వాట్సప్‌కు పోటీగా దూసుకొస్తున్న SMS యాప్

By Gizbot Bureau
|

ప్రస్తుతం ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో కింగ్ ఎవరైనా ఉన్నారంటే అది వాట్సప్ అనే చెప్పవచ్చు. దీనిని ఢీకొట్టే యాప్ ఇంకా ఏదీ రాలేదు. అయితే ఇప్పుడు త్వరలో దీనికి చెక్ పెట్టడానికి మెసేజింగ్ యాప్ రెడీ అవుతోంది.ఇందులో భాగంగానే SMS యాప్ లో భారీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కాగా వాట్సప్ అందుబాటులోకి వచ్చాక మన ఫోన్ లో మెసేజింగ్ అనే విషయం ఉంటుందని కూడా చాలామంది మర్చిపోయారనే చెప్పవచ్చు. సర్వీస్ ప్రొవైడర్లు, పంపే మెసేజ్ లు ఫార్వర్డ్ మెసేజ్ లకు మాత్రమే ఈ మెసేజింగ్ యాప్ పరిమితమైంది. వాట్సప్ కు చెక్ పెడుతూ మెసేజింగ్ యాప్ కు పునర్ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు తెర వెనుక ప్రారంభమయ్యాయి.

కొత్తగా మెసేజింగ్ యాప్

కొత్తగా మెసేజింగ్ యాప్

అమెరికాలో ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లు అయిన AT&T, స్ప్రింట్, టీ-మొబైల్, వెరిజాన్ సంస్థలు RCS (రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్) ఆధారిత మెసేజింగ్ వ్యవస్థ రూపకల్పనకు నడుం బిగించాయి. ఈ మెసేజింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే మీరు మొబైల్ డేటా లేదా వైఫై ద్వారా కూడా మెసేజ్ లను అందుకోవచ్చు. 

దూసుకొస్తోంది 

దూసుకొస్తోంది 

దీనికి సంబంధించిన ప్రయత్నాలు అమెరికాలో కొంతకాలం క్రితమే ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటివరకు చెప్పుకోదగ్గ స్థాయిలో పరిణామాలేవీ జరగలేదు. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రధాన సర్వీస్ ప్రొవైడర్లు దీని కోసం చేతులు కలపడంతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. అంతేకాకుండా దీనికి గూగుల్ కూడా తన వంతు సాయం చేస్తోంది. 

వచ్చే ఏడాది నాటికి..

వచ్చే ఏడాది నాటికి..

RCS ఆధారిత మెసేజింగ్ వ్యవస్థని వచ్చే ఏడాది నాటికి ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొస్తామని వీరు తెలిపారు. ఒకవేళ ఈ మార్పు నిజంగా జరిగి మెసేజింగ్ యాప్ విజయవంతమైతే.. వినియోగదారుల మొగ్గు దీనివైపే ఉంటుందనే చెప్పుకోవచ్చు. 

వినియోగదారుల గోప్యత 

వినియోగదారుల గోప్యత 

ఇదిలా ఉంటే వాట్సప్ మాతృసంస్థ అయిన ఫేస్ బుక్ పై వినియోగదారుల గోప్యత విషయంలో ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఇది వాడుకుంటోందని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యాప్ బయటకు వస్తే అందరూ దీని వైపు మళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Best Mobiles in India

English summary
How SMS may ‘replace’ WhatsApp soon in Android phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X