Home
News

Jio అందించిన 2GB అదనపు ఉచిత డేటా మీకు వచ్చిందా?

భారతదేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో ఇప్పుడు రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను అందించే కొత్త 'జియో డేటా ప్యాక్' ను ప్రకటించింది. ఈ కొత్త 'జియో డేటా ప్యాక్' ను టెలికాం ఆపరేటర్ రెండు రోజుల క్రితం లాంచ్ చేశారు.

రిలయన్స్ జియో

కొత్త ఆఫర్ కింద వినియోగదారులకు అపరిమిత డేటా లభిస్తుంది. అయితే వినియోగదారులు 2GB మార్క్ పూర్తి చేసిన తర్వాత డేటా యొక్క స్పీడ్ 64 Kbps కు తగ్గించబడుతుంది. రిలయన్స్ జియో అందించే జియో డేటా ప్యాక్ ఏప్రిల్ 1, 2020 వరకు చెల్లుతుంది. ఈ ప్యాక్ యొక్క అన్ని రకాల ప్రయోజనాలను ఆస్వాదించడానికి వినియోగదారులు ఎటువంటి అదనపు మొత్తాన్ని ఖర్చు చెల్లించాల్సిన అవసరం లేదు.

జియో కొత్త డేటా ప్యాక్‌

జియో కొత్త డేటా ప్యాక్‌

జియో యొక్క ఈ కొత్త డేటా ప్యాక్‌లో ఉచిత వాయిస్ కాల్స్ మరియు మెసేజ్ల సౌకర్యం ఉండవని కూడా జియో యూజర్లు గమనించాలి. గతంలో రిలయన్స్ జియో ఏదైన ప్రత్యేక సందర్భంలో వినియోగదారుల అకౌంటుకు ఉచిత డేటాను జమ చేయడాన్ని అందరు గమనించారు. దేశం మొత్తం ప్రస్తుతం లాక్డౌన్లో ఉన్నందున జియో 2GB రోజువారీ డేటాను జమ చేస్తుంది.

లాక్డౌన్ వ్యవధిలో వినియోగదారులకు జియో డేటా ప్యాక్

లాక్డౌన్ వ్యవధిలో వినియోగదారులకు జియో డేటా ప్యాక్

కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా ప్రజలు అందరు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. ప్రాణాంతక వైరస్‌తో పోరాడటానికి ఇంటి నుండి పనిచేయవలసినదిగా ఆదేసించడంతో పాటు 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అటువంటప్పుడు డిజిటల్ వినియోగదారులు తమ పని మరియు వినోదం కోసం అధికంగా ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. 2020 ఏప్రిల్ 1 వరకు వినియోగదారులకు 2 జిబి ఉచిత డేటాను అందించడానికి రిలయన్స్ జియో కొత్త డేటా ప్యాక్ ను అందించింది. ప్రతి చందాదారులకు ఈ జియో డేటా ప్యాక్ అందుబాటులో లేదని గమనించండి. ట్విట్టర్‌లో చాలా మంది వినియోగదారులు ఈ ప్లాన్ యొక్క లభ్యతను ధృవీకరించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని జియో నంబర్‌లో అటువంటి ఉచిత డేటా జమ చేయబడటం మేము గమనించలేదు.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
How to Check Reliance Jio Data Pack is Active or Not?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X