Aadhaar History మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవాలా..?
భారత్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డు (Aadhaar Card) ఒకటిగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకొనే వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలతోపాటు బ్యాంకు అకౌంట్‌లు ఓపెన్ చేసేందుకు, సిమ్ కార్డులు కొనుగోలు చేసేందుకు కూడా ఆధార్ కార్డు నంబర్ లను సమర్పిస్తున్నారు. ఇలా అనేక చోట్ల ఆధార్ వివరాలు సమర్పించడం వల్ల కొన్నిసార్లు అవి దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది.
ఆధార్ కార్డు హిస్టరీ : ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వినియోగించారనే వివరాలు తెలుసుకొనే అవకాశం ఉంది. దీని ద్వారా కార్డు ఎక్కడైన దుర్వినియోగం జరిగినట్లు భావిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఆధార్ కార్డు హిస్టరీ (Aadhaar History) ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ ద్వారా సులభంగా తెలుసుకొనేందుకు వీలుంటుంది.

ఆధార్ కార్డు హిస్టరీ తెలుసుకొనేందుకు UIDAI వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. అనంతరం మై ఆధార్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ లో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీను క్లిక్ చేయాలి. అనంతరం మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆధార్ నంబర్, OTP సహా ఇతర వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది.
లాగిన్ అయ్యాక, ఆ పేజీలో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్‌ను గుర్తించవచ్చు. ఆధార్ నంబర్ కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చిన OTP, బయోమెట్రిక్ ఇతర పద్ధతుల ద్వారా ఆధార్ కార్డును ఎక్కడ ఉపయోగించారో వంటి వివరాలను తెలుసుకోవచ్చు. అనుమానాస్పద వినియోగాన్ని గుర్తిస్తే UADAI వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మరియు 1947 నంబర్‌కు కాల్ చేసి మీ సమస్యను ప్రస్తావించి, ఫిర్యాదు చేయాలి.
మీ అనుమతి లేకుండా ఆధార్ కార్డును ఇతరులు ఎవరూ ఉపయోగించకుండా ఆధార్ బయోమెట్రిక్ ను లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఆధార్ వెబ్‌సైట్ లో ప్రత్యేక ఆప్షన్ అందుబాటులో ఉంది. లాక్ చేసేందుకు ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ (Aadhaar Update) చేసుకొనేందుకు UIDAI ప్రస్తుతం అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 14 2024 వరకు గడువు ఉంది. ఆధార్ సేవా కేంద్రాలు సహా ఆన్‌లైన్ ద్వారా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో పేర్లు, పుట్టిన తేదీ, ఫోటో, అడ్రస్, మొబైల్ నంబర్ అప్ డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ వెబ్ సైట్ ద్వారా అడ్రస్ వివరాలను అప్ డేట్ చేయవచ్చు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే ఫోటో, పేర్లు మార్చేందుకు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. జీవిత కాలంలో రెండు సార్లు మాత్రమే పేరు అప్ డేట్ చేసుకోవచ్చు. ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి అయినా ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.


Click it and Unblock the Notifications