంది.

దూసుకొస్తున్న క్వాల్కమ్ కొత్త చిప్

వేగవంతమైన 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌లను కొత్త చిప్‌సెట్ సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 600 ఎంబీపీఎస్ వరకు 4జీ ఎల్టీఈ స్పీడ్‌లను ఈ చిప్ అందుకోగలదు.

దూసుకొస్తున్న క్వాల్కమ్ కొత్త చిప్

క్వాల్కమ్ తన కొత్త చిప్‌సెట్‌లో శక్తివంతమైన అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని పొందుపరిచింది.

దూసుకొస్తున్న క్వాల్కమ్ కొత్త చిప్

స్నాప్‌డ్రాగన్ 820 చిప్‌సెట్‌లో పొందుపరిచిన సరికొత్త X12 LTE మోడెమ్ నెట్ వర్క్ ప్రొవైడర్‌ను బట్టి గరిష్టంగా 600 ఎంబీపీఎస్ వేగంతో డౌన్‌లోడ్ స్పీడ్‌లను చేరువ చేస్తుంది. గరిష్ట అప్ లోడ్ వేగం 150 ఎంబీపీఎస్.

దూసుకొస్తున్న క్వాల్కమ్ కొత్త చిప్

స్నాప్‌డ్రాగన్ 820 చిప్‌సెట్‌, అత్యుత్తమ 3డీ ఆడియో అనుభూతులను చేరువ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How Qualcomm Snapdragon 820 Will Improve Smartphones In 2016. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot