ఫేస్‌బుక్‌లో ఫైళ్శను షేర్ చేయడం ఇంత సులువా?

Posted By: Super

ఫేస్‌బుక్‌లో ఫైళ్శను షేర్ చేయడం ఇంత సులువా?

ప్రపంచ వ్యాప్తంగా 700మంది మిలియన్ యూజర్లను కలిగిఉండి నెంబర్ వన్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్‌గా వెలుగొందుతున్న ఫేస్‌బుక్ ఇటీవల ఫేస్‌బుక్ పోటీగా విడుదల చేసిన గూగుల్ ప్లస్ నుండి కాంపిటేషన్ తట్టుకోవడం కోసం రోజుకో కొత్త ఫీచర్‌ని రూపోందిస్తున్న విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ కొత్తగా రూపోందించిన ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏమిటంటే ఫేస్‌బుక్లో మీకు నచ్చిన స్నేహితులకు, సన్నిహితులకు ఫైళ్శను షేర్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఏమి చేయాలో చూద్దాం. మొదటగా Filefly అనే ఫేస్ బుక్ అప్లికేషన్ ని ఉపయోగించి ఫేస్ బుక్ లో కావలసిన వారితో 2GB సైజ్ వరకు ఫైళ్శను షేర్ చేసుకోవచ్చు. ముందుగా ఫేస్ బుక్ Filefly అప్లికేషన్ పేజి కి వెళ్లి మన ఫేస్ బుక్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు Use Filefly బటన్ పై క్లిక్ చెయ్యాలి. తర్వాత ఆ అప్లికేషన్ కి పర్మిషన్ Grant చెయ్యాలి. అంతే ఈ ప్రక్కన చిత్రం లో చూపిన విధంగా స్క్రీన్ వస్తుంది.

ఇక్కడ New Folder పై క్లిక్ చేస్తే క్రొత్త ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, తర్వాత Add Files, Invite Friends ఉంటాయి. Add Files పై క్లిక్ చేసి షేర్ చెయ్యవలసిన ఫైల్ ని మన పీసీ నుండి సెలెక్ట్ చేసుకోవాలి. Invite Friends బటన్ పై క్లిక్ చేసి మనం ఎవరితో అయితే ఫైల్ షేర్ చేసుకోవాలనుకుంటున్నామో వారిని ఫ్రెండ్స్ లిస్ట్ నూండి సెలెక్ట్ చేసుకొని ’Send Request' పై క్లిక్ చేస్తే వారికి నోటిఫికేషన్ పంపబడుతుంది. Publish on my.... దగ్గర చెక్ పెట్టడం ద్వారా మన షేర్ చేసిన విషయం వాల్ పై పబ్లిష్ చెయ్యబడుతుంది.

ఫ్రెండ్స్ వారికి వచ్చిన నోటిఫికేషన్ పై క్లిక్ చేస్తే Filefly కి వెళతారు వాళ్ళు కూడా Use Filefly చేస్తే FileFly మొదటి పేజ్ కి వెళతారు. FileFly మెయిన్ స్క్రీన్ లో మనం షేర్ చేసిన ఫోల్డర్ వస్తుంది, దానిపై క్లిక్ చేసి దానిలోని ఫైళ్శను చూడవచ్చు. ఒక్కొక ఫైల్ పై క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot