Home
News

ఎప్పటి నుంచో నచ్చిన ఫోన్‌ నంబర్‌ కోసం ఎదురుచూస్తున్నారా.. వెంటనే ఇలా చేయండి..!

మొబైల్‌ వినియోగం ప్రారంభ దశలో ఉన్నప్పుడు టెలికాం సంస్థలు అందుబాటులో ఉంచిన నంబర్లను మాత్రమే ఎంచుకోవాల్సి ఉండేది. వినియోగదారులకు కావాల్సినట్లుగా నంబర్లను ఎంచుకొనేందుకు అవకాశం ఉండేది కాదు. అనంతరం మారిన పరిస్థితుల్లో వినియోగదారులకు నచ్చిన ఫోన్‌ నంబర్ల సిరీస్‌ ను కొనుగోలు చేసేందుకు అవకాశం దక్కింది. తాజాగా ప్రముఖ టెలికాం ప్రొవైడర్‌ జియో.. యూజర్లకు నచ్చిన నంబర్లను ఎంచుకొనే (Jio Choose Mobile Number Scheme) అవకాశం కల్పించింది.

జియో తాజాగా చాయిస్‌ నంబర్‌ స్కీమ్ పేరుతో సరికొత్త స్కీమ్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఫోన్‌ నంబర్లను కొనుగోలు చేయవచ్చు. ఇందుకు కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌ లో భాగంగా.. ఫోన్ నంబర్‌ లో చివరి 4 నుంచి 6 అంకెలు ఎంచుకొనే అవకాశం ఉంది.

how to book own jio number from jio app and website

యూజర్లు తమ పిన్‌ కోడ్‌ పరిధిలోని అందుబాటులో ఉన్న ఫోన్‌ నంబర్‌లను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రూ.499 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జియో వెబ్‌సైట్‌ లేదా మై జియో యాప్‌ ద్వారా చాయిస్‌ నంబర్‌ స్కీమ్‌ ద్వారా సిమ్‌ కార్డులను కొనుగోలు చేయవచ్చు. జియో ప్లస్‌ పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు ఈ ఆఫర్‌ ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.

స్టెప్‌ 1 : తొలుత https://www.jio.com/selfcare/choice-number వెబ్‌ సైట్‌ లోకి వెళ్లాలి.
స్టెప్‌ 2 : అనంతరం మీ ప్రస్తుతం జియో పోస్ట్‌పెయిడ్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి..
స్టెప్‌ 3 : ఆ నంబర్‌కు వచ్చిన OTP ను ఎంటర్‌ చేయాలి.

స్టెప్‌ 4 : ఆ తర్వాత మీకు మరో కొత్త పేజీ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీకు కావాల్సిన నంబర్‌ ను ఎంచుకొనేందుకు అవకాశం ఉంటుంది.
స్టెప్‌ 5 : మీకు నచ్చిన సిరీస్ నంబర్లను ఎంటర్‌ చేసిన అనంతరం.. అందుబాటులో ఉన్న నంబర్లు మీకు కనిపిస్తాయి.
స్టెప్‌ 6 : చివరగా రూ.499 చెల్లించి సిమ్ కార్డును పొందవచ్చు.

మై జియో యాప్‌ ద్వారా కూడా నంబర్‌లను ఎంచుకోవచ్చు.
మై జియో యాప్‌ లోని మెనూ ఆప్షన్‌ లో Lets Book Now అనే ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి. అనంతరం మీ పేరు, పిన్‌ కోడ్‌ మరియు 4-5 అంకెల నంబర్‌ ను ఎంటర్‌ చేయాలి (మీకు కావాల్సిన నంబర్‌). ఆ తర్వాత Show Available numbers ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి. మీకు నచ్చిన నంబర్‌ను ఎంచుకున్న అనంతరం రూ.499 చెల్లించాలి. అనంతరం కొత్త సిమ్‌ కార్డు కలెక్ట్‌ చేసుకోవాలి.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to choose mobile number from jio choice number scheme
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X