యుటిఎస్ యాప్ ద్వారా సీజన్ టికెట్ బుక్ చేయడం ఎలా ?

By Gizbot Bureau
|

మీరు ఇండియన్ రైల్వే ద్వారా నడుపుచున్న లోకల్ ట్రైన్లలో ఎప్పుడూ జర్నీ చేస్తారా..అయితే మీరు వెంటనే సీజన్ టికెట్ తీసుకోండి. దీని ద్వారా మీ మనీ సేవ్ అవుతుంది. అయితే ఇది ఎక్కడైతే లోకల్ ట్రైన్లు నడపబడుతుంటాయో అక్కడ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ సీజన్ టికెట్ ద్వారా మీకు మరింతగా మనీ ఆదా అవుతుంది. ఉదాహరణకు ముంబై లోకల్ రైళ్లు తీసుకుందాం. అక్కడ అంధేరి నుంచి చర్చ్ గేట్ కి రావడానికి సెకండ్ క్లాసులో 10రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఇదే ఫస్ట్ క్లాసులో అయితే రూ.105 రూపాయలు అవుతుంది. ఇక నెల పాస్ తీసుకుంటే సెకండ్ క్లాసుకు రూ.215 అలాగే ఫస్ట్ క్లాసుకు రూ. 60 వరకు అవుతుంది.

How to Book a Season Train Ticket on the UTS App

మీరు చాలా సార్లు ప్రయాణం చేస్తున్నారనుకుందాం. అప్పుడు మీకు ఈ సీజన్ టికెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే వీటిని మీరు ఇండియన్ రైల్వే వెబ్ సైట్లో కొనుగోలు చేయలేరు. మీరు రైల్వే కౌంటర్లలో వెయిట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వేరే ఆప్సన్ అయితే లేదు. అయితే దీనికి పరిష్కార మార్గమే యుటిఎస్ యాప్. ఇండియన్ రైల్వే Centre for Railway Information Systems (CRIS) దీనిని డెవలప్ చేసింది. ఈ యాప్ ద్వారా మీరు తీసుకున్న టికెట్ కూడా యాప్ లో డిస్ ప్లే అవుతుంది. మీరు ప్రింటెట్ కాఫీ తీసుకుపోనవసరం లేదు.

How to Book a Season Train Ticket on the UTS App
మీరు ఈ పద్దతుల ద్వారా దాన్ని ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

  • ముందుగా మీ ఆండ్రాయిడ్, ఐఫోన్ నుండి యుటిఎస్ యాప్ ఓపెన్ చేయండి.
  • అందులో మీరు లాగిన్ కాకుంటే ఓ సారి లాగిన్ అవ్వండి. టాప్ కార్నర్ లో రైట్ సైడ్ న ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ లాగిన్ ఆప్సన్ కనిపిస్తుంది. ఐఫోన్ల యూజర్లకు rectangle with right arrowలా కనపడుతుంది.
  • లాగిన్ అయిన తరువాత అక్కడ బుకింగ్ టికెట్ ఆప్సన్ సెలక్ట్ చేయండి.
  • అందులో కనిపించే సీజనల్ టికెట్ ట్యాప్ చేయండి.
  • అక్కడ మీకు Book & Travel (Paperless)ఆప్సన్ కనిపిస్తుంది. అందులో ఇష్యూ టికెట్ ట్యాప్ చేయండి. ఆండ్రాయిడ్ యూజర్లకయితే టికెట్ రిన్యూ అని కనిపిస్తుంది. అందులో మీ పాత సీజన్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. అతర్వాత మీరు ఎక్కడి నుండి ఎక్కడికెళ్లాలో ఓ సారి సెలక్ట్ చేసుకోండి. ఆ తరువాత ఒకే బటన్ ప్రెస్ చేయండి.
  • ఆ తరువాత మీకు కొన్ని ఆప్సన్లు కనిపిస్తాయి. అందులో ఏసీ నాన్ ఏసీ , ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లాంటి వివరాలు కనిపిస్తాయి. చివరగా పేమెంట్ గేట్ వే ఎంపిక చేసుకున్న తరువాత అడ్రస్ ఎంటర్ చేయండి. ఆ తరువాత డన్ బటన్ నొక్కండి. అప్పుడు మీకు Get Fare అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేయండి. అన్ని వివరాలు కన్పర్మ్ చేసుకున్న తరువాత బుక్ టికెట్ నొక్కండి. అప్పుడు మీకు undertaking from season ticket holder” అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని యాక్సప్ట్ చేయండి. అందులో మీకు Make Payment అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి. ఇది కంప్లీట్ అయిన తరువాత మీకు Show Booked Ticket కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే అది మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
Best Mobiles in India

English summary
How to Book a Season Train Ticket on the UTS App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X