కోవిన్ పోర్టల్‌లో మీ కోవిడ్ -19 వాక్సిన్ సర్టిఫికెట్‌ను ధృవీకరించడం ఎలా?

|

CoWIN అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడు కొత్తగా "ధృవీకరణ సర్టిఫికెట్" ఎంపికని జోడించింది. మీరు కోవిడ్ -19 వాక్సిన్ యొక్క రెండు మోతాదులను తీసుకొని టీకా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ఉంటే కనుక ఒకసారి ఈ సర్టిఫికెట్‌ను తిరిగి ధృవీకరించడానికి కోవిన్ పోర్టల్‌కు వెళ్లండి. ఇటీవలి కాలంలో నకిలీ COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్లను ఉపయోగించిన అనేక సందర్భాలు ఇప్పటికే నివేదించబడ్డాయి. అటువంటి సందర్భంలో టీకా సర్టిఫికేట్లు మరియు వాటిపై పేర్కొన్న వివరాలను ధృవీకరించడం మరింత కీలకం అవుతుంది. మీ టీకా సర్టిఫికెట్‌ను 2 నిమిషాల్లో ధృవీకరించడానికి మీరు దిగువ పేర్కొన్న దశలను అనుసరించవచ్చు.

 

COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ధృవీకరించే విధానం

కోవిన్ పోర్టల్‌లో మీ కోవిడ్-19 వాక్సిన్ సర్టిఫికెట్‌ను ధృవీకరించడం ఎలా

స్టెప్ 1: కోవిన్ పోర్టల్‌ cowin.gov.in కి వెళ్ళండి.

స్టెప్ 2: హోమ్ స్క్రీన్‌లో కనిపించే అనేక ఎంపికలలో "వెరిఫై వ్యాక్సిన్ సర్టిఫికెట్" ఎంపిక మీద క్లిక్ చేయండి. లేదా మీరు నేరుగా ఈ https://verify.cowin.gov.in/ లింక్‌ను ఓపెన్ చేయవచ్చు.

స్టెప్ 3: తరువాత "స్కాన్ క్యూఆర్" కోడ్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 4: తదుపరి నోటిఫికేషన్ మీ మొబైల్ కెమెరాను యాక్టివేట్ చేయడానికి మిమ్మల్ని అడుగుతుంది.

స్టెప్ 5: సర్టిఫికెట్ దిగువన చూపిన QR కోడ్‌కు కెమెరాను ఉంచండి మరియు దాన్ని స్కాన్ చేయండి.

స్టెప్ 6: ధృవీకరణ పూర్తయిన తర్వాత మీకు ఆకుపచ్చ టిక్ మార్క్ మరియు పేరు, వయస్సు, లింగం, సర్టిఫికేట్ ID, వ్యాక్సిన్ తీసుకున్న తేదీ, వ్యాక్సిన్ పేరు వంటి మరికొన్నింటితో "సర్టిఫికేట్ విజయవంతంగా ధృవీకరించబడింది" అని చూపబడుతుంది.

ముఖ్యంగా ధృవీకరించబడని టీకా సర్టిఫికెట్ ఉంటే కనుక "సర్టిఫికెట్ చెల్లదు" అని పేర్కొనే మెసేజ్ ను అందుకుంటుంది. అక్కడ మీరు మరొక సర్టిఫికేట్‌ను ధృవీకరించే ఎంపికను పొందుతారు. కాబట్టి మళ్లీ ప్రయత్నించండి.

 
కోవిన్ పోర్టల్‌లో మీ కోవిడ్-19 వాక్సిన్ సర్టిఫికెట్‌ను ధృవీకరించడం ఎలా

గుర్తుంచుకోవలసిన విషయాలు

-QR కోడ్ మీ మొబైల్ స్క్రీన్‌లో కనీసం 70 -80 శాతం కవర్ చేయాలి.

-QR కోడ్ కెమెరాకు సమాంతరంగా ఉంచాలి.

- కెమెరా కనీసం 5 సెకన్ల పాటు స్థిరంగా ఉండాలి.

ఒకవేళ మీ మొబైల్ కెమెరా 45 సెకన్లలోపు QR కోడ్‌ని స్కాన్ చేయలేకపోతే కనుక మీకు "కెమెరా QR కోడ్‌ని చదవలేకపోతోంది, దయచేసి మళ్లీ ప్రయత్నించండి" అనే ఒక మెసేజ్ వస్తుంది. మళ్లీ ధృవీకరించడానికి తెరపై ప్రదర్శించబడే మళ్లీ ప్రయత్నించండి బటన్‌పై క్లిక్ చేయండి. ప్రక్రియను మళ్లీ ప్రారంభించండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Certify Your Covid-19 Vaccine Certificate on The CoWIN Portal?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X