ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా సంవత్సరం వరకు FREE!
భారత్‌లోని టెలికాం సంస్థలు గతంలో రీఛార్జ్ ప్లాన్‌లపై కేవలం కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలను మాత్రమే అందించేవి. అనంతరం ఓటీటీ ప్రయోజనాలను కూడా అందిస్తూ వస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్, BSNL కూడా అనేక రీఛార్జ్ ప్లాన్‌లపై వివిధ రకాల ఓటీటీ ప్రయోజనాలను అందిస్తోన్నాయి.
అయితే ఇటీవల కాలంలో టెలికాం సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌ను ఉచితంగా అందించడం ప్రారంభించాయి. ఎయిర్‌టెల్ పెర్‌ఫ్లెక్సిటీ ప్రో మోడల్‌ను ఉచితంగా అందిస్తోంది. అదే జియో గూగుల్ జెమిని మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకొనేందుకు అవకాశం ఇచ్చింది. దశల వారీగా యూజర్లకు జియో ఈ అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది.

12 నెలల వరకు ఉచితం :
ఇటీవల ఎయిర్‌టెల్ (Airtel) కీలక ప్రకటన చేసింది. తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. దీని సాధారణ విలువ రూ.4000 గా ఉందని తెలిపింది. అయితే ఎయిర్‌టెల్ యూజర్లు ఉచితంగా 12 నెలల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
కంటెంట్ క్రియేటర్లకు, చిరు వ్యాపారులు సహా ఇతరులకు ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు, DTH సబ్‌స్క్రైబర్లు అడోప్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చని తెలిపింది.

360 మిలియన్‌ల మంది యూజర్లకు ప్రయోజనం :
సంవత్సరం వరకు 360 మిలియన్‌ల మంది యూజర్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చని ఎయిర్‌టెల్ చెబుతోంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. యాప్‌లో రివార్డ్స్ సెక్షన్‌లో ఈ ఆఫర్‌ను గుర్తించవచ్చు.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలి :
ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను ఓపెన్ చేసి, రివార్డ్స్ & ఓటీటీ సెక్షన్‌కు వెళ్లండి. అనంతరం అక్కడ ఓటీటీ, కాల్‌ట్యూ్న్ సహా అడోబ్ ఎక్స్‌ప్రెస్ ఆఫర్ వివరాలు కనిపిస్తాయి. అక్కడే యాక్టివేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఎటువంటి బ్యాంకింగ్ వివరాలు అందించాల్సిన అవసరం లేదు. అడోబ్ అకౌంట్‌ను క్రియేట్ చేయడం లేదా సైన్‌ఇన్ కావచ్చు.
ఏమేం ఫీచర్లు ఉంటాయ్ :
అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంలో భాగంగా నెలకు 250 జనరేటివ్ AI క్రెడిట్‌లు, స్టాటిక్, వీడియో కంటెంట్ కోసం టెంప్లేట్లు, 200 మిలియన్‌లకు పైగా అడోబ్ స్టాక్ అసెట్స్, 30 వేలకు పైగా ఫాంట్‌లు, వీడియో బ్యాగ్రౌండ్‌ను తొలగించే ఫీచర్లు, అధిక సంఖ్యలో రీసైజ్ చేసేందుకు వీలుగా ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.
దీంతోపాటు 100GB క్లౌడ్ స్టోరేజీని కూడా పొందవచ్చని ఎయిర్‌టెల్ చెబుతోంది. అడోబ్ ఎక్స్‌ప్రెస్ 8 భారతీయ భాషలను సపోర్టు చేస్తుంది. ఇందులో హిందీ, తెలుగు, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, పంజాబీ, తమిళం భాషలు ఉన్నాయి. అడోబ్ AI చాట్‌బాట్ టెక్ట్స్ ప్రాంప్ట్‌లతో PDF ను క్రియేట్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్‌ల కోసం మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.
భారత్ అంతా మిలియన్ల మంది ప్రజలకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంను ఉచితంగా అందించడం, ప్రజలు తమ కెరీర్, వ్యాపారాలను వృద్ధి చేసుకొనేందుకు లేదా అభిరుచులను ప్రొత్సహించడం మరియు ప్రత్యేకమైన కంటెంట్‌ను సింపుల్‌గా ఉత్పత్తి చేసేందుకు వీలుకల్పించడం తమ ఉద్దేశమని అడోబ్ క్రియేటివిటీ, ప్రొడవిటీ బిజినెస్ అధ్యక్షడు డేవిడ్ వాదనీ తెలిపారు.
భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యంతో ఆనందం వ్యక్తం చేశారు. అడోబ్, ఎయిర్‌టెల్ మధ్య ఒప్పందం కారణంగా ఎయిర్‌టెల్ కస్టమర్లకు 12 నెలల వరకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతోపాటు ఇతర ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








