భూకంపాలను ముందే గుర్తించి, అప్రమత్తం చేసే స్మార్ట్‌ఫోన్ ఫీచర్.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..!
మయన్మార్, థాయ్‌లాండ్, భారత్, చైనా, వియత్నాం తూర్పు ఆసియా దేశాల్లో భూకంపం (Earthquake) సంభవించింది. దీంతో థాయ్‌లాండ్, మయన్మార్ లో భారీ ప్రభావం చూపింది. మయన్మార్‌లో వచ్చిన భూకంపం శక్తివంతమైనదని అమెరికా జాతాయీ భూకంప సమాచార కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. థాయ్‌ల్యాండ్‌లోనూ కేవలం 12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. దీంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.
మయన్మార్ రాజధాని నేపిడాలో 1000 బెడ్స్ కలిగిన హాస్పిటర్ భూకంపం తీవ్రతకు నేలకూలింది. దీంతో ఇక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ లోనూ కొన్ని భవనాలు కూప్పకూలిన వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి.

భారీ భూకంపాల కారణంగా మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ సంఖ్యలో ప్రజలు మరణించారు. మయన్మార్‌లో 181, థాయ్‌లాండ్‌లో 5 మంది మరణించినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని, దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆండ్రాయిడ్ ఫీచర్ :
గతం కంటే ప్రస్తుతం టెక్నాలజీ భారీగా అభివృద్ధి చెందింది. ఫలితంగా ఇలాంటి ప్రకృతి వైపరిత్యాల సమయంలో ముందస్తు హెచ్చరికలను జారీచేయగల టెక్నాలజీ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈ సమాచారం వేగంగా చేరుతుంది. ఆండ్రాయిడ్ యూజర్‌లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
ముందే అప్రమత్తం చేస్తుంది :
టెక్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ 15 OS లో Earthquake Detector ఫీచర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇండియా సహా అనేక దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్నాక.. రియల్ టైంలో భూకంపాలకు సంబంధించిన అలెర్ట్స్‌ను జారీ చేస్తుంది.
ఆండ్రాయిడ్ 15 లో అందుబాటులో ఉంది :
అయితే ఈ ఆండ్రాయిడ్ ఫీచర్ తక్కువ తీవ్రతతో కూడిన భూకంపాల గురించి ఎటువంటి అలెర్ట్స్ జారీ చేయదు. ప్రస్తుతం ఈ ఆండ్రాయిడ్ Earthquake Detector ఫీచర్ గూగుల్ పిక్సల్, శాంసంగ్, వన్‌ప్లస్ లో కొన్ని డివైజ్‌లో అందుబాటులో ఉంది. ఈ పరికరాలు కచ్చితంగా ఆండ్రాయిడ్ 15 OS ను కలిగి ఉండాలి.
ఎలా గుర్తిస్తుంది :
భూకంపాలను గుర్తించేందుకు సిస్మోమీటర్ ను ఉపయోగిస్తారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే యాక్సెలిరోమీటర్ సిస్మోమీటర్ తరహాలో పనిచేస్తుంది. భూ ప్రకంపనలు గుర్తించి ముందస్తుగా యూజర్‌లను వెంటనే అప్రమత్తం చేస్తుంది. భూకంపం తీవ్రత మరియు లొకేషన్ వివరాలు అందిస్తుంది.
ఇంటర్నెట్ సిగ్నల్స్ వేగంగా :
ఫలితంగా ఆయా ప్రాంతంలోని యూజర్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు అవకాశం ఉంటుంది. అయితే తక్కువ తీవ్రత కలిగిన భూ ప్రకంపనలను ఈ ఫీచర్ ద్వారా గుర్తించేందుకు అవకాశం లేదు. భూకంప తరంగాల కంటే ఇంటర్నెట్ సిగ్నల్స్ వేగంగా ప్రయాణించి అప్రమత్తం చేస్తాయని గూగుల్ చెబుతోంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి :
- స్మార్ట్‌ఫోన్‌లో సెట్సింగ్స్‌ను ఓపెన్ చేయాలి.
- అందులో Safety and Emergency ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- అక్కడ కనిపించిన Earthquake అలెర్ట్స్ పైన క్లిక్ చేయాలి.
- అనంతరం యాక్టివేట్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications








