Boat Bluetooth Speakers: మీ గదికి సరిపోయే బోట్ స్పీకర్ ఏది? సింపుల్‌గా తెలుసుకోండి!
Boat Bluetooth Speakers: భారతీయ మార్కెట్లో బడ్జెట్ ధరకు తగ్గట్టుగా నాణ్యమైన ఆడియో పరికరాలను అందించడంతో బోట్(boat) ప్రత్యేక ముద్ర వేసింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం బోట్ స్పీకర్ల పోర్ట్ ఫోలియో చాలా విస్తరించింది. జేబులో పట్టే చిన్న పోర్టబుల్ స్పీకర్ల నుంచి రెండు వైర్‌లెస్ మైకులు, కారాఓకో ప్రోట్యూనర్స్‌తో వచ్చే భారీ పార్టీ టవర్ల వరకు అనేక మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే కేవలం వాటేజ్ లేదా ధరను మాత్రమే చూసి కాకుండా.. మన గది పరిమాణం, వినియోగించే విధానానికి తగ్గట్టు ఏ స్పీకర్ సరిపోతుందో ఈ ప్రత్యేక విశ్లేషణలో తెలుసుకుందాం.
ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు ఇవే..
స్పీకర్ ఎంచుకునేటప్పుడు కేవలం వాటేజ్ కంటే డ్రైవర్/వూఫర్ పరిమాణం, మొబిలిటీ(క్యాబినెట్ డిజెైన్), మైక్రోఫోన్ సౌకర్యం చాలా ముఖ్యం .
వూఫర్ పరిమాణం: ఇది బాస్ క్వాలిటీని నిర్ణయిస్తుంది. 3.5 అంగుళాల చిన్న డ్రైవర్లు బాల్కనీకి సరిపోతే, 8 అంగుళాల భారీ వూఫర్లు పెద్ద హాల్స్, ఓపెన్ గ్రాండ్ పార్టీలకు అవసరమవుతాయి.
మొబిలిటీ: చిన్నవి చేతితో సులభంగా తీసుకెళ్లగలిగితే, పెద్దవి ట్రాలీ చక్రాలతో వస్తాయి.
మైక్రోఫోన్స్: కేవలం పాటలు వినడానికే అయితే మైక్ అవసరం లేదు. కానీ కరోకే, అంతాక్షరి లేదా ఈవెంట్స్ కోసం ఒకటి లేదా రెండు వైర్‌లెస్ యూహెచ్ఎఫ్ మైకులు ఉండే మోడళ్లను ఎంచుకోవాలి. ఒక మైక్ ఉంటే ఎవరో ఒకరు పాడుతుండగా మిగతా అందరూ చూడటం, రెండు మైకులు ఉంటే యుగళగీతాలు, అంతాక్షరి పాడటం వంటివి ఉంటాయి.
1. బోట్ స్టోన్ 900(Boat Stone 900): డైలీ యూజ్, ట్రావెల్ ప్రియుల కోసం
ఈ జాబితాలో నిజంగా పోర్టబుల్‌గా ఉపయోగించడానికి అనువైన మోడల్ బోట్ స్టోన్ 900. రూ.5,499 ధరతో జులై 2026లో రిఫ్రెష్ చేసిన స్టోన్ లైనప్‌లో ఇది వచ్చింది. 372x152x201mm పరిమాణంతో ఉండటంతో బ్యాక్‌ప్యాక్‌లో సులభంగా పెట్టుకోవచ్చు. ఇంట్లో షెల్ఫ్‌పై ఉంచినా ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. ఈ స్పీకర్‌లో రెండు 3.5-అంగుళాల ఫుల్-రేంజ్ డ్రైవర్లు, రెండు 1-అంగుళాల ట్వీటర్లు ఉన్నాయి. ఇవి కలిపి 80వాట్స్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ఈ సైజ్‌లోని పోర్టబుల్ స్పీకర్‌కు ఇది మంచి పవర్‌గా చెప్పొచ్చు. దీని ప్రధాన ఆకర్షణల్లో బ్యాటరీ లైఫ్, వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. IPX5 రేటింగ్ కారణంగా నీటి చినుకులు, చెమట, తేలికపాటి వర్షం వంటి వాటి నుంచి స్పీకర్‌కు రక్షణ లభిస్తుంది. Bluetooth 5.3, AUX, USB ప్లేబ్యాక్, TWS పెయిరింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మ్యూజిక్‌కు అనుగుణంగా రెడ్, గ్రీన్, బ్లూ లైటింగ్ మారుతుంది. ఫోన్ కాల్స్ కోసం బిల్ట్-ఇన్ మైక్ కూడా ఉంటుంది. యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఎవరికి సరిపోతుంది?
వీకెండ్ ట్రిప్స్, హోటల్ రూమ్స్, జిమ్, బాల్కనీ లేదా చిన్న ఓపెన్ స్పేస్‌లో సంగీతం వినేవారికి బోట్ స్టోన్ 900 మంచి ఎంపిక. సుమారు 8 నుంచి 10 మంది వరకు ఉన్న చిన్న గ్యాదరింగ్‌కు కూడా ఇది సరిపోతుంది.
ఎవరికి సరిపోదు?
కరోకే చేయాలనుకునేవారు మాత్రం ఈ మోడల్‌ను ఎంచుకోకపోవడం మంచిది. ఇందులో ఉన్న మైక్ ఫోన్ కాల్స్ కోసం మాత్రమే. ప్రత్యేక మైక్రోఫోన్ ఇన్‌పుట్ లేకపోవడంతో కరోకే అవసరాలకు ఇది అనుకూలం కాదు.
2. బోట్ పార్టీపాల్ నోవా((Boat PartyPal Nova): అపార్ట్‌మెంట్‌లు, డ్రాయింగ్ రూమ్‌లకు!
చిన్న పోర్టబుల్ స్పీకర్ కంటే ఎక్కువ పవర్ కావాలి కానీ భారీ ట్రాలీ స్పీకర్ అవసరం లేదనుకునేవారి బోట్ పార్టీపాల్ నోవా బెస్ట్ ఛాయిస్. రూ.29,990 ధర ఉన్న ఈ స్పీకర్ 475x223x265mm పరిమాణంలో ఉంటుంది. ట్రాలీపై లాగాల్సిన అవసరం లేకుండా ఎత్తి ఒకచోట ఉంచుకునేలా రూపొందించారు. రెండు 6.5-అంగుళాల వూఫర్లు, ఒక 2-అంగుళాల ట్వీటర్ కలిపి 120W అవుట్‌పుట్‌ను అందిస్తాయి. 6.5-అంగుళాల వూఫర్లు ఉండటంతో చిన్న పోర్టబుల్ స్పీకర్లతో పోలిస్తే బాస్ మరింత స్పష్టంగా, బలంగా అనిపిస్తుంది.

ఈ మోడల్‌లో కరోకేకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బాక్స్‌లోనే ఒక బ్యాటరీ ఆపరేటెడ్ యూహెచ్ఎఫ్ వైర్‌లెస్ మైక్రోఫోన్ వస్తుంది. కరోకే ఆట-ట్యూనర్ కూడా ఉంది. వైర్‌లెస్ మైక్‌తో పాటు వైర్డ్ మైక్ ఇన్‌పుట్ కూడా ఉండటంతో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు పాడుకునే అవకాశం ఉంది. యూహెచ్ఎఫ్ వైర్‌లెస్ టెక్నాలజీ కారణంగా అపార్ట్‌మెంట్ వంటి ప్రాంతాల్లో సాధారణ 2.4GHz వైర్‌లెస్ మైక్రోఫోన్లతో పోలిస్తే కనెక్షన్ మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవ పనితీరు పరిసరాల్లోని వైర్‌లెస్ జోక్యం, దూరం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. boAt Hearables యాప్ ద్వారా EQ, లైటింగ్ వంటి సెట్టింగులను కస్టమైజ్ చేసుకోవచ్చు. Bluetooth 5.3, AUX, TF కార్డ్, USB ప్లేబ్యాక్, TWS మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 60 శాతం వాల్యూమ్ వద్ద 5 గంటల వరకు ప్లేటైమ్ లభిస్తుంది.
ఎవరికి సరిపోతుంది?
ఫ్లాట్లు, డ్రాయింగ్ రూమ్‌లు, టెర్రస్‌లు, సొసైటీ కామన్ ఏరియాల్లో జరిగే 15 నుంచి 30 మంది వరకు ఉన్న పార్టీలకు పార్టీపాల్ నోవా సరైన సైజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా కరోకే అవసరం ఉన్న వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఎవరికి సరిపోదు?
30 మందికి మించి పెద్ద గ్యాదరింగ్‌లు లేదా ఓపెన్ గ్రౌండ్ పార్టీలను తరచూ నిర్వహించేవారికి నోవా పరిమితంగా అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో మరింత శక్తివంతమైన పార్టీపాల్ అల్ట్రా వైపు చూడటం మంచిది.
3. బోట్ పార్టీపాల్ అల్ట్రా((Boat PartyPal Ultra): సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌తో భారీ సౌండ్!
బోట్ పార్టీపాల్ అల్ట్రా ఈ లైనప్‌లో బ్యాటరీ బ్యాకప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన మోడల్. రూ.43,990 ధరతో వచ్చే ఈ స్పీకర్ 748 x 335 x 320mm పరిమాణంలో ఉంటుంది. ట్రాలీ, వీల్స్ ఉండటంతో పెద్ద స్పీకర్ అయినప్పటికీ ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సులభంగా తరలించవచ్చు. ఇది 260వాట్స్ బోట్ సిగ్నేచర్ సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అయితే దీని ప్రధాన ప్రత్యేకత కేవలం పవర్ కాదు. 60 శాతం వాల్యూమ్ వద్ద 6 గంటల వరకు ప్లేటైమ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ జాబితాలోని పార్టీపాల్ మోడళ్లలో ఇది ఎక్కువ బ్యాటరీ బ్యాకప్.అల్ట్రాతో రెండు యూహెచ్ఎఫ్ వైర్‌లెస్ మైక్రోఫోన్లు వస్తాయి. కరోకే ఆటో-ట్యూనర్, ఇన్‌బిల్ట్ డీజే ట్రాక్స్, బాస్ డ్రాప్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గిటార్ ఇన్‌పుట్ ఉండటంతో ఇంట్లో మ్యూజిక్ జామ్ సెషన్స్ లేదా ప్రాథమిక అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.

boAt Hearables యాప్ ద్వారా EQ, లైటింగ్, ఇతర డివైస్ కంట్రోల్ సెట్టింగులను మార్చుకోవచ్చు. Bluetooth 5.3, AUX, TF కార్డ్, USB, వైర్డ్ మైక్ ఇన్‌పుట్, TWS వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
ఎవరికి సరిపోతుంది?
30 నుంచి 60 మంది వరకు ఉండే పెద్ద గ్యాదరింగ్‌లు, అవుట్‌డోర్ ఈవెంట్లు, టెర్రస్ పార్టీలు లేదా పవర్ పాయింట్ సులభంగా అందుబాటులో లేని ప్రదేశాలకు బోట్ పార్టీపాల్ అల్ట్రా అనువైనది. రెండు వైర్‌లెస్ మైక్రోఫోన్లు ఉండటంతో గ్రూప్ కరోకే, అంతాక్షరి వంటి కార్యక్రమాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఎవరికి సరిపోదు?
30 మందిలోపు చిన్న ఇండోర్ పార్టీలకు అల్ట్రా అవసరానికి మించి పెద్దదిగా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో పార్టీపాల్ నోవా బెస్ట్ ఛాయిస్. మరోవైపు గరిష్ట సౌండ్ అవుట్‌పుట్‌నే ప్రధానంగా చూస్తూ, పవర్ సప్లై అందుబాటులో ఉంటే పార్టీపాల్ 650ను కూడా పరిశీలించవచ్చు.
4. బోట్ పార్టీపాల్ 650(Boat PartyPal 650) : గరిష్ట సౌండ్ కావాల్సిన వారికి పర్ఫెక్ట్!
బోట్ పార్టీపాల్ 650 ఈ సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలుస్తుంది. రెండు 8-అంగుళాల వూఫర్లు, రెండు 2-అంగుళాల ట్వీటర్లతో 300W అవుట్‌పుట్‌ను అందిస్తుంది. TWS ద్వారా మరో పార్టీపాల్ 650ను కనెక్ట్ చేస్తే మొత్తం 600W అవుట్‌పుట్ వరకు పొందవచ్చని బోట్ సంస్థ చెబుతోంది.ఈ లైనప్‌లో 8-అంగుళాల వూఫర్లు అత్యంత పెద్దవి. అందువల్ల చిన్న డ్రైవర్లతో పోలిస్తే లో-ఎండ్ బాస్ మరింత బలంగా, ఫిజికల్ ఇంపాక్ట్‌తో వినిపించే అవకాశం ఉంటుంది. 720mm ఎత్తుతో ఉండే ఈ స్పీకర్ బేస్‌లో వీల్స్‌తో వస్తుంది. అంటే దీన్ని తరచూ చేత్తో మోసుకెళ్లడం కంటే అవసరమైన ప్రదేశానికి రోల్ చేసుకుని వెళ్లి అక్కడ ఏర్పాటు చేసుకోవడం సౌకర్యంగా ఉంటుంది.

పార్టీపాల్ 650లో కరోకే ప్రోట్యూనర్ ఉంది. ఇది కరోకే సమయంలో వాయిస్ పిచ్‌ను రియల్‌టైమ్‌లో సరిచేయడానికి ఉపయోగపడుతుంది. రెండు యూహెచ్ఎఫ్ వైర్‌లెస్ మైక్రోఫోన్లతో పాటు ప్రత్యేక వైర్డ్ మైక్ ఇన్‌పుట్ కూడా ఉంది. ఇన్‌బిల్ట్ డీజే ట్రాక్స్, బాస్ డ్రాప్ ప్యాడ్, గిటార్ ఇన్‌పుట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. boAt Hearables యాప్ ద్వారా EQ, లైటింగ్, ఇతర కంట్రోల్స్‌ను నిర్వహించవచ్చు. Bluetooth 5.3, TWS, AUX, USB, TF కార్డ్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఎవరికి సరిపోతుంది?
60 మందికి పైగా ఉండే పెద్ద పార్టీలు, ఫామ్‌హౌస్‌లు, పెద్ద లాన్స్‌లు, కమ్యూనిటీ ఫంక్షన్లు, ఓపెన్-ఎయిర్ ఈవెంట్లకు ఇది బెస్ట్ ఛాయిస్. గరిష్ట సౌండ్, బలమైన బాస్, కరోకే ఫీచర్లు కావాలనుకునేవారికి ఇది లైనప్‌లో అత్యంత సామర్థ్యం ఉన్న మోడల్.
ఎవరికి సరిపోదు?
ఈవెంట్ జరిగే ప్రదేశంలో పవర్ సప్లై అందుబాటులో లేకపోతే అల్ట్రా మెరుగైన ఎంపిక కావచ్చు. ఎందుకంటే అల్ట్రా 6 గంటల వరకు, 650 5 గంటల వరకు ప్లేటైమ్ అందిస్తుంది. అలాగే 30 మందిలోపు ఇండోర్ పార్టీలకు 650 అవసరానికి మించిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఫైనల్‌గా..
అయితే స్పీకర్ కొనేటప్పుడు చాలామంది చేసే సాధారణ తప్పు ఏమిటంటే.. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు నిర్వహించే పెద్ద పార్టీని దృష్టిలో పెట్టుకుని స్పీకర్ కొనడం. వాస్తవానికి మీరు వారానికి లేదా రోజుకు ఎన్నిసార్లు స్పీకర్‌ను ఉపయోగిస్తారో ఆలోచించడం ముఖ్యం. రోజువారీ వినియోగమే ఎక్కువైతే చిన్న, పోర్టబుల్ మోడల్ మెరుగైన పెట్టుబడి కావచ్చు. తరచూ పార్టీలు నిర్వహిస్తే మాత్రం మీ గది, ప్రేక్షకుల సంఖ్య, కరోకే అవసరం, బ్యాటరీ బ్యాకప్‌ను బట్టి పార్టీపాల్ సిరీస్‌లో సరైన మోడల్‌ను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications
