Home
News

ఫోన్ నంబర్‌ ఫార్మాట్‌కు గుడ్‌బై.. ఇ-మెయిల్‌ తరహాలో UPI ఐడీలు.. ఎలా క్రియేట్‌ చేసుకోవాలి..!

Personalised UPI IDs : భారత్‌ లో UPI చెల్లింపులు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం లక్షల కోట్ల రూపాయలు జరుగుతున్నాయి. చిన్న దుకాణాల నుంచి షాపింగ్ మాల్స్‌ వరకు UPI సేవలు సుమారుగా అందుబాటులోకి వచ్చాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు సులభంగా ఈ విధానంలో చెల్లింపులు చేస్తున్నారు. అయితే నేరగాళ్లు ఈ యూపీఐ చెల్లింపులను టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో UPI సంస్థలు యూజర్ల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఫోన్‌ నంబర్‌ కు బదులుగా అక్షరాలు, సంఖ్యలతో :
సాధారణంగా UPI ఐడీ ఫోన్‌ నంబర్‌ ఆధారంగానే ఉంటాయి. ఈ ఫోన్‌ నంబర్‌ సహా ఇతర వివరాల ఆధారంగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. దీంతో ఫోన్‌ నంబర్‌ కు బదులుగా.. అంకెలు, అక్షరాలతో కలిపి UPI ID ను క్రియేట్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అంటే ఇ-మెయిల్‌ ( E-mail ) తరహాలో క్రియేట్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

How to Create personalised UPI IDs what are the uses with this new process in telugu

ఈ విధానంలో కొత్తగా యూపీఐ ఐడీలను క్రియేట్‌ చేసుకుంటే.. ఫోన్ నంబర్‌ బహిర్గతం అయ్యే అవకాశం ఉండదు. యూజర్లు నేరుగా తమ యాప్‌ ల ద్వారా కొత్త ఐడీలను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఫలితంగా ఫోన్‌ నంబర్‌ చెప్పాల్సిన అవసరం లేకుండానే సింపుల్‌ గా పేమెంట్స్‌ చేసేందుకు మరియు స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది.

ఈ కొత్త విధానంలో ఫోన్ నంబర్‌ కు బహిర్గతం కాదు. కేవలం అక్షరాలు, సంఖ్యలు మాత్రమే ఉంటాయి కనుక, ఇబ్బందులు తలెత్తవు. మరియు మోసాలను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది. పేటీఎం, గూగుల్ పే సంస్థలు యూజర్లకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీంతోపాటు రేపటి నుంచి ( అక్టోబర్ 2 ) యూపీఐ పేమెంట్స్‌ లో కొన్ని మార్పులు అమలు చేయనున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా ( NPCI ) చెబుతోంది.

పేటీఎంలో ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
స్టెప్‌ 1 : పేటీఎం యాప్‌ ఓపెన్‌ చేయాలి.
స్టెప్‌ 2 : హోం స్క్రీన్‌ లో కనిపించే ప్రొఫైల్‌ ఐకాన్ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 3 : అక్కడ కనిపించిన UPI & Payment Settings ఆప్షన్‌ లోకి వెళ్లాలి.
స్టెప్‌ 4 : అనంతరం UPI ID పక్కన ఉన్న View ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 5 : అక్కడ కనిపించిన Try Personalised UPI ID పైన క్లిక్ చేయాలి.
స్టెప్‌ 6 : అక్కడ మీకు నచ్చిన ఐడీని క్రియేట్‌ చేసుకోవచ్చు లేదా అక్కడున్న ఐడీల్లో ఒకటి ఎంచుకోవచ్చు.

గూగుల్‌ పే యాప్‌ లోనూ ఇదే విధంగా యూపీఐ ఐడీని మార్చుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ కొత్త విధానంలో మోసాలను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరిన్ని యూపీఐ యాప్‌లు కూడా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Create personalised UPI IDs what are the uses with this new process
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X