Home
News

గోవిందా యాప్ ద్వారా తిరుమల దర్శనం ఈజీగా పూర్తి చేయండి

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. అయితే చాలామంది తిరుపతికి వచ్చే సమయంలో తిరుమలలో రూమ్ దొరుకుతుందో లేదో, దర్శనం ఎలా జరుగుతుందోనని అని టెన్షన్ పడుతుంటారు. భక్తులు ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే సాంకేతికతను ఉపయోగించుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ.

గోవిందా యాప్ ద్వారా తిరుమల దర్శనం ఈజీగా పూర్తి చేయండి

తిరుమల భక్తుల కోసం రెండేళ్ల క్రితమే గోవింద యాప్ రూపొందించింది. ఈ యాప్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇటీవలే ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది గోవింద యాప్. ఇప్పటికే 5 లక్షల మందికి పైగా ఈ యాప్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గదుల దగ్గర్నుంచి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను ఈ యాప్‌లో పొందొచ్చు. గోవింద యాప్‌‌లో మీరు ఏ సేవలు పొందాలన్నా ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

గోవింద యాప్‌లో లభించే సేవలు

గోవింద యాప్‌లో లభించే సేవలు

శ్రీవారి భక్తులకు గోవింద యాప్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చాలారోజుల ముందుగానే గదులు బుక్ చేసుకోవచ్చు. పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రణాళికతో ముందే గదులు బుక్ చేసుకోవడం మంచిది. మీకు ఏ రోజున ఎలాంటి గది కావాలో యాప్‌లో చూసి బుక్ చేయొచ్చు. తిరుమల మాత్రమే కాదు తిరుపతిలో కూడా గదులను బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా గోవింద యాప్‌లో పొందొచ్చు. ఇందుకోసం తేదీని ఎంపిక చేసి స్లాట్ బుక్ చేసుకొని పేమెంట్ పూర్తి చేయాలి.

రోజువారీగా నిర్వహించే సేవల టికెట్లను

రోజువారీగా నిర్వహించే సేవల టికెట్లను

తిరుమలలో రోజువారీగా నిర్వహించే సేవల టికెట్లను కూడా యాప్‌లో పొందొచ్చు. విశేష పూజ, కళ్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను యాప్‌లో పొందొచ్చు. ఇక టీటీడీ నిర్వహించే సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం గోవింద యాప్‌లో పేరు నమోదు చేయొచ్చు. టీటీడీకి చెందిన సప్తగిరి మ్యాగజైన్‌కు మీరు గోవింద యాప్‌లోనే సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.

రెండేండ్ల క్రితమే అందుబాటులోకి..

రెండేండ్ల క్రితమే అందుబాటులోకి..

రెండేండ్ల క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్.. గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్నది. ఇటీవలే ఐఫోన్ యూజర్లకు చెంతకు వచ్చింది. ఇప్పటికే ఐదు లక్షల మందికిపైగా ఈ యాప్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. తిరుమల వెళ్లాలనుకొనే భక్తులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గోవింద యాప్‌లో మీరు ఏ సేవలు పొందాలనుకున్నా ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.టిటిడి దేవస్థానం ఆన్‌లైన్‌లో స్పెషల్ దర్శన్ టికెట్స్ఎలా బుక్ చేసుకోవాలి

use this link images

https://telugu.gizbot.com/how-to/how-book-ttd-tirumala-darshan-tickets-online-guide-telugu/articlecontent-pf86492-016556.html

 

ఏదో ఒక ఫ్రూప్

ఏదో ఒక ఫ్రూప్

ముందుగా నీవు బుక్ చేసుకోవాలంటే నీ దగ్గర ఏదో ఒక ఫ్రూప్ ఉండాలి. పాన్ కార్డు కాని , ఆధార్ కాని, పాస్ పోర్ట్ కాని, ఓటర్ ఐడీ కాని ఏదో ఒకటి ఉండాలి.టిటిడి వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. లింక్ కోసం క్లిక్ చేయండి.అక్కడ మీరు మీ ఒరిజినల్ ఫ్రూప్స్ తో రిజిష్టర్ కావాల్సి ఉంటుంది. చాలా జాగ్ర్తత్తగా చేయవలిసి ఉంటుంది.రిజిష్టర్ పక్రియ అయిపోగానే sign up లోకి వెళ్లండి. మీరు ఇచ్చిన ఐడీ, పాస్‌వర్డ్‌లతో అందులో లాగిన్ అవ్వండి.

  స్పెషల్ ఎంట్రీ దర్శన్

స్పెషల్ ఎంట్రీ దర్శన్

లాగిన్ కాగానే మీకు ఓ స్కీన్ దర్శనమిస్తుంది. అక్కడ మీరు స్పెషల్ ఎంట్రీ దర్శన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు డేట్ తో కూడిన వివరాలు వస్తాయి. అక్కడ మీరు తేదీ మీద క్లిక్ చేస్తే ఖాళీ ఉన్న స్లాట్స్ మీకు కనిపిస్తాయి. ఎరుపు రంగులో ఉన్నవి ఖాళీ లేవని అర్థం.అక్కడ మీరు మీకు కావాల్సిన తేదీని సెలక్ట్ చేసుకున్న తరువాత మీరు పే ఆప్సన్ లోకి వెళ్లి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్ లైన్ ట్రాన్సిక్షన్స్ ద్వారా మీరు అమౌంట్ పే చేయాలి. ఆ ప్రాసెస్ పూర్తి అయితే మీ టికెట్ బుక్ అయినట్లే. అయితే ఒకసారి బుక్ చేసుకున్న తరువాత మళ్లీ క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు.

Best Mobiles in India

English summary
How to book Tirumala Darshan Tickets in Govinda App
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X