వాట్సప్ భాషను మార్చుకోవడం ఎలా ? స్టెప్ బై స్టెప్ మీకోసం
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్ వాడుతున్నారు. ఛాటింగ్ ప్పంచం మరింతగా ముందుకు వచ్చిన తరువాత దీని మీద మరింతగా యూజర్లకు ఫోకస్ పెరిగింది. రోజులో ఎక్కువశాతం దాని మీద గడుపుతున్నారు. ఈ నే
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్ వాడుతున్నారు. ఛాటింగ్ ప్పంచం మరింతగా ముందుకు వచ్చిన తరువాత దీని మీద మరింతగా యూజర్లకు ఫోకస్ పెరిగింది. రోజులో ఎక్కువశాతం దాని మీద గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సప్ ఇంటర్ ఫేస్ మనకు అనుకూలంగా మార్చుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే అది ఎలా మార్చకోవాలో తెలియక సతమమతవుతుంటారు.

ఈ శీర్షికలో భాగంగా వాట్సప్ ఇంటర్‌ఫేస్‌ను మనకనుకూలమైన భాషలోకి మార్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

గూగుల్ ప్లే స్టోర్ నుండి
సాధారణంగా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి వాట్సప్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. దీనిని తర్వాత మీరు మీకు కావాల్సిన భాషలోకి మార్చుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పిస్తోంది . వాట్సప్ మొత్తం 40 భాషల్లో తన సేవలు అందిస్తోంది. అందులో హిందీ, ఉర్దూ, పంజాబీ, మరాఠీ, బెంగాలీ, తమిళ్, గుజరాతీ, మళయాళం, కన్నడ వంటి భారీయ భాష కూడా ఉన్నాయి.

తెలుగులో టైప్ చేయడం ఎలా ?
ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి.
తర్వాత రైట్ సైడ్ టాప్‌లో కనిపించే త్రీ డాట్స్ ను క్లిక్ చేయండి.
తర్వాతి స్కీన్‌లో App Language క్లిక్ చేస్తే మీకు అనేక రకాలైన భాషలు కనిపిస్తాయి.ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, పంజాబీ, తెలుగు, మరాఠి, తమిళ్, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, మలయాళం ఈ భాషలన్నీ కూడా వాట్సప్ లో అందుబాటులో ఉంటాయి.
అందులో మీరు మీ వాట్సప్‌ని తెలుగులోకి మార్చాలంటే తెలుగుపై క్లిక్ చేయండి.
ఇక మీ వాట్సప్‌లో ఆప్షన్స్ అన్నీ తెలుగులోనే కనిపిస్తాయి.

ఆండ్రాయిడ్ ఫోన్లో భాషను ఎలా సెలక్ట్ చేసకోవాలి...
సెట్టింగ్స్ యాప్ ను ఓపెన్ చేయాలి.
లాంగ్వేజ్ ఇన్ పుట్ పై ట్యాప్ చేయాలి.
భాషలను ఓపెన్ చేయాలి.
మీకు కావాల్సిన భాషను ఎంచుకోండి
ఇప్పుడు వాట్సప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన టెక్ట్స్ ను టైప్ చేయండి.

ఐఫోన్స్ లో ఎలా ఎంచుకోవాలి.
సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి
జనరల్ ను ట్యాప్ చేయండి
లాంగ్వేజ్ అండ్ రిజన్ కు వెళ్లండి
ఇప్పుడు ఐఫోన్ భాషను ఎంచుకోండి
మీకు కావాల్సిన భాషను సెలక్ట్ చేసుకోండి
వాట్సప్ ఓపెన్ చేసి మీరు ఎంచుకున్న భాషలో టెక్ట్స్ టైప్ చేయండి.


Click it and Unblock the Notifications