మద్యం బాటిల్ అసలు ధర, ఫేక్ ఆల్కాహాల్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకోవడం ఎలా ?

దేశంలో మద్యం అనేది విచ్చలవిడి కావడంతో దానికి డిమాండ్ చాలా ఎక్కువై పోయింది. ఈ నేపథ్యంలోనే డిస్ట్రిబ్యూటర్లు విదేశాల నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. కొన్ని ఫారిన్ బ్రాండ్స్ కు చాలా క్రేజ్ ఉండటం

|

దేశంలో మద్యం అనేది విచ్చలవిడి కావడంతో దానికి డిమాండ్ చాలా ఎక్కువై పోయింది. ఈ నేపథ్యంలోనే డిస్ట్రిబ్యూటర్లు విదేశాల నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. కొన్ని ఫారిన్ బ్రాండ్స్ కు చాలా క్రేజ్ ఉండటం కూడా విదేశాల నుంచి మద్యం దిగుమతి దేశంలోకి ఎక్కువగా జరుగుతోంది. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని కొందరు ఫేక్ ఆల్కాహాల్ ని మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. చాలా కాస్ట్ అయిన ఫారిన్ బ్రాండ్స్ Johnnie Walker or Chivas Regal వంటి వాటిని లోకల్ గా తయారు చేస్తూ అధిక ధరలకు అమ్ముతున్నారు.

మద్యం బాటిల్ అసలు ధర, ఫేక్ ఆల్కాహాల్‌ను ఆన్‌లైన్‌లో  తెలుసుకోవడం ఎలా ?

ఇందులో ఛీప్ లిక్కర్ ని ప్రవేశపెట్టి ఇవే ఫారిన్ బ్రాండ్స్ అంటూ మద్యం బాబులకు అంటగడుతున్నారు. అయితే ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒరిజినల్ అవునో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరి ఎలా తెలుసుకోవాలి అనే దానిపై మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

barcode or serial number

barcode or serial number

ముందుగా మీరు బార్ కోడ్ చెక్ చేసుకోవాలి. కేస్ కి అడ్డంగానూ అలాగే బాటిల్ కి నిలువుగానూ బార్ కోడ్ ఇస్తారు.ఈ ఫోటోలో ఉన్న విధంగా స్టికర్ ఉంటేనే కొనుగోలు చేయండి. ఈ ఫోటో ఢిల్లీలో మద్యం బాటిల్ కి సంబంధించినది.

వెబ్ సైట్లో చెక్ చేయడం ఎలా ?

వెబ్ సైట్లో చెక్ చేయడం ఎలా ?

ముందుగా మీరు https://delhiexcise.gov.in/Portal/liquorsalecheck ఈ వెబ్ లోకి వెళ్లండి. అందులో మీరు బాటిల్ పై కనిపించే సీరియల్ నంబర్ ని అడిగిన చోట ఎంటర్ చేయండి.ఈ నంబర్ 28 అంకెల కన్నా తక్కువ ఉండి ఉంటుంది. ఇందులో స్పెషల్ క్యారక్టర్స్ కాని బ్రాకెట్స్ కాని ఏం ఉండవు.

సీరియల్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత సబ్ మిట్ బటన్ నొక్కండి. సబ్ మిట్ బటన్ నొక్కగానే మీకు ఓ స్టేటస్ కనిపిస్తుంది. అది ఒరిజినల్ అయితే మీకు The Liquor is from an authorized supply source అని బ్రాండ్ నేమ్ తో సహా కనిపిస్తుంది. దీంతో పాటు దాని ధర, అడ్రస్ , సైజు, ఎక్కడ కొనుగోలు చేశారు వంటి వివరాలు కూడా కనిపిస్తాయి.

mLiquorSaleCheck” app
 

mLiquorSaleCheck” app

మీరు యాప్ ద్వారా కూడా చెక్ చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుండి mLiquorSaleCheck అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది ఇన్ స్టాల్ అయిన తరువాత అందులో స్కాన్ ఉన్న చోట బాటిల్ బార్ కోడ్ స్కాన్ చేయండి. ఒకవేళ అది ఫెయిల్ అయితే సీరియల్ నంబర్ ఎంటర్ చేయండి. ఈ నంబర్ 28 అంకెల కన్నా తక్కువ ఉండి ఉంటుంది. ఇందులో స్పెషల్ క్యారక్టర్స్ కాని బ్రాకెట్స్ కాని ఏం ఉండవు.సీరియల్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత సబ్ మిట్ బటన్ నొక్కండి. సబ్ మిట్ బటన్ నొక్కగానే మీకు ఓ స్టేటస్ కనిపిస్తుంది. అది ఒరిజినల్ అయితే మీకు The Liquor is from an authorized supply source అని బ్రాండ్ నేమ్ తో సహా కనిపిస్తుంది. దీంతో పాటు దాని ధర, అడ్రస్ , సైజు, ఎక్కడ కొనుగోలు చేశారు వంటి వివరాలు కూడా కనిపిస్తాయి.

పై రెండూ ఫెయిల్ అయితే చెక్ చేయడం ఎలా ?

పై రెండూ ఫెయిల్ అయితే చెక్ చేయడం ఎలా ?

ఈ రెండు నిర్థారణ కాకపోతే అది అంతా కల్తీ మద్యం అని నిర్థారించుకోవాలి. ఏ స్టేట్ లో నుంచి వచ్చింది అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ వారీగా కూడా మద్యం సీరియల్ నంబర్స్ అందుబాటులో ఉంటాయి. పై ప్రాసెస్ అంతా ఢిల్లీ సర్కిల్ లో ఉన్న వారికి మాత్రమే. ఇతర రాష్ట్రాల వారు చెక్ చేస్తే ఫలితాలు కనపడకపోవచ్చు.

Best Mobiles in India

English summary
Fake alcohol: How to check online the liquor you bought is authentic and know the actual price

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X