ఐఫోన్‌లోని సిరి వాయిస్‌తో విసుగు చెందారా? అయితే ఇలా మార్చేయండి ....

|

ఆపిల్ బ్రాండ్ యొక్క పరికరాలను ఉపయోగించడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో గుర్తించదగిన మరియు చెప్పుకోదగ్గ ఫీచర్లు చాలానే ఉన్నాయి. వాటిలో అధికంగా ఎక్కువ మంది ఉపయోగించేది Siri వాయిస్ ఫీచర్. ఇది సమర్థవంతమైనది మాత్రమే కాకుండా దాని ప్రత్యుత్తరాలలో చమత్కారమైనది. స్మార్ట్‌ఫోన్‌లలో వచ్చిన మొదటి స్మార్ట్ అసిస్టెంట్లలో ఇది ఒకటి. మొదటగా 2011లో ఐఫోన్‌లలో సిరి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. 2016లో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ అసిస్టెంట్ అందుబాటులోకి వచ్చింది. మీరు చాలా కాలంగా ఐఫోన్‌లలో 'సిరి' ఫీచర్ ని ఉపయోగిస్తున్నట్లయితే కనుక ఒకే వాయిస్ ని పదే పదే విని విసుగు చెందడం సహజం. మీకు కూడా ఇలానే ఉంటే మీ ఐఫోన్‌లో సిరి వాయిస్ మరియు భాషను మార్చాలని ప్రయత్నిస్తుంటే కనుక కింద ఉన్న దశల వారీ గైడ్ ని అనుసరించండి.

 

ఐఫోన్‌ మరియు ఐప్యాడ్ లో Siri వాయిస్‌ని మార్చే విధానం

ఐఫోన్‌ మరియు ఐప్యాడ్ లో Siri వాయిస్‌ని మార్చే విధానం

స్టెప్ 1: మీ ఐఫోన్‌లో సెట్టింగ్‌ల యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: క్రిందికి స్క్రోల్ చేసి Siri విభాగాన్ని ఎంచుకోండి లేదా సెర్చ్ విభాగంలో శోధించండి.

స్టెప్ 3: ఇప్పుడు Siri వాయిస్ ఎంపికను నొక్కండి.

స్టెప్ 4: సిరి వాయిస్ రకం మరియు రకాన్ని ఎంచుకోండి. మీరు అమెరికన్, ఆస్ట్రేలియన్, బ్రిటిష్, ఇండియన్, ఐరిష్ మరియు దక్షిణాఫ్రికా వంటి వాయిస్ స్వరాలను ఎంచుకోవచ్చు.

 

మీ iPhone మరియు iPadలో సిరి భాషను మార్చే విధానం
 

మీ iPhone మరియు iPadలో సిరి భాషను మార్చే విధానం

స్టెప్ 1: మీ ఐఫోన్‌లోని సెట్టింగ్‌ల యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: క్రిందికి స్క్రోల్ చేసి Siri విభాగాన్ని ఎంచుకోండి లేదా సెర్చ్ విభాగంలో సిరి కోసం శోధించండి.

స్టెప్ 3: ఇప్పుడు భాష ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 4: మీరు సిరితో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్న భాషను ఎంచుకోండి.

మీరు ఈ భాషలను ఎంచుకోవచ్చు - చైనీస్ (కాంటోనీస్ - చైనా మెయిన్‌ల్యాండ్), చైనీస్ (కాంటోనీస్ - హాంకాంగ్), చైనీస్ (మాండరిన్ - చైనా మెయిన్‌ల్యాండ్), చైనీస్ (మాండరిన్ - తైవాన్), డానిష్, డచ్ (బెల్జియం), డచ్ (నెదర్లాండ్స్), ఇంగ్లీష్ ( ఆస్ట్రేలియా), ఇంగ్లీష్ (కెనడా), ఇంగ్లీష్ (భారతదేశం), ఇంగ్లీష్ (ఐర్లాండ్), ఇంగ్లీష్ (న్యూజిలాండ్), ఇంగ్లీష్ (సింగపూర్), ఇంగ్లీష్ (దక్షిణాఫ్రికా), ఇంగ్లీష్ (యునైటెడ్ కింగ్‌డమ్), ఇంగ్లీష్ (యునైటెడ్ స్టేట్స్), ఫిన్నిష్, ఫ్రెంచ్ (ఫ్రాన్స్), ఫ్రెంచ్ (బెల్జియం), ఫ్రెంచ్ (కెనడా), ఫ్రెంచ్ (స్విట్జర్లాండ్), జర్మన్ (ఆస్ట్రియా), జర్మన్ (జర్మనీ), జర్మన్ (స్విట్జర్లాండ్), ఇటాలియన్ (ఇటలీ), ఇటాలియన్ (స్విట్జర్లాండ్), హిబ్రూ, జపనీస్, కొరియన్ మలేయ్, నార్వేజియన్ బోక్మల్, పోర్చుగీస్ (బ్రెజిల్) రష్యన్, స్పానిష్ (చిలీ), స్పానిష్ (మెక్సికో), స్పానిష్ (స్పెయిన్), స్పానిష్ (యునైటెడ్ స్టేట్స్), స్వీడిష్, థాయ్ మరియు టర్కిష్.

 

Macలో సిరి వాయిస్‌ని మార్చే విధానం

Macలో సిరి వాయిస్‌ని మార్చే విధానం

స్టెప్ 1: మీ Macలో Apple మెనూని తెరవండి.

స్టెప్ 2: సిస్టమ్ ప్రిఫరెన్స్ ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 3: ఇప్పుడు Siri ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 4: వాయిస్ వెరైటీ ఆప్షన్‌కి వెళ్లి మీకు నచ్చిన సిరి వాయిస్‌ని ఎంచుకోండి.

 

Macలో సిరి భాషను మార్చే విధానం

Macలో సిరి భాషను మార్చే విధానం

స్టెప్ 1: మీ Macలో ఆపిల్ మెనూని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: సిస్టమ్ ప్రిఫరెన్స్ ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 3: ఇప్పుడు Siri ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 4: లాంగ్వేజ్ ఆప్షన్‌కి వెళ్లి మీకు నచ్చిన సిరి లాంగ్వేజ్‌ని ఎంచుకోండి.

 

Best Mobiles in India

English summary
How to Change Siri Voice and Language On Your iPhone and iPad

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X