మీకు FASTAG ఉందా.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే..!
సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా సహా ఇతర ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకొనే నేరాలకు పాల్పడిన ఘటనలు చాలా బయటకు వచ్చాయి. అయితే తాజాగా వాహనదారులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. హానికర లింక్స్ పంపి, మోసాలకు పాల్పడుతున్నారు.
జాతీయ రహదారులపై సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కేంద్రం గతంలో ఫాస్టాగ్ ను (FASTAG) తీసుకొచ్చింది. ఫలితంగా టోల్‌ప్లాజాల వద్ద మాన్యువల్ గా చెల్లింపులకు బదులుగా, ఫాస్టాగ్ ద్వారా ఆటోమేటిక్‌గా పేమెంట్స్ చేసేందుకు అవకాశం ఉంది. ప్రయాణాలకు అనుగుణంగా రీఛార్జ్ చేయడంతోపాటు వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

నేరగాళ్లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. KYC అప్‌డేట్ చేసుకోవాలంటూ మరియు ఫాస్టాగ్ అకౌంట్ త్వరలో నిలిచిపోతుందంటూ చెప్పి లింక్స్ పంపుతున్నారు. ఈ నకిలి లింక్స్ పైన క్లిక్ చేస్తున్న వాహనదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి.
సైబర్ మోసాల బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
> ఈ ఫాస్టాగ్ ఖాతాకు చెందిన పిన్, పాస్‌వర్డ్, OTP ను ఇతరలకు షేర్ చేయకూడదు.
> ఫాస్టాగ్ రీఛార్జ్ కోసం అధికారిక ప్లాట్‌ఫాంలను మాత్రమే ఉపయోగించాలి.
> QR కోడ్ స్కాన్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి, నకిలీ QR స్కానర్ లు ఉండే అవకాశం ఉంది.
> తరచూ ఫాస్టాగ్ ఖాతాను తనిఖీ చేస్తుండాలి. అనుమానాస్పదంగా అనిపిస్తే, ఫిర్యాదు చేయాలి.
ఫాస్టాగ్ వార్షిక పాస్ : కేంద్ర గతంలో ప్రకటన చేసిన ఫాస్టాగ్ వార్షిక పాస్.. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా రూ.3000 చెల్లించి.. 200 ట్రిప్పులు లేదా సంవత్సరం వ్యాలిడిటీతో వినియోగించుకోవచ్చు. వాణిజ్యేతర కార్లు, జీపులు, వ్యాన్‌లను మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది.
ఈ యాప్, వెబ్‌సైట్ ద్వారా : ఫాస్టాగ్ వార్షిక పాస్ ను యాక్టివేట్ చేసుకొనేందుకు రవాణా శాఖకు చెందిన రాజ్‌మార్గ్ యాత్ర యాప్, నేషనల్ హైవే అథారిటీ (NHAI) మరియు రహదారి రవాణా, హైవే మంత్రిత్వ శాఖ (MoRTH) వెబ్‌సైట్‌లో ఈ లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఫాస్టా్గ్ వార్షిక పాస్ కోసం రూ.3 వేలను చెల్లించాలి. సంవత్సర కాలం లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అదే) వరకు వర్తిస్తుంది. ఒక్కో టోల్‌గేట్ ను ఒక్కో ట్రిప్‌గా పరిగణిస్తారు. ఫాస్టాగ్ వార్షిక పాస్ ను అవసరం లేదని భావించే వాహనదారులు పాత విధానంలోనే టోల్‌ప్లాజా వద్ద చెల్లింపులు చేయవచ్చు.
వార్షిక ప్లాన్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి :
> రాజ్‌మార్గ్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
> ఈ యాప్, వెబ్‌సైట్ లో ఉన్న ఫాస్టాగ్ వార్షిక పాస్ లింక్ పైన క్లిక్ చేయాలి.
> వెహికల్ నంబర్, మొబైల్ నంబర్, ఫాస్టాగ్ వివరాలతో లాగిన్ కావాలి.
> ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా రూ.3 వేలు చెల్లించాలి.
> అనంతరం రెండు గంటల్లో వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది.


Click it and Unblock the Notifications








