Home
News

వాట్సాప్ లోని ఈ అద్భుతమైన ఫీచర్లు మీరు వాడుతున్నారా ?

By Gizbot Bureau

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం ఎప్పుడూ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా వాట్సప్ లో ఎవరికైనా మెసేజ్ పంపాలంటే ముందుగా వారి మొబైల్ నెంబర్ కాంటాక్టు లిస్టులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుందనే విషయం అందిరకీ తెలిసిందే.. అప్పుడు మాత్రమే ఇతరులకు ఫొటోలు లేదా వీడియోలు, మెసేజ్ లు పంపే వీలుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు పంపే మొబైల్ నెంబర్ కు వాట్సప్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.అప్పుడు మాత్రమే మీరు పంపే మెసేజ్ వారి వాట్సప్ అకౌంట్ కు వెళ్తుంది. కానీ, ఫోన్ నెంబర్ యాడ్ చేయకుండా ఎలా మెసేజ్ పంపాలో తెలుసా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో కండి.

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీరు మీ Smartphoneలోని Web Browser ఓపెన్ చేయండి. ఈ లింక్ https://api.WhatsApp.com/send?phone=number కాపీ చేసి Paste చేయండి. నంబర్ స్థానంలో ఎవరికి మెసేజ్ పంపాలో వారి 10 అంకెల గల ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ ఫోన్ నెంబర్ ముందు +sign (+91) కంట్రీ కోడ్ తొలగించండి. ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో ఎంటర్ చేస్తే కంట్రీ కోడ్ (జీరోలు, బ్రాకెట్లు, డ్యాష్ (0,-) తొలగించండి. అయితే మీరు పంపే మొబైల్ నెంబర్ కు వాట్సప్ అకౌంట్ ఖచ్చితంగా ఉండి ఉండాలి. తరువాత మెసేజ్ బటన్ పై క్లిక్ చేసి ఛాట్ మెసేజ్ పంపండి. మీకు కొత్త Text Box ఓపెన్ అవుతుంది. మెసేజ్ టైప్ చేసి పంపండి. ఫొటోలు లేదా వీడియోలు, ఎమోజీలు ఏమైనా దీని ద్వారా పంపుకోవచ్చు.

స్టెప్ 2

స్టెప్ 2

https://wa.me/phonenumber ఈ లింకును మీ మొబైల్ బ్రౌజర్ లో ఓపెన్ చేయండి. తరువాత అందులో కనిపించే ఫోన్ నంబర్ స్థానంలో ఎవరికి మెసేజ్ పంపుతున్నారో వారి ఫోన్ నెంబర్ టైప్ చేయండి. తరువాత కంట్రీ లేదా రీజియన్ కోడ్ (+sign) లేకుండా ఎవరికి మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తరువాత మెసేజ్ ఛాట్ ఓపెన్ చేసి సెండ్ మెసేజ్ పంపండి.

Audio playback for iPhone users

Audio playback for iPhone users

ఐఓఎస్ యూజర్లకు audio playback featureని వాట్సప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. బీటా యాప్ ఇప్పటికే అందుబాటులో ఉంది. వాట్సప్ బీటా 2.19.91.1 ద్వారా యూజర్లు ఈ ఫీచర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ప్లే ఆడియో ఫైల్ ని షేర్ చేసుకోవచ్చు. వాట్సప్ యూజర్లు వాట్సప్ ఓపెన్ చేయకుండానే voice message or an audio fileని ప్లే చేసుకుని వినవచ్చు.

Making WhatsApp calls through Google Assistant

Making WhatsApp calls through Google Assistant

గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఇకపై వాట్సప్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని వాట్సప్ అందుబాటులోకి తీసుకువస్తోంది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీరు నేరుగా video and audio calls చేయమని అడగవచ్చు. WhatsApp and Google Assistant apps అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసి Hey Google, WhatsApp video అంటే సరిపోతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లు అందుబాటులో ఉంది.

Albums for web

Albums for web

ఈ ఫీచర్ ద్వారా కొంతమందికి ఒకేసారి మల్టిపుల్ images or videos పంపుకోవచ్చు. మొత్తాన్ని ఆల్బమ్ ఫార్మాట్ ద్వారా పంపుకోవచ్చు. అయితే వాట్సప్ వెబ్ లో ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. ఇందులో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సప్ ప్రయత్నిస్తోంది. లీకయిన రిపోర్టుల ప్రకారం వాట్సప్ desktop web usersకి కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Multi-platform support

Multi-platform support

ఇప్పటిదాకా వాట్సప్ ఒకేసారి two platforms మీద అందుబాటులో లేదు. అయితే వెబ్ ద్వారా మాత్రమే యూజర్లు మరో ఫ్లాట్ ఫాం మీద వాడుకునే సదుపాయం మాత్రమే ఇప్పటిదాకా అందుబాటులొ ఉంది. ఈ సమస్యను అధిగమించి మల్టి ఫ్లాట్ ఫాం మీద ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ తొలిసారిగా Apple's iPad ద్వారా పరిచయం కానుంది. ఆ తర్వాత Android and iOS యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

Best Mobiles in India

English summary
how to send whatsapp without adding contact your smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X