ఓటర్ కార్డు అప్లయి, మార్పులు చేర్పులు చేయడం ఎలా ?
దేశంలో మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక సమరం మొదలు కాబోతోంది. కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరూ ఓటు హక్కుని వినియ
దేశంలో మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక సమరం మొదలు కాబోతోంది. కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరూ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల కమిషన్ కూడా ఓటు గురించి ప్రచారం చేస్తోంది. ఓటు లేని వారు ఓటుకు అప్లయి చేసుకోవాలని అలాగే ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే త్వరగా చేసుకోవాలని పిలుపునిస్తోంది. ఓటులో మార్పులు చేర్పులు చేయాలనుకున్న వారు ఫారం 6ను ఉపయోగించి National Voter’s Service portal website ద్వారా ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవాలని పిలుపునిచ్చింది.

అప్లికేషన్ ని https://www.nvsp.in/Forms/Forms/form6 ఈ లింక్ ద్వారా పొందవచ్చు. ఈ శీర్షికలో భాగంగా ఓటు కార్డు ఎలా అప్లయి చేయాలి మార్పులు ఎలా చేయాలి అనేదానిపై మీకు కొన్ని గైడెన్స్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

గైడ్ 1
మీరు నియోకవర్గం మారాలనుకున్నా, కొత్తగా ఓటింగ్ కు అప్లయి చేయాలన్ని ఫాం 6ను ఉపయోగించండి. ఇందుకోసం మీరు passport size photograph,age and address proof scanned copies దగ్గర పెట్టుకోండి.

గైడ్ 2
వయసును నిర్థారించేందుకు కావాల్సిన డాక్యుమెంట్లు
Birth certificate;
marksheet of 10th, 8th and 5th class;
Indian passport;
driver's license
Aadhar letter

గైడ్ 3
అడ్రస్ కోసం
డ్రైవింగ్ లైసెన్స్ ,
ఇండియన్ పాస్ పోర్టు,
ేషన్ కార్డు,
income tax assessment order,
రెంటలల్ అగ్రిమెంట్,
వాటర్ బిల్,
టెలిఫోన్ బిల్,
bank/kisan/post office passbook,
గ్యాస్ కనెక్షన్ బిల్,
కరెంట్ బిల్

గైడ్ 4
www.nvsp.inలోకి లాగిన్ అవ్వండి. అందులో Apply online for registration of new voter/due to shifting from AC'ని క్లిక్ చేయండి. అందులో ఫారం 6ని సెలక్ట్ చేసుకోండి.

గైడ్ 6
లాంగ్వేజ్ ని ఎన్నుకోండి. Form 6లోని కాలమ్స్ అయిన Mandatory particulars, Address, Optional particulars, Supporting documents and Declarationని చూడండి. వద్దనుకుంటే కొన్ని కాలమ్స్ స్కిప్ కొట్టండి. మీరు సబ్ మిట్ చేసిన తరువాత ఎస్మెమ్మెస్ ద్వారా కాని అలాగే మొబైల్ ద్వారా కాని అప్ డేట్ అందుకుంటారు.

గైడ్ 7
అవసరమైన వివరాలు
Assembly/Parliamentary Constituency, State and Districtని కరెక్ట్ గా ఫిల్ చేయాలి.ఆ తర్వాత మీకు అక్కడ కనిపించే first-time voter, shifting from another constituency వివరాలను చెక్ చేసుకోండి.

గైడ్ 8
అక్కడ మీకు కనిపించే వివరాలను ఎంటర్ చేసుకుంటూ వెళ్లండి. దీన కోసం మీరు ట్యాబ్ కీని కూడా వాడుకోవచ్చు. కరెంట్ అడ్రస్ , పర్మినెంట్ అడ్రస్ లాంటి వివరాలు మీకు అక్కడ కనిపిస్తాయి. వాటిని చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి.
ఇందులో మీరు మీ మెయిల్ ఐడి అలాగే ఫోన్ నంబర్ లు కరెక్ట్ గా ఇవ్వాలి. మళ్లీ మార్చుకోవడం కుదరకపోవచ్చు. ఆ తర్వాత అక్కడ అడిగే డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. తర్వాత డిక్లరేషన్ ఫాం ఫిల్ చేయండి. ఆ తర్వాత మీకు కనిపించే captcha కోడ్ ని ఎంటర్ చేయండి.

గైడ్ 10
మీరు ఇక్కడ ముఖ్యంగా కనిపించే reference IDని నోట్ చేసుకోవడం మరచిపోవద్దు. ఎందుకంటే దీని ద్వారానే మీ అకౌంట్ అప్లికేషన్ ట్రాక్ చేసేందుకు వీలు ఉంటుంది.


Click it and Unblock the Notifications








