ఇన్‌బాక్స్‌ స్పామ్ మెయిల్స్ తొలగించడం ఎలా?

By Super
|
Mail Inbox
మీ ఇమెయిల్‌ 'ఇన్‌బాక్స్‌' మొత్తం కొత్త మెసేజ్‌లతో నిండిపోతోందా? ఆ మెయిల్స్‌ మీకు తెలిసినవారినుంచి వచ్చినవి కావా? మీరు వాటిని క్లిక్‌ చేస్తే వాటిలో ఉన్న 'సబ్జక్ట్‌ లైన్స్‌' మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లు గుర్తించారా? వాణిజ్య ప్రకటనలు లేక తప్పుదోవ పట్టించే సమాచారం ద్వారా మీరు ఆ లింకులపై క్లిక్‌ చేస్తే వేరే వెబ్‌సైట్లలోకి ప్రవేశించే విధంగా అవి వున్నాయా? అయితే వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. అటువంటి సమయంలో ఏం చేయాలి?

స్పామ్‌(SPAM) నుంచి తప్పించుకునే ఉపాయాలు:

మీ ఇమెయిల్‌ అడ్రస్‌ను యథాతథంగా ఇంటర్నెట్‌లో ఉంచకండి. ఒకవేళ మీ ఇమెయిల్‌ అడ్రస్‌ పెట్టవలసిన అవసరం ఏర్పడితే, దాన్ని ముందు వెనకాల చిన్న చిన్న మార్పులతో, లేక అడ్రస్‌నే ముందు వెనుకలుగా మార్చి ఇంటర్నెట్‌లో పెట్టండి. స్పామర్లు గూగుల్‌ వంటి వెబ్‌సెర్చ్‌ ఇంజన్‌లలో ప్రవేశించిన వెంటనే మీ ఇమెయిల్‌ అడ్రస్‌ సులువుగా వారికి కన్పించేలా ఉందేమో గమనించండి. చాలా రకాల ISP ఉచిత ఇమెయిల్‌ అడ్రస్‌లను ఇస్తున్నాయి. అందులో మీరు రెండు ఇమెయిల్‌ అడ్రస్‌లను క్రియేట్‌ చేసుకొని a)ఒకటి స్నేహితులకు, సహ ఉద్యోగులకు, బంధువులకు మెయిల్‌ చేసేందుకు ఉపయోగించవచ్చు. b)రెండవ దాన్ని న్యూస్‌ లెటర్‌లను రాసుకోవడానికి లేక ఫోరమ్స్‌ను పోస్టింగ్‌ చేయడానికి మరియు ఇతర పబ్లిక్‌ లొకేషన్ల కోసం వినియోగించుకోండి.

చాలా ISP ఉచితంగా 'స్పామ్‌' ఫిల్టరింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వీటిని తప్పక ఉపయోగించండి. అయినా మీకు వచ్చే స్పామ్స్‌ గురించి మీ ISPకి ఫిర్యాదు చేయండి. న్యూస్‌ గ్రూప్‌ పోస్టింగులకు సమాధానాలు రాసేటప్పుడు ఇమెయిల్‌ ఐడీలను దానికి అనుసంధానించి పంపకండి. వెబ్‌ఫామ్‌లను నింపుతున్నపుడు ఆ సైట్‌ ప్రైవసీ పాలసీని తప్పని సరిగా చెక్‌ చేయండి. ఆ సైట్‌ మీ మెయిల్‌ అడ్రస్‌లను ఇతర కంపెనీలకు అమ్మడం కానీ లేక ఇవ్వడం /పంపడం కానీ చేస్తుందేమో పరిశీలించిన తర్వాతనే దాన్ని పూర్తి చేయండి. మీకు వచ్చే స్పామ్‌ మెయిల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిస్పందించకండి. ఒకవేళ మీరు సమాధాన మిచ్చినట్లయితే, మీ మెయిల్‌ ఐడీలను తన మెయిలింగ్‌ లిస్ట్‌ నుంచి తొలగించమని రిక్వెస్ట్‌ చేయండి.

మీ సిస్టమ్‌లోని యాంటీ-వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అయ్యేలా చూసుకోండి. ఎన్నో వైరస్‌లు, ట్రోజాన్‌లు మీ హార్డ్‌డిస్క్‌ను ఇమెయిల్‌ అడ్రస్‌ల కోసం వెదుకుతూ ఉంటాయి. మీరు మీ సిస్టం యొక్క యాంటి వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా మీ సహచరుల ఇమెయిల్‌ అడ్రస్‌లు స్పామ్‌ బారినపడకుండా కాపాడండి. మీ అకౌంట్‌ వివరాలు అందజేస్తే తప్ప గుర్తించనటువంటి మెయిల్‌ అభ్యర్థనలకు ఎట్టి పరిస్థితులలోనూ ప్రతిస్పందించకండి. మీ బ్యాంకు, క్రెడిట్‌ కార్డు కంపెనీ, ఇ-బే, పేపాల్‌ మొదలయిన వాటిలో మీ అకౌంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు వారివద్దే ఉంటాయి. వాటిని తిరిగి అడిగే అవసరం ఉండదు. ఒకవేళ అవసరం అనుకుంటే ప్రత్యక్షంగా కలవడంగానీ, ఫోన్‌ ద్వారా గానీ సంప్రదించాలి. మీ లాగ్‌ ఇన్‌ వివరాలను ఇతరులెవ్వరికీ ఎటువంటి పరిస్థితులలోనూ ఇవ్వకండి.

జిమెయిల్స్ (Gmail) సెట్టింగ్స్‌లోని ఫిల్టర్స్‌ను ఉపయోగించడం ఎలా:

జిమెయిల్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత 'సెట్టింగ్స్‌ (Settings)' అనే బటన్‌ ని క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత వచ్చే విండోలో కనిపించే సెట్టింగ్స్‌ మెనూలో నాల్గవ ఆప్షన్‌ 'ఫిల్టర్స్‌'(Filters). ఈ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఇప్పుడు వచ్చే స్క్రీన్‌లో కనిపించే Create a new filter అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఇప్పుడు Create a Filter

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X