కుటుంబ సభ్యుల రీఛార్జ్ మిస్ అవ్వకుండా వారిని ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో జోడించడం ఎలా?

|

భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయ టెలికం ఆపరేటర్ భారతీయ ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు అద్భుతమైన సేవలతో పాటుగా మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టెల్కో చందాదారులకు సహాయపడటానికి మరియు వారి యొక్క అనుభవాన్ని పెంచడానికి అనేక ఫీచర్లతో కూడిన శ్రేణిని అందిస్తుంది. ఎయిర్టెల్ తన వినియోగదారులకు అందించే అద్భుతమైన ఫీచర్లలో ఒకటి తమ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో చేర్చడంతో వారి ఫోన్ నంబర్లను సులభంగా మరియు త్వరగా రీఛార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లను మాత్రమే కాకుండా ఎయిర్‌టెల్ వినియోగదారులు తమ సమీప డిటిహెచ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను కూడా రీఛార్జ్ చేయడానికి ఈ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ అనుమతిని ఇస్తుంది. అయితే ఈ యాప్‌లోకి మీ యొక్క కుటుంబ సభ్యులను ఎలా చేర్చాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో కుటుంబ సభ్యులను జోడించడం ఎలా?

 

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో కుటుంబ సభ్యులను జోడించే విధానం

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో కుటుంబ సభ్యులను సులభంగా జోడించడానికి కింద ఉన్న ఈ దశలను అనుసరించండి

** మొదట మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. అలాగే మీ ఎయిర్‌టెల్ నంబర్‌ను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.

** మీరు లాగిన్ అయిన తర్వాత 'మీకు ప్రియమైనవారి కోసం శీఘ్ర రీఛార్జ్' పేజీ కోసం సెర్చ్ చేయండి.

** పేజీని ఓపెన్ అయిన తరువాత మీ కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడి యొక్క ఎయిర్‌టెల్ నంబర్‌ను ఎంటర్ చేసి ముందుకు కొనసాగండి ఎంపిక మీద నొక్కండి.

** 'Continue' బటన్‌ను నొక్కినప్పుడు మీరు మీ యొక్క ఎయిర్‌టెల్ నంబర్‌కు OTP ను అందుకుంటారు

** తరువాత OTP ని ఎంటర్ చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయండి.

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో జోడించిన నంబర్‌ను చూసే విధానం

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో కుటుంబ సభ్యులను జోడించడం ఎలా?

త్వరిత రీఛార్జ్ ప్రయోజనం కోసం జోడించబడిన అన్ని నంబర్‌ల జాబితాను కూడా ఎయిర్టెల్ థాంక్స్ యాప్ చూపిస్తుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో జోడించిన నంబర్‌ల జాబితాను చూడటానికి 'వ్యూ యాడెడ్ అకౌంట్' కు నావిగేట్ చేయండి. ఇక్కడ మీరు జోడించిన నంబర్‌ల మొత్తం సమాచారాన్ని చూస్తారు. సకాలంలో రీఛార్జిలను పూర్తి చేయడం కోసం ప్రస్తుత ప్లాన్ గడువు తేదీకి సంబంధించిన సమాచారం కూడా మీకు లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Add Family Members in Airtel Thanks App Without Missing a Recharge

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X