మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ తెలుగులో కనబడాలంటే..?

Posted By: Super

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ తెలుగులో కనబడాలంటే..?

 

ఫేస్‌బుక్‌లో సభ్యులుగా ఉన్న మన తెలుగు వారికి శుభవార్త. మీ పేస్‌బుక్ హోమ్ పేజ్ తెలుగులో ఉంటే బాగుంటందనుకుంటున్నారా..?, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీరు ఫేస్‌బుక్‌లోకి ప్రవేశించిన వెంటనే సెట్టింగ్స్ (Settings)లోకి ప్రవేశించి లాంగ్వేజ్ (Language) ఆప్షన్‌ను ఎంచుకని ప్రస్తుత భాషగా తెలుగును ఎంచుకోండి. అంతే  మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ తెలుగులోకి మారిపోతుంది.

ఫేస్‌బుక్‌లోని కామెంట్‌లను ఏలా ఎడిట్ చేయాలి..?

ప్రఖ్యాత సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ 800 మిలియన్‌ల యాక్టివ్ యూజర్లతో విరాజిల్లుతోంది. ఈ సైట్‌లోని ప్రతి యూజర్‌కు సగటున 200మంది స్నేహితులు ఉంటారు. ఫేస్‌బుక్ ద్వారా రోజుకు కొన్ని లక్షలు సంభాషణలు చోటుచేసుకుంటాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకన్న ఫేస్‌బుక్ యాజమాన్యం తాజాగా 'ఎడిట్ కామెంట్ ఫీచర్"ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రాకముందు 'కామెంట్‌ను ఎడిట్ చేసుకునేందుకు వీలు ఉండేది కాదు, డిలీట్ చేసి కొత్తతి పోస్ట్ చెయ్యాల్సి వచ్చేది". ఈ కొత్త అప్లికేషన్ రాకతో చేసిన కామెంట్‌లో ఏమైనాఅక్షరదోషాలు తలెత్తితే ఎడిట్ చేసి రీపోస్ట్ చేసుకోవచ్చు.

కామెంట్‌ను ఎడిట్ చేసుకునే విధానం:

- ముందగా మీరు చేసిన కామెంట్ దగ్గరికి వెళ్లండి.

- కామెంట్ పై కర్సర్ పెట్టిన వెంటనే కుడిభాగంలో పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది.

- పెన్సిల్ ఐకాన్‌ను క్లిక్ చేసిన వెంటనే 'ఎడిట్ ఆర్ డిలిట్" ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది.

- ఎడిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి.

- అక్షరదోషాలను సవరించి తిరిగి మీ కామెంట్‌ను రీపోస్ట్ చెయ్యండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot