జీమెయిల్‌ సమాచారాన్ని భద్రంగా బ్యాక్‌అప్‌ చేసుకునే మార్గాలు...!

Posted By: Staff

జీమెయిల్‌ సమాచారాన్ని భద్రంగా బ్యాక్‌అప్‌ చేసుకునే మార్గాలు...!

ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్‌ను వాడుతున్న వారి సంఖ్య 190 మిలియన్లు. అందుకనే గతంలో జీమెయిల్‌ ఎకౌంట్‌లో తలెత్తిన అప్‌డేట్‌ సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అప్పట్లో సుమారు 15,00,000 మెయిల్‌ ఎకౌంట్లలో డేటా పూర్తిగా పోయింది. ఇన్‌బాక్స్‌తో సహా ఎటాచ్‌మెంట్‌లు, డాక్యుమెంట్‌లు, కాంటాక్ట్‌లు, ఛార్ట్‌లు మొత్తం ఖాళీ. జీమెయిల్‌ నిర్వాహకులు డేటాని సురక్షితంగా తిరిగి పొందే సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో జీమెయిల్‌ డేటాని సురక్షితం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలేంటో చూద్దాం!

జీమెయిల్‌లోనే మరో ప్రత్యేక ఎకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవడం ఓ చక్కని మార్గం. దీన్నే సెంకడరీ ఎకౌంట్‌ అంటారు. నిత్యం వాడే ప్రైమరీ ఎకౌంట్‌ నుంచి ఎప్పటికప్పుడు ముఖ్యమైన ఫైల్స్‌ని దీనికి ఫార్వర్డ్‌ చేసుకోవాలి. అలాగే కాంటాక్ట్స్‌ని కూడా సెకండరీలోకి అప్‌లోడ్‌ చేసుకోండి. కొత్త మెయిల్‌ ఐడీలోని కుడివైపు కనిపించే 'మెయిల్‌ సెట్టింగ్స్‌'లోకి వెళ్లి Accounts and Import ట్యాబ్‌ ద్వారా ఈ పని సులువు. అందుకు ప్రైమరీ మెయిల్‌ ఐడీని POP3లో యాడ్‌ చేసుకోవాలి. అదే పేజీలో Check mail using POP3-> Add POP3 email accountలోకి వెళ్లి ప్రైమెరీ ఎకౌంట్‌ వివరాలతో యాడ్‌ చేయాలి. మెయిల్‌ను సైన్‌అవుట్‌ చేసినప్పటికీ ఇంపోర్టింగ్‌ కొనసాగుతుంది.

Gmail Backup అనే సాఫ్ట్‌వేర్‌ జీమెయిల్‌కు ప్రత్యేకం. డౌన్‌లోడ్‌ చేసుకుని తెరపై వచ్చిన గుర్తుతో రన్‌ చేస్తే బ్యాక్‌అప్‌ విండో వస్తుంది. దాంట్లో బ్యాక్‌అప్‌ చేయాల్సిన మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, బ్యాక్‌అప్‌ ఫోల్డర్‌ వివరాల్ని ఎంటర్‌ చేసి Backupపై క్లిక్‌ చేస్తే చాలు. మీరు ఎంచుకున్న డ్రైవ్‌లోకి మెయిల్స్‌ బ్యాక్‌అప్‌ అవుతాయి. తేదీల ఆధారంగా కూడా మెయిల్స్‌ని ఎంపిక చేసుకునే వీలుంది. Newest emails only ద్వారా కేవలం కొత్తగా వచ్చిన వాటినే ఎంపిక చేసుకోవచ్చు. www.gmail-backup.com/download

ప్రపంచ వ్యాప్తంగా 364 మిలియన్ల మంది వాడుతున్న హాట్‌ మెయిల్‌లోకి కూడా జీమెయిల్‌ డేటాను పంపవచ్చు. Trueswitchతో ఇది ఇట్టే సాధ్యం. పెయిడ్‌ సర్వీసు అయినప్పటికీ హాట్‌మెయిల్‌ యూజర్లు ఉచితంగా వాడుకోవచ్చు. https://secur e5.trueswitch.com/winlive లింక్‌లోకి వెళ్లి వెబ్‌ పేజీలోని వివరాల్ని నింపాలి. డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే Other e-mail, passwordల్లో జీమెయిల్‌ ఐడీ వివరాలు ఎంటర్‌ చేయాలి. తర్వాత బాక్స్‌లో హాట్‌మెయిల్‌ వివరాల్ని ఎంటర్‌ చేసి Copy your e-mail messages, Copy your address book చెక్‌ చేయండి. 30 రోజులకు ఒకసారి జీమెయిల్‌కి వచ్చిన మెయిల్స్‌ హాట్‌మెయిల్‌లోకి ఇంపోర్ట్‌ అవ్వాలంటే forward e-mails for 30 days to your hotmail addressను చెక్‌ చేయండి.

మెయిల్‌స్టోర్‌, మెయిల్‌కీపర్‌ అనే రెండు సాఫ్ట్‌వేర్‌ సర్వీసులు కూడా ఉన్నాయి. హోం యూజర్ల కోసం Mailstore Home 4.2 వెర్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. POP3, IMAP ఇంటర్ఫేస్‌లతో ఒకేసారి మల్టిపుల్‌ ఇన్‌బాక్స్‌లను యాక్సెస్‌ చేసే వీలుంది. జీమెయిల్‌ బ్యాక్‌అప్‌ అప్లికేషన్‌ మాదిరిగానే మెయిల్‌ వివరాల్ని ఎంటర్‌ చేసి బ్యాక్‌అప్‌ చేయవచ్చు. www.mailstore.com అలాగే జీమెయిల్‌ కీపర్‌ ట్రయిల్‌ వెర్షన్‌తో కూడా చేయవచ్చు. www.gmailkeeper.com

జీమెయిల్‌, గూగుల్‌ డాక్యుమెంట్‌లు, పికాస, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, జోహో... సర్వీసుల్ని ఒకేచోట బ్యాక్‌అప్‌ చేయాలంటే backupifyలో సభ్యులైపోండి. ఫ్రీ ప్లాన్‌ ఎంచుకుని ఐదు ఎకౌంట్‌ల డేటాని భద్రం చేసుకునే వీలుంది. ఒక్కో ఎకౌంట్‌కు ఉచితంగా 2జీబీ స్పేస్‌ అందిస్తున్నారు. www.backupify.com

* మెయిల్‌ ఎకౌంట్‌ మాత్రమే గుర్తుండి పాస్‌వర్డ్‌ మర్చిపోయినా డేటాను రికవర్‌ చేయవచ్చు. కాకపోతే రెండు మూడు నెలల సమయం పడుతుంది. గుర్తుంపు వివరాలు, వ్యక్తిగత సమాచారం, మెయిల్‌ ఐడీకి ఎక్కువగా వచ్చే మెయిల్స్‌, మెయిల్‌ హెడ్డర్‌ లాంటి వివరాల్ని జీమెయిల్‌ నిర్వాహకులకు పంపాలి.
* జీమెయిల్‌కి ఎంచుకునే పాస్‌వర్డ్‌ అర్థవంతమైన పదమై ఉండకూడదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot