నంబర్లను సేవ్ చేయకుండా వాట్సప్ గ్రూపులో వారిని యాడ్ చేయడం ఎలా ?
ఫోన్ వినియోగదారుల్లో వాట్సప్ యాప్ కమ్యునికేషన్ రంగంలో కొత్త మార్పును తీసుకువచ్చింది. వాట్సప్ లేకుండా ఏ వినియోగదారుడు లేనిపరిస్థతిని కల్పించింది. ఈనేపథ్యంలోనే వ్యక్తిగత సమాచారంతో పాటు సామాజిక...
ఫోన్ వినియోగదారుల్లో వాట్సప్ యాప్ కమ్యునికేషన్ రంగంలో కొత్త మార్పును తీసుకువచ్చింది. వాట్సప్ లేకుండా ఏ వినియోగదారుడు లేనిపరిస్థతిని కల్పించింది. ఈనేపథ్యంలోనే వ్యక్తిగత సమాచారంతో పాటు సామాజిక పరమైన అంశాలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. కొన్ని సంధర్భాల్లో వాట్సప్ ద్వార తప్పుడు వార్తలు వెలువడి గందరగోళానికి గురయిన సంధర్భాలు కూడ ఉన్నాయి.

ఇదంతా వినియోగదారులకు ఉచిత యాప్ ద్వార పలు సేవలు అందిస్తోంది. కాగా ఈ మధ్య అందులో యాడ్స్ కూడా ప్లే అవుతాయనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వాట్సప్ గ్రూపులు కోకొల్లలుగా పుట్టుకువస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేసి అందులో వార్తలను పోస్ట్ చేస్తున్నారు. వాట్సప్ గ్రూపు క్రియేట్ చేయగానే అందులో మన కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారిని అలాగే కొత్త వారిని యాడ్ చేస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలో అనేక రకాల గ్రూపులను క్రియేట్ చేసి అందులో తెలియని నంబర్లను యాడ్ చేసేందుకు చాలామంది ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి వారిని కాంటాక్ట్స్ లో యాడ్ చేసుకుని గ్రూపుల్లో యాడ్ చేయాలంటే తలకు మించిన భారమే అవుతుంది. నంబర్ సేవ్ చేయకుండా కొత్త వారిని యాడ్ చేయడం ఎలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారి కొన్ని రకాల టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రిక్స్ ద్వారా వారి నంబర్ మీ ఫోన్లోని కాంటాక్ట్ లో సేవ్ చేయకుండానే గ్రూపులో యాడ్ చేయవచ్చు. ఎలాగో స్టెప్ బై స్టెప్ మీకోసం.

గమనిక
గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ వాట్సప్ ని మీ మొబైల్ లోకి ముందుగా మీరు డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇన్వైట్ లింక్ క్రియేట్ చేయాలి. మీరు తప్పనిసరిగా ఆ గ్రూపుకు అడ్మిన్ అయి ఉండాలి. ఆ తర్వాత ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
స్టెప్స్ ఇవే
ముందుగా మీ హోమ్ స్క్రీన్ లేక లాంచర్ నుండి వాట్సప్ మెసేంజర్ ని లాంచ్ చేయండి
తర్వాత గ్రూపు కన్వర్షన్ విండోని ఓపెన్ చేయండి.
ఆ తర్వాత రైట్ కార్నర్ లో కనిపించే మూడు డాట్లను క్లిక్ చేయండి.
ఆ తర్వాత Group info optionని ఓపెన్ చేయండి
ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కనిపించే Invite via linkని ట్యాప్ చేయండి
ఈ మెసేజ్ మీకు Invite link has been made అని చూపిస్తుంది. ఆ తర్వాత మీకు కొన్ని రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. WhatsApp, Copy link, Share link అనే ఆప్సన్లుతో మీరు గ్రూపు ఇన్వైట్ చేయవచ్చు.
మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వారిని ఈ గ్రూపు ద్వారా ఇన్వైట్ చేయండి.

ఇదిలా ఉంటే ఇన్నాళ్లు ఉచితంగానే వినియోగదారులకు సేవలు అందించిన వాట్సప్ యాజమాన్యం భవిష్యత్‌లో వాట్సప్ యాడ్స్‌ను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించారు.ఇటివల జరిగిన ఓ సదస్సులో వాట్సప్ యాజమాన్యం ఈ విషయాన్ని తెలిపింది. దీంతో 2020 నుండి వాట్పప్‌లో ప్రకటనలు వెలువడుతాయని చెబుతున్నారు. అయితే యాడ్స్ మాత్రం వినియోగదారుల స్టేటస్‌లలో దర్శనివ్వనున్నాయి. కాగా ఇందుకు సంబంధింది సుమారు 500 బిలియన్ డాలర్ల వ్యాపారం కొనసాగుతుందని ప్రకటించింది.


Click it and Unblock the Notifications








