ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తున్నారా.. ఈ నకిలీ వెబ్‌సైట్‌ల పట్ల జాగ్రత్త..!!
పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడం ప్రస్తుతం చాలా సులభంగా మారింది. ఆన్ లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేయగలుగుతున్నాం. అయితే కొన్ని చోట్ల ఆన్ లైన్ పాస్‌పోర్ట్ స్కాంలు జరుగుతున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలి. లేకుం ఆర్థికంగా నష్టపోవడం సహా ఇతర సమస్యల్లో చిక్కుకొనే ప్రమాదం ఉంది. అందువల్ల అధికారిక వెబ్‌సైట్ ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారా.. అయితే ఈ కథనం మీకోసం.
పాస్‌పోర్ట్ కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ www.passportindia.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఫలితంగా మీ వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉంటాయి. ఇతర వెబ్‌సైట్ ల ద్వారా దరఖాస్తు చేసేందుకు ప్రయత్నం చేస్తే సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం ఉంది. అందువల్ల మీరు సరైన వెబ్‌సైట్‌ను వినియోగిస్తున్నారో లేదో ముందు తనిఖీ చేసుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించిన లోగోలు, URL, ఇతర గుర్తులు, ప్యాడ్‌లాక్ వంటిని తనిఖీ చేయాలి.

మరింత సులభంగా దరఖాస్తు చేసుకొనేందుకు mPassport seva app ను వినియోగించడం ఉత్తమం. అయితే ఈ యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా భద్రతతోపాటు సులభంగా దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు అపాయింట్‌మెంట్ షెడ్యూల్ సహా స్టేటస్ ను కూడా ట్రాక్ చేయవచ్చు.
నకిలీ వెబ్‌సైట్ లతో జాగ్రత్త.. :
పాస్‌పోర్ట్ సేవల కోసం ప్రస్తుతం అనేక నకిలీ వెబ్ సైట్ చలామణిలో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్ లు కూడా ప్రభుత్వ వెబ్‌సైట్ తరహా పోలికలను కలిగి ఉన్నాయి. ఈ రెండు వెబ్‌సైట్ లు https://www.indiapassport.org, http://www.passport-india.in నకిలీవిగా అధికారులు తెలిపారు.
బలమైన పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి :
దీంతోపాటు పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ లాగిన్ సహా పాస్‌వర్డ్ ఎంపికలో జాగ్రత్తలు వహించాలి. బలమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. మరియు క్రమం తప్పకుండా మార్చుతూ ఉండాలి. మరియు వెబ్‌సైట్‌లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ ఉంటే ఆన్ చేసుకోవాల్సి ఉంది. దీంతోపాటు స్మార్ట్ ఫోన్, యాప్‌ను ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి.
అనుమానాస్పదంగా ఉంటే :
దీంతోపాటు బ్యాంకు, ఈమెయిల్ ఖాతాలను తనిఖీ చేస్తుండాలి. ఎటువంటి అనుమానం వచ్చినా.. సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలి. పాస్ పోర్ట్ ద్వారా ఎటువంటి మోసాలకు గురికాకుండా ఉండేందుకు అత్యంత అప్రమత్తంగా ఉండడం ఉత్తమం. సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ముందస్తు జాగ్రత్త అత్యంత ముఖ్యం.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








