రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో తీసుకున్న టికెట్‌ను IRCTC వెబ్‌సైట్‌లో ఎలా క్యాన్సిల్ చేయాలి..?
భారతీయ రైల్వే గతంలో (Indian Railway) పోలిస్తే భారీగా మెరుగుపడింది. మౌలిక వసతులతోపాటు కనెక్టివిటీని అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న రైల్వే.. క్రమంగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. దీంతోపాటు ముఖ్యంగా టెకెటింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. IRCTC (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్) అందుబాటులోకి వచ్చాక.. ఆన్‌లైన్ ద్వారా సులభంగా టికెట్లను బుకింగ్ చేసుకోగలుగుతున్నాం. గతంలో టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లో ఎదురుచూడాల్సి వచ్చేది. ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆన్‌లైన్ ద్వారానే సులభంగా క్యాన్సిలేషన్ కూడా చేయగలుగుతున్నాం.
కౌంటర్ టికెట్లు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు :
IRCTC వెబ్‌సైట్, యాప్ ద్వారా టెకెట్లు బుకింగ్ సహా క్యాన్సిలేషన్ కూడా చేసేందుకు అవకాశం ఉంది. అయితే రైల్వే స్టేషన్ కౌంటర్ (ఆఫ్‌లైన్ టికెట్) వద్ద బుకింగ్ చేసిన టికెట్లను కూడా ఆన్‌లైన్ లో క్యాన్సిల్ చేసేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు సులభంగా రిఫండ్ ను పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో ఎలా క్యాన్సిల్ చేయాలి :
ఆఫ్‌లైన్ టికెట్ ను IRCTC వెబ్‌సైట్, యాప్ నుంచి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇందుకోసం IRCTC వెబ్‌సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం Cancel Ticket ఆప్షన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం ట్రైయిన్, PNR నంబర్ లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత Captcha కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఆ మొబైల్ నంబర్‌కు OTP :
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లో టికెట్ బుకింగ్ చేసుకుంటున్న సమయంలో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ కు OTP వస్తుంది. ఆ OTP ను క్యాన్సిలేషన్ సమయంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ప్యాసింజర్ వివరాలు కనిపిస్తాయి. ధ్రువీకరించుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ :
ఈ వివరాలను మీ సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లో సమర్పించాల్సి ఉంటుంది. క్యాన్సిలేషన్ వివరాలు ధ్రువీకరించుకున్న అనంతరం కౌంటర్ సిబ్బంది మీకు రిఫండ్ నగదును అందిస్తారు. అయితే Confirm అయిన టికెట్ ను కనీసం ట్రైయిన్ ప్రారంభం అయ్యే కనీసం 4 గంటల ముందు కౌంటర్ లో సమర్పించాల్సి ఉంటుంది.
30 నిమిషాల ముందు వరకు :
అదే వెయిటింగ్ లిస్ట్ లేదా RAC టికెట్లు అయితే ట్రైయిన్ ప్రారంభం అయ్యే సమయానికి కనీసం 30 నిమిషాల ముందు వరకు క్యాన్సిలేషన్ Receipt ను సమర్పించే అవకాశం ఉంది. IRCTC ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకుంటే రైల్వే నిబంధనల ఆధారంగా రిఫండ్ అందుకోవచ్చు. Confirmed, వెయిటింగ్ లిస్ట్, RAC టికెట్ల ఆధారంగా రిఫండ్ ను పొందవచ్చు.
రైల్వే సూపర్ యాప్ :
ప్రస్తుతం రైల్వేలో వివిధ అవసరాల కోసం అనేక యాప్ లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ల బుకింగ్ కోసం IRCTC, ప్లాట్‌ఫాం మరియు అన్‌రిజర్వడ్ టికెట్ల కోసం UTS యాప్, ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్ కోసం రైల్ మదద్ యాప్ లు ఉన్నాయి. ట్రైయిన్ ట్రాకింగ్ కోసం నేషనల్ ట్రైయిన్ ఎంక్వైరీ సిస్టమ్ వంటి యాప్‌లు ఉన్నాయి.
ఎప్పుడు విడుదల కానుంది?
ఈ సర్వీసులను ఒకే యాప్ కిందకు తీసుకొచ్చేందుకు వీలుగా సూపర్ యాప్‌ను రైల్వే అభివృద్ధి చేస్తోంది. IRCTC తో సూపర్ యాప్‌ను ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభమైనట్లు గత నెలలో వార్తలు వచ్చాయి. అయితే ఎప్పటి నుంచి ఈ అందుబాటులోకి రానుందో రైల్వే కచ్చితమైన సమాచారం అందించలేదు. ఆండ్రాయిడ్, iOS యూజర్‌లకు సపోర్టు చేయనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








