Republic Day 2026 రిపబ్లిక్ డే వేడుకల కోసం టికెట్లు ఎలా బుకింగ్ చేయాలి?
Republic Day 2026 Tickets : కేంద్ర ప్రభుత్వం ఏటా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్‌తోపాటు బీటింగ్ రీట్రీట్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు హాజరయ్యే వారికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖలతోపాటు సామాన్య ప్రజలు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.
టికెట్లు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి :
రిపబ్లిక్ డే పరేడ్ జనవరి 26 వ తేదీన రాజపథ్ వద్ద నిర్వహిస్తారు. జనవరి 28, 29 వ తేదీల్లో బీటింగ్ రీట్రీట్ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు వీలుగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జనవరి 5 వ తేదీ నుంచి ఈ టికెట్ల సేల్ ప్రారంభం కాగా.. జనవరి 14 వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనాలని భావించే వారు ప్రభుత్వం అనుమతించిన కార్డులను ఉపయోగించి, టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలోని రాజ్‌పథ్ వేదికగా నిర్వహించే ఈ వేడుకలో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పారామిలిటరీ బలగాలు, ఇతర ప్రత్యేక బలగాలు పరేడ్‌లో పాల్గొంటాయి.
శకటాల ప్రదర్శన :
భద్రతా బలగాల పరేడ్ తోపాటు యుద్ధ ట్యాంకులు సహా ఆయుధ సంపత్తిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాల ప్రదర్శన కూడా ఉంటుంది. మరియు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
టికెట్ల వివరాలు :
రిపబ్లిక్ డే పరేడ్ (జనవరి 26, 2026) కోసం రూ.20 నుంచి రూ.100 ధర మధ్య టికెట్లు అందుబాటులో ఉన్నాయి. బీటింగ్ రీట్రీట్ రీహార్సల్ (జనవరి 28, 2026) టికెట్ ధర రూ.20 గా ఉంది. అదే బీటింగ్ రీహార్సల్ రీట్రీట్ (జనవరి 29, 2026) టికెట్ ధర రూ.100 గా ఉంది. టికెట్లు అందుబాటులో ఉన్నంత వరకు విక్రయిస్తారు.
Offline ticket sales are available for the #RepublicDay Parade (January 26, 2026), Full Dress Rehearsal of #BeatingRetreat (January 28, 2026), and Beating Retreat (January 29, 2026). 🇮🇳
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) January 5, 2026
Visit counters from January 5 - 14, 2026.
Tap on the link for more details:… pic.twitter.com/Hr5KZuvRvd
టికెట్లు ఎలా బుకింగ్ చేయాలి :
> భారత రిపబ్లిక్ డే వేడుకల టికెట్ల కోసం www.aamantran.mod.gov.in వెబ్‌సైట్‌లో పేరు, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది.
> అనంతరం మీ పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, అడ్రస్, ఇ-మెయిల్ ఐడీ, గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేసి, సేవ్ చేయాలి.
> అక్కడ రిపబ్లిడ్ డే పరేడ్, బీటింగ్ రిహార్సల్, బీటింగ్ రీట్రీట్ వేడుకల్లో మీరు ఏ కార్యక్రమానికి హాజరుకావాలని భావిస్తున్నారో, దానిని ఎంచుకోవాలి.
> అనంతరం ఎన్ని టికెట్లు కావాలి, సీటింగ్ ప్రాధాన్యతను ఎంచుకోవాలి.
> టికెట్లకు సంబంధించిన పేమెంట్‌ను పూర్తి చేయాలి.
> చివరిగా టికెట్లను డౌన్‌లోట్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి ఆన్‌లైన్ టికెట్లతోపాటు ఆన్‌లైన్‌లోనూ పలుచోట్ల అందుబాటులో ఉన్నాయి.
> సేనా భవన్ (గేట్ నంబర్ 5 సమీపంలో) జనవరి 14 వ తేదీ వరకు ఉదయం 10 AM -1PM, 2PM - 5PM వరకు
> శాస్త్రి భవన్ (గేట్ నంబర్ 3 సమీపంలో) జనవరి 14 వ తేదీ వరకు ఉదయం 10 AM -1PM, 2PM - 5PM వరకు
> జంతర్ మంతర్ (ప్రధాన గేట్) జనవరి 14 వ తేదీ వరకు ఉదయం 10 AM -1PM, 2PM - 5PM వరకు
> పార్లమెంట్ హౌస్ జనవరి 14 వ తేదీ వరకు ఉదయం 10 AM -1PM, 2PM - 5PM వరకు
> రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో జనవరి 14 వ తేదీ వరకు ఉదయం 10 AM -1PM, 2PM - 5PM వరకు
> కశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్‌లో జనవరి 14 వ తేదీ వరకు ఉదయం 10 AM -1PM, 2PM - 5PM వరకు ఆఫ్‌లైన్‌లో టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








