Home
News

మీ పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లు ఉన్నాయో చూడండి.. అలానే వదిలేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు రావచ్చు..!

ఒకప్పుడు ఫోన్‌ నంబర్లు కేవలం కాలింగ్ కోసమే ఉపయోగించే వారు. ప్రస్తుతం ఫోన్‌ నంబర్లకు అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు సహా అనేక రకాలు వినియోగిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా ఫోన్‌ నంబర్లు పొందుతున్నారు. ఈ మొబైల్ నంబర్లను ఉపయోగించి అనేక నేరాలకు పాల్పడుతున్నారు.

ఇప్పటికే అనేక మంది బాధితులుగా మారారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ తరహా నేరాలపై అనేక చర్యలు తీసుకుంది. ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ కూడా తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా తమ పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు.

How to check mobile numbers issued on your name

ఈ వెబ్‌సైట్‌ ద్వారా :
సంచార్‌ సాథీ (Sanchar Saathi) వెబ్‌సైట్‌/ యాప్‌ను సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (C-DoT) అభివృద్ధి చేసింది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మరియు మీకు సంబంధం లేని లేదా మీరు వినియోగించని సిమ్ కార్డులను బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఎన్నో ఉపయోగాలు :
మీరు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్‌లను బ్లాక్ చేయవచ్చు. మరియు సంబంధిత వర్గాలకు ఫిర్యాదు చేయవచ్చు. డివైజ్ IMEI నంబర్ల ద్వారా గుర్తించవచ్చు. దీంతోపాటు ప్రస్తుతం అనేక మంది ఇబ్బంది పెడుతున్న స్పామ్స్‌ కాల్స్‌, మెసేజ్‌లను బ్లాక్‌ చేయవచ్చు మరియు ఫిర్యాదు చేయవచ్చు.

How to check mobile numbers issued on your name

దీంతోపాటు సంచార్‌ సాథీ వెబ్‌సైట్‌/ యాప్‌ ద్వారా మరో ఉపయోగం కూడా ఉంది. మీరు సెకెండ్ హ్యాండ్ మొబైల్‌ కొనుగోలు చేయాలని భావిస్తుంటే.. కొనుగోలు చేసే ముందు ఆ మొబైల్‌ IMEI నంబర్‌ ను నమోదు చేయాలి. అనంతరం మీకు ఆ ఫోన్ బ్లాక్‌ చేయబడి ఉందా లేదా ఈ ఫోన్‌ పైన ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అనే విషయాలు తెలుస్తాయి.

దీని ఆధారంగా ఈ ఫోన్ కొనుగోలుపై మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా లక్షల మొబైల్స్‌ను బ్లాక్ చేశారు. మరియు అందులో అనేక మొబైల్స్‌ను యజమానులకు అందించారు. ప్రతి ఒక్కరూ ఈ ప్లాట్‌ఫాం ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

మీ పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి?
స్టెప్‌ 1 : మీ పేరు ఉన్న సిమ్ కార్డుల వివరాల కోసం ముందుగా sancharsaathi.gov.in
స్టెప్‌ 2 : సంచార్‌ సాథీ వెబ్‌సైట్‌లోని సిటిజన్‌ సెంట్రిక్‌ సర్వీస్‌ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 3 : అనంతరం know Mobile Connections in your Name పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 4 : ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌ మరియు Captcha కోడ్‌ ను నమోదు చేయాలి.

స్టెప్ 5 : మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే OTP ను వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాలి.
స్టెప్‌ 6 : మీ గుర్తింపు కార్డులపై ఉన్న మొత్తం నంబర్‌లు అక్కడ కనిపిస్తాయి.
స్టెప్‌ 7 : అక్కడ కనిపించిన నంబర్‌లలో మీకు సంబంధం లేని నంబర్లు ఉంటే అక్కడే బ్లాక్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

స్టెప్‌ 8 : అక్కడ కనిపించే Not My Number ఆప్షన్‌ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 9 : మరోసారి ధ్రువీకరించుకొని Submit ఆప్షన్ పైన క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.
స్టెప్‌ 10 : చివరిగా మీకు ఓ ID వస్తుంది. దాని ద్వారా మీ విజ్ఞప్తి ని ట్రాక్‌ చేయవచ్చు.

సంచార్‌ సాథీ ప్లాట్‌ఫాం ద్వారా మీకు సంబంధం లేని ఫోన్‌ నంబర్లను బ్లాక్‌ చేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ ప్లాట్‌ఫాం ఆధారంగా తమ వివరాలను తనిఖీ చేసుకోవాలి. లేకుంటే మీ పేరు మీద ఉన్న ఫోన్‌ నంబర్లు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్తే.. భవిష్యత్‌లో మీకు చట్టపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to check mobile numbers issued on your name here is the step wise guide in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X