Home
News

UPI Frauds ఇలా చేస్తే మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు..!!

పెద్ద నోట్ల రద్దు మరియు కరోనా తర్వాత డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయి. అయితే డిజిటల్‌ లావాదేవీలతో ఎన్ని సౌకర్యాలున్నాయో.. జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాల బారినపడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో 95,000పైగా మోసాలు నమోదయ్యాయి. అయితే ఈ మోసాలు యూపీఐ యాప్‌లలోని లోపాలవల్ల కాదని గుర్తుంచుకోవాలి. మోసాల బారినపడకుండా ఏం చేయాలంటే..

* నగదు స్వీకరిస్తున్నప్పుడు పిన్‌ ఎంటర్‌ చేయమని అడగడం : మోసాలకు పాల్పడేందుకు నిందితులు ఎక్కువగా QR కోడ్‌ స్కానర్‌ను వినియోగించుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. మనం QR కోడ్‌ను సాధారణంగా నగదును పంపించేందుకు ఉపయోగిస్తుంటాం. ఆ సమయంలో పిన్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

UPI Frauds

అదే నగదును స్వీకరించేందుకు పీన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదు. మోసాలకు పాల్పడే వారు QR కోడ్‌ను స్కాన్‌ చేస్తే.. నగదును స్వీకరించిన వాళ్లు కూడా పిన్‌ ఎంటర్‌ చేయాలని కోరుతారు. మనం ఏమరుపాటుగా ఉండి పిన్‌ ఎంటర్‌ చేస్తే మన బ్యాంకు అకౌంట్‌లో ఉన్న నగదును కాజేస్తారు.

* డబ్బు ఎవరికి పంపుతున్నామో సరిచూసుకోకపోవడం : ప్రజలు ఎవరికైతే నగదును పంపుతున్నారో వారి గుర్తింపును ఒకసారి ధ్రువీకరించుకోవాలని ఢిల్లీ పోలీసులు సూచిస్తున్నారు. కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులు లేదా తెలిసిన వారిగా ఫోన్‌ చేసి తాము చెప్పిన విధంగా యూపీఐ పేమెంట్లు చేయాలని కోరుతున్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

* నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లు, వెబ్‌సైట్లు : మోసగాళ్లు నకిలీ వైబ్‌సైట్లు, లేదా నకిలీ కస్టమర్ కేర్‌ నంబర్లు క్రియేట్‌ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. తాజాగా ఇలాంటి ఘటనలపై మూడు కేసులు నమోదుచేసినట్లు చెప్పారు. ఛత్తీస్‌ఘడ్‌లోని పంచకులలో ముగ్గురు బాధితులు సుమారు 10 లక్షల రూపాయలను పోగొట్టుకున్నట్లు తెలిపారు.

ఓ గవర్నమెంట్‌ టీచర్‌ ఎస్‌బీఐ బ్యాంక్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో ఎలా పొందాలో తెలుసుకొనేందుకు.. గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం వెతికారు. అందులో దొరికిన ఓ నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు కాల్‌ చేశారు. అవతలి వారు తామే బ్యాంకు ఉద్యోగులుగా నమ్మించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. ఈ ఘటనలో గవర్నమెంట్‌ టీచర్‌ సుమారు 4.47 లక్షల రూపాయలను కాజేశారని పోలీసులు తెలిపారు.

రెండో కేసులో.. మరో గవర్నమెంట్‌ టీచర్‌ గూగుల్‌పే ద్వారా తప్పుడు లావాదేవీలు చేశారు. ఆ లావాదేవీపై కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేయాలని భావించారు. గూగుల్‌లో నంబర్‌కోసం వెతికారు. అందులో దొరికిన ఓ నకిలీ నంబర్‌ను.. అసలైన బ్యాంకు కస్టమర్‌ కేర్‌ భావించి, వారితో మాట్లాడారు. బ్యాంకు అధికారిగా నమ్మించి సదరు టీచర్‌ నుంచి సుమారు రూ.2.25 లక్షలను దొచుకున్నారని పోలీసులు తెలిపారు.

మూడో కేసులో.. ఓ వ్యక్తి హరిద్వార్‌లో హాటల్‌ బుక్ చేసుకొనేందుకు ప్రయత్నం చేశారు. ఆన్‌లైన్‌లో హాటల్‌ కోసం వెతికారు. అనంతరం అందులో లభించిన ఓ నంబర్‌కు కాల్‌ చేశాడు. అవతలి వ్యక్తి తాను హోటల్‌ మేనేజర్‌ అని పరిచయం చేసుకొని, ముందస్తుగా 10 వేల రూపాయలు చెల్లించాలని కోరాడు. అంగీకరించిన బాధితుడు 10 వేలు చెల్లించాడు. అయితే తనకు నగదు జమకాలేదని చెప్పిన నకిలీ హోటల్‌ మేనేజర్.. తాను ఇచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి పరిశీలించుకోవాలని బాధితుడికి సూచించాడు. దీంతో లింక్‌ క్లిక్‌ చేసిన బాధితుడు మూడు లావాదేవీల్లో 1.49 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడని పోలీసులు చెప్పారు.

* UPI పిన్‌ తరచూ మార్చకపోవడం కూడా కారణమే.. : ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ పిన్‌లను మనం తరచూ మారుస్తూ ఉంటాం. అదే విధంగా UPI పిన్‌ను మార్చకపోవడమూ యూపీఐ మోసాలకు మరో ప్రధాన కారణం.

* పిన్‌ను ఇతరులతో పంచుకోవడం : UPI పిన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరలతో పంచుకోకూడదు. ఇలా పంచుకుంటే ఏదో ఒకసారి మీ బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.

* యూపీఐ లావాదేవీలకు పబ్లిక్‌ WiFi వినియోగించడం : ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా పబ్లిక్ WiFiని వినియోగించకపోవడం చాలా మంచిది. మనం ఏమరపాటుగా చేసినా.. మోసగాళ్లకు చిక్కే అవకాశం ఉంటుంది.

* మోసపూరిత లింక్‌ క్లిక్‌ చేయడం : సైబర్‌ నేరగాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైరస్‌ లేదా మార్‌వేర్‌లను ఈమెయిల్, మెసేజ్‌, వాట్సాప్‌ ద్వారా పంపిస్తుంటారు. అలా ఫోన్‌ హ్యాకింగ్‌ చేసి ఫోన్‌ నుంచి సున్నితమైన సమాచారం అంటే బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారం కొల్లగొట్టే అవకాశం ఉంది. ఫలితంగా బ్యాంక్‌ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన లింక్‌లను క్లిక్ చేయకూడదు.

* రిమోట్‌ యాక్సిస్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించి : ఏదో ఒకసాకులో రిమోట్‌ యాక్సిస్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించి, వాటి యాక్సెస్‌తో ఫోన్‌ను నియంత్రించేలా చేస్తారని, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to avoid upi frauds here 8 tips in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X