ట్విట్టర్ నుంచే ఫేస్‌బుక్ కనెక్ట్ చేసుకోవాలంటే...?

ఫేస్‌బుక్.. ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లకు మీరు వీరాభిమానా..?, రెగ్యులర్‌గా వీటితో టచ్‌లో ఉంటున్నారా..?, ఒకే కంటెంట్‌ను ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తున్నారా..?, అయితే, ఇప్పటి వరకు మీరు ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లను వేరు వేరుగా ఓపెన్ చేసి కార్యకలాపాలు నిర్వహించి ఉంటారు. అలాకాకుండా, ట్విట్టర్ నుంచే నేరుగా ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

- ముందుగా వెబ్ బ్రౌజర్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ట్విట్టర్.కామ్‌లోకి వెళ్లండి.
- మీ ఆకౌంట్‌లోకి లాగినై కుడివైపు కార్నర్‌లో ఉన్న 'యూజర్ సింబల్"అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అనంతరం ప్రొఫైల్ ట్యాబ్ పై క్లిక్ చేసిన ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

-'పోస్ట్ యువర్ ట్వీట్స్ టూ ఫేస్‌బుక్"అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అనంతరం సైన్ ఇన్ టూ ఫేస్‌బుక్ బటన్ పై క్లిక్ చేసి లాగిన్ కండి. మీ సెక్యూరిటీ వివరాలను ట్విట్టర్ స్టోర్ చేసుకోదు కాబట్టి, భద్రంగా ఉంటాయి.
- లాగిన్ అయిన్ అనంతరం 'కనెక్ట్ టూ ఫేస్‌బుక్"అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

- ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్ అప్లికేషన్‌కు కనెక్ట్ కండి,
- మీ అప్‌డేట్‌లను పోస్ట్‌చేసే విధంగా అప్లికేషన్‌కు అనుమతిని మంజూరు చేయాల్సి ఉంటుంది.
- పేజీ క్రింది భాగంలో ఏర్పాటు చేసిన డ్రాప్ డౌన్ మెనూలో అప్‌డేట్‌లు పొందాల్సిన స్నేహితులను ఎంచుకోవచ్చు,
- ఇప్పుడు లాగిన్ విత్ ఫేస్‌బుక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- తరువాత ఓపెన్ అయ్యే విండోలో'Allow" 'Skip" అనే రెండు ఆప్షన్ లు ప్రత్యక్షమవుతాయి.
- Allow బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఫేస్‌బుక్‌లో మీ ట్విట్టర్ ఆకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








