ఏపీలో 2లక్షల గ్రామ వాలంటీర్ల పోస్టులు,అప్లయ్ ఎలా,అర్హతలేంటి ?

By Gizbot Bureau
|

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామవాలంటీర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఃంగతి అందరికీ తెలిసిందే. ఇచ్చిన మాటను నిలుపుకుంటూ ఏపీలో 2లక్షల గ్రామ వాలంటీర్ల పోస్టులకు నోటీఫికేషన్ విడుదల చేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యంతో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి, అన్ని రకాల ప్రభుత్వ సేవలను అక్కడి నుంచి ఈ వాలంటీర్ల ద్వారా అందించనున్నారు.

 ఏపీలో 2లక్షల గ్రామ వాలంటీర్ల పోస్టులు,అప్లయ్ ఎలా,అర్హతలేంటి ?

ఏపీలోని 13వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో 50 ఏళ్లకు ఒకరు, పురపాలికల్లో వార్డుకు ఒకరు చొప్పున వాలంటీర్ల నియామకంపై కసరత్తు పూర్తయింది.

 2 లక్షల మంది వాలంటీర్లు

2 లక్షల మంది వాలంటీర్లు

గ్రామాల్లో ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా, మండలాల వారీగా కుటుంబ వివరాలు సేకరించి ఎంతమంది వాలంటీర్లు అవసరమవుతారో అంచనాకు వచ్చారు. పట్టణ ప్రాంతాల్లోను దాదాపు 60వేల మంది వాలంటీర్లు అవసరమవుతారని గుర్తించరట. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వాలంటీర్లు కీలకం కానున్నారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి వాలంటీర్ల వ్యవస్థ అమలులోకి రానుంది.

అర్హతలు

అర్హతలు

వాలంటీర్ల దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక కోసం కమిటీల ఏర్పాటుపై మార్గదర్శకాలు రూపొందించారు. త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్... ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటరు ఐడీ. అలాగే నివాస ధృవీకరణ పత్రం ఇవ్వాలి. గ్రామ వాలంటీర్ ఉద్యోగం కోసం విద్యార్హత ఇంటర్, పట్టణ వాలంటీర్ల కోసం విద్యార్హత డిగ్రీ, గిరిజన ప్రాంతాల్లోని వారికి విద్యార్హత పదవ తరగతి. వేతనం. రూ.5,000. మండల స్థాయి ఎంపిక కమిటీ ద్వారా నియామకాలు ఉంటాయి. కమిటీలో ఎంపీడీవో, తహసీల్దారు, ఈవోపీఆర్డీ ఉంటారు. దరఖాస్తు చేసుకున్న వారి ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆ తర్వాత వారిని ఇంటర్వ్యూ చేస్తారు. వాలంటీర్లు లంచాలు తీసుకున్నట్లు తేలితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.

వాలంటీర్లు ఏం చేస్తారు?

వాలంటీర్లు ఏం చేస్తారు?

ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారు. వీరు ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటికి చేర్చుతారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులు రేషన్ దుకాణానికి వెళ్లి తీసుకు వచ్చుకునేవారు. ఇక నుండి గ్రామవాలంటీర్లు వాటిని లబ్ధిదారులకు చేరవేస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి బియ్యం, నిత్యావసర వస్తువులు చేరవేస్తారు.ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డోర్ డెలివరీ చేసేందుకు సన్నద్ధం కావాలని సీఎం జగన్ పౌరసరఫరాల శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. నాణ్యమైన సన్న బియ్యాన్ని సేకరించి, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోల చొప్పున బ్యాగుల్లో ప్యాక్ చేయించి, సిద్ధం చేసుకోవాలన్నారు. వాలంటీర్ల నియామకం కూడా పారదర్శకంగా ఉండాలన్నారు.

అప్లయి చేయడం ఎలా ?

అప్లయి చేయడం ఎలా ?

ap.gov.in వెబ్ సైట్ లో అప్లికేషన్ వివరాలు ఉంటాయి. APGV Exam 2019 ద్వారా వీరు ఎన్నుకోబడతారు. వయస్సు 18 నుండి 39 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఏ జిల్లాకెన్ని పోస్టులు

Anantapur 965, Chittoor 1523, East Godavari 1400, Guntur 729, Krishna 996, Kurnool 923, Prakasam 1094, Srikakulam 1815, Sri Potti Sriramulu Nellore 1192, Visakhapatnam 3280, Vizianagaram 1534, West Godavari 897, YSR District, Kadapa (Cuddapah) 938

ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 15 లోపు నియామక ప్రక్రియ పూర్తి అవుతుంది. మరిన్ని వివరాలకు ap.gov.in సైటును సంప్రదించగలరు.

 

Best Mobiles in India

English summary
how to apply and who is eligible for ap grama volunteer recruitment

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X