Chrome, Firefox బ్రౌజర్‌లలో డేటా కాష్‌ను క్లియర్ చేయడం ఎలా?

|

కరోనావైరస్ భయాల వల్ల చాలా మంది ఇంటి నుండి పని చేస్తున్నందున అందరు ల్యాప్‌టాప్‌లు లేదా PCలపై పూర్తిగా ఆధారపడి పనిచేస్తూ ఉంటారు. మీరు పని చేస్తున్నప్పుడు మీ వెబ్‌పేజీలు స్తంభించడం లేదా సరిగ్గా లోడ్ అవ్వడం వంటి సమస్యలను మీరు ఎదురుకున్నపుడు దానికి గల కారణం మీ సిస్టమ్ యొక్క బ్రౌజర్ కాష్‌ను క్లియర్ చేయకపోవడం మరియు కుకీలను తొలగించకపోవటం వలన ఇది జరగవచ్చు. మీరు ప్రతిరోజూ మీ సిస్టం యొక్క బ్రౌసర్ డేటాను క్లియర్ చేయగలిగితే ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా పనిచేస్తుంది.

 బ్రౌజర్ కాష్

బ్రౌజర్ కాష్

కాష్‌లు అనేది మీరు ఏదైనా సైట్‌ను మొదటిసారి సందర్శించినప్పుడు బ్రౌజర్ స్టోర్ చేసే తాత్కాలిక ఫైల్‌లు. ఈ ఫైల్‌లు మీ సిస్టమ్ యొక్క ర్యామ్ మరియు మెమరీని వినియోగిస్తాయి. బ్రౌజర్ కాష్ మీ సిస్టమ్‌ను నెమ్మదిస్తుంది మరియు స్టోరేజ్ ను ఖాళీ చేయడానికి దీన్ని తొలగించాలి. మీరు మీ బ్రౌజర్‌లలో కాష్‌ను ఈ విధంగా తొలగించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ క్రోమ్

గూగుల్ క్రోమ్

** గూగుల్ క్రోమ్‌ యొక్క బ్రౌజర్‌లోకి వెళ్లి కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు నిలువు చుక్కల ఎంపికపై క్లిక్ చేయండి.

** క్రిందికి స్క్రోల్ చేసి అందులో గల హిస్టరీ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని దాని మీద క్లిక్ చేయండి.

** బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయడానికి 'క్లియర్ బ్రౌజింగ్ డేటా' ఎంపికను ఎంచుకోండి.

** తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డేటాను క్లియర్ చేయడానికి సమయాన్ని ఎంచుకోవాలి. ఇందులో లాస్ట్ వన్ హౌర్, చివరి 24 గంటలు, చివరి 7 రోజులు, చివరి 4 వారాలు అనే ఆప్షన్స్ ఉంటాయి . మొత్తం డేటాను క్లియర్ చేయడానికి 'క్లియర్ అల్' అనే ఎంపిక కూడా ఉంటుంది.

** బ్రౌజింగ్ హిస్టరీ, కుకీలు మరియు ఇతర సైట్ డేటా, కాష్ చేసిన ఫోటోలు మరియు ఫైళ్ళ పక్కన ఉన్న బాక్స్ లను టిక్ చేయండి.

** చివరగా క్లియర్ డేటా అనే బటన్‌ను నొక్కండి.

 

Mozilla Firefox

Mozilla Firefox

** మెను బటన్ కు వెళ్లి బ్రౌజర్ యొక్క ఎంపికలపై క్లిక్ చేయండి.

** గోప్యత మరియు భద్రతా ప్యానెల్‌పై నొక్కండి.

** కుకీలు మరియు సైట్ డేటా ఎంపిక కింద గల క్లిక్ డేటాను నొక్కండి.

** కుకీలు మరియు సైట్ డేటా ముందు గల బాక్స్ నుండి చెక్‌మార్క్‌ను తొలగించండి

** వెబ్ కంటెంట్‌ను కాష్ చేయడానికి ముందు బాక్స్ లో చెక్‌మార్క్‌ను ప్రారంభించండి. తరువాత క్లియర్ అనే బటన్ మీద నొక్కండి.

 

ఫైర్‌ఫాక్స్ కాష్‌ను ఆటొమ్యాటిక్ గా క్లియర్ చేయడానికి

ఫైర్‌ఫాక్స్ కాష్‌ను ఆటొమ్యాటిక్ గా క్లియర్ చేయడానికి

** ప్రైవసీ & సెక్యూరిటీ లోని హిస్టరీ విభాగానికి వెళ్లండి

** ఫైర్‌ఫాక్స్ పక్కన ఉన్న డ్రాప్-డౌన్ మెనులో హిస్టరీ కోసం అనుకూల సెట్టింగ్‌లను ఉపయోగించడాన్ని క్లిక్ చేయండి.

** ఫైర్‌ఫాక్స్ క్లోజ్ చేసినప్పుడు స్పష్టమైన హిస్టరీ కోసం చెక్ బాక్స్‌ను ఉంచండి.

** దాని ప్రక్కన సెట్టింగుల బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇది హిస్టరీను క్లియర్ చేయడానికి సెట్టింగులను ఓపెన్ చేస్తుంది.

** కాష్ ముందు చెక్ గుర్తు ఉంచండి మరియు OK బటన్ నొక్కండి.

 

Best Mobiles in India

English summary
How to Clear Catch Data on Chrome and Firefox

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X