Home
News

QR కోడ్‌ స్కాన్‌ చేసి పేమెంట్లు చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే బ్యాంకు ఖాతా ఖాళీ..!

డిజిటల్‌ పేమెంట్లు భారత్‌ లో భారీగా పెరిగాయి. గత పది సంవత్సరాలతో నోట్ల రద్దు వంటి పరిణామాలు సహా కరోనా సమయంలో డిజిటల్‌ ట్రాన్సాక్షన్‌ లు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు. ఫలితంగా గతంతో పోలిస్తే UPI ట్రాన్సాక్షన్‌ లు భారీగా పెరిగాయి. చిన్న దుకాణాల దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్‌ వరకు డిజిటల్‌ పేమెంట్లు చేస్తున్నారు. చిల్లర సమస్య సహా స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం సహా ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

అయితే పెరుగుతున్న టెక్నాలజీని సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఫలితంగా పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేస్తున్నారు. నకిలీ UPI యాప్‌లు, నకిలీ QR కోడ్‌లతో మోసాలకు (QR Code Scams) పాల్పడుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

How to avoid fake QR code scams

QR కోడ్‌ పేమెంట్లు చేయాలని భావిస్తే : QR కోడ్‌లను స్కాన్‌ చేసే సమయంలో వివరాలను ధ్రువీకరణ చేసుకోవాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మీరు ఏదైనా దుకాణంలో QR కోడ్‌ ద్వారా పేమెంట్లు చేయాలని భావిస్తే... కోడ్‌ స్కాన్‌ చేశాక వచ్చిన వివరాలను దుకాణాదారుడిని అడిగి ధ్రువీకరించుకోవడం ఉత్తమం.

ఇటీవల మధ్యప్రదేశ్‌ లో ఈ తరహా ఘటన బయటకు వచ్చింది. పెట్రోల్ ఫిల్లింగ్‌ స్టేషన్‌, ఇతర దుకాణాల్లో నకిలీ QR కోడ్‌లతో మోసాలకు పాల్పడ్డారు. ఆ నకిలీ QR కోడ్‌లను స్కాన్‌ చేస్తే నేరగాళ్లు ఖాతాలను నగదు బదిలీ అయ్యేది. దీంతోపాటు కోడ్‌ లను స్కాన్‌ చేసిన వినియోగదారుల బ్యాంకింగ్‌ సమాచారం కూడా లీక్‌ అయ్యేది.

దీంతోపాటు నకిలీ యాప్‌ల ద్వారా కూడా దుకాణాదారులను మోసం చేసిన ఘటనలు ఇటీవల తెలంగాణలోనూ వెలుగులోకి వచ్చాయి. కొంత మంది వ్యక్తులు నకిలీ UPI యాప్‌లతో QR కోడ్‌లను స్కాన్‌ చేసి దుకాణాల వద్ద మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండేందుకు వీలుగా QR కోడ్‌లను వినియోగిస్తున్న దుకాణాదారులు సౌండ్‌ బాక్స్‌లను కూడా ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వెంటనే ఆ సమాచారం మీకు తెలిసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా నకిలీ పేమెంట్‌లకు చెక్‌ పెట్టవచ్చు.

దీంతోపాటు ఏదైనా ప్రాంతంలో QR కోడ్‌ ను స్కాన్‌ చేసి పేమెంట్‌ చేస్తున్నట్లు అయితే.. స్కాన్‌ చేశాక దుకాణాదారుడి పేరు, బ్యాంకింగ్‌ సమాచారాన్ని ధ్రువీకరించుకొన్న తర్వాత పేమెంట్‌ చేయాలి. దీని ద్వారా తప్పుడు బ్యాంకు ఖాతాలను నగదు ట్రాన్సాక్షన్‌ జరగకుండా నివారించవచ్చు. ఏదైనా సందర్భంలో నకిలీ QR కోడ్‌గా అనుమానం వస్తే గూగుల్‌ లెన్స్ వంటి ఫీచర్‌లతో స్కాన్ చేయడం ఉత్తమం.

గూగుల్‌ లెన్స్‌ వంటి యాప్స్‌ తో స్కాన్‌ చేయడం వల్ల QR కోడ్‌ సరైనదా కాదా అనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే దీంతోపాటు క్రమంగా బ్యాంకు ఖాతాల్లోని ట్రాన్సాక్షన్‌ వివరాలను తనిఖీ చేస్తుండాలి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే బ్యాంకులు సహా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
How to avoid fake QR code scams these are the best practices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X