పేక ముక్కలతో బ్యాటరీ చార్జర్!!

|

అవును.. ‘ఆలోచిస్తే ఏదైనా సాధ్యమే'. ఎందుకూ పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలతో విద్యుత్‌ను సృష్టిస్తున్న రోజులివి. సాధారణంగా ఒక రీచార్జబుల్ బ్యాటరీని చార్జర్ ద్వారా పూర్తిగా చార్జ్ చేయాలంటే సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఈ పూర్తి తతంగం పై విసిగివేసారిన Shawn Frayne అనే యూజర్ తన ఆలోచనా పరిజ్ఞానంతో సరికొత్త సోలార్ బ్యాటరీ చార్జర్‌ను రూపొందించారు. ఈ చార్జర్‌కు కరెంట్ అవసరం లేదు. ఎండు నుంచి వెలువడే వెళుతురు నుంచే శక్తిని గ్రహించుకుని బ్యాటరీలను చార్జ్ చేస్తుంది. తక్కువ ఖర్చుతో పేక ముక్కలు ఆధారంగా రూపకల్పన చేయబడిన ఈ సోలార్ బ్యాటరీ చార్జర్ అదరహో అనిపిస్తోంది.

Article Source: news.distractify.com

పేక ముక్కులతో బ్యాటరీ చార్జర్ ఏలా సాధ్యమా, అని ఆలోచిస్తున్నారా..?. ఈ కిటుకేంటో తెలుసుకునేందుకు క్రింది స్లైడ్‌షోలోకి వచ్చేయండి...

పేక ముక్కతో బ్యాటరీ చార్జర్!!

పేక ముక్కతో బ్యాటరీ చార్జర్!!

తక్కువ ఖర్చుతో కూడిన సోలార్ బ్యాటరీ చార్జర్ రూపకల్పనలో భాగంగా షాన్ ఫ్రేన్ ముందుగా పేక ముక్కలతో పాటు, కాపర్ టేప్, సూపర్ గ్లూ, 1/4 "- 1/2" వ్యాసం అలానే 1/32 "- 1/8" మందంతో కూడిన నాలుగు ఎన్‌డి‌ఎఫ్ఈబి మాగ్నెట్‌లు, 4 నుంచి 8 ముడి లేజర్ కట్ పీవీ సిలికాన్ సెల్స్ (సోలార్ పలకలు), జిగురు, అలానే కొన్ని ఏఏ రీచార్జబుల్ బ్యాటరీలను సమీకరించారు.

 

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

తదుపరి చర్యలో భాగంగా పేక ముక్కను రెండు కాళ్ల టేబుల్ తరహాలో బెండ్ చేసారు. సమాంతరంగా వొంచిన పేక ముక్క రెండు కోణాలకు అటు ఇటు కాపర్ టేప్‌ను అతికించారు.

 

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

తదుపరి చర్యలో భాగంగా బ్యాటరీ ప్లే కార్డ్ చార్జర్‌లో సరిగ్గా స్థిరపడే విధంగా నాలుగు మాగ్నెట్‌లను కాపర్ టేప్ అమర్చిన పైనా క్రిందా భాగాల్లో ఒకే ప్రాంతంలో ఫిట్ చేసారు.

 

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

తదుపరి చర్యలో భాగంగా కార్డ్ చార్జర్ పై భాగంలో సోలార్ ప్యానళ్లను సూపర్ గ్లూ సాయంతో అంటించారు.

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

తదుపరి చర్యలో భాగంగా తయారైన ప్లే కార్డ్ చార్జర్ మరింత పటిష్టంగా ఉండేందుకు జిగురు సహాయంతో ఓ ప్రత్యేకమైన పొరను చార్జర్ పైనా క్రిందా భాగాల్లో నెలకొల్పారు. (గమనిక: ప్లే కార్డ్ చార్జర్ క్రింది భాగంలో ఏర్పాటు చేసిన మాగ్నెట్‌ల పై జిగురును వినియోగించవద్దు. అలా చేసినట్లయితే పవర్ సప్లైకు అంతరాయం కలుగుతుంది).

 

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

వినియోగానికి సిద్ధమైన ప్లే కార్డ్ చార్జర్‌ను ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తరువాత నుంచి వినియోగించటం ప్రారంభించండి.

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

సోలార్ బ్యాటరీ చార్జర్ లో ఏఏ లేదా ఏఏఏ సామర్థ్యం గల రీచార్జబుల్ బ్యాటరీలను అమర్చి ఇలా ఎంట వెళుతురులో ఉంచితే చాలు.. గ్రహించే సోలార్ శక్తి ద్వారా బ్యాటరీ చార్జ్ అవటం ప్రారంభిస్తుంది.

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

పేక ముక్కతో సోలార్ బ్యాటరీ చార్జర్!!

వినియోగానికి సిద్ధంగా ఉన్న ప్లేకార్డ్ రీచార్జబుల్ బ్యాటరీ చార్జర్

పేక ముక్కులతో డిజైన్ చేసిన సోలార్ బ్యాటరీ చార్జర్ తయారీ అలానే పనితీరును క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/nsX6r-_Nn6Y? feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

English summary
How To Recharge Batteries With Just A Playing Card And The Sun. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X