ఫేస్‌బుక్ అకౌంట్ డిలీట్, డియాక్టివేట్ చేయడం ఎలా ?

By Gizbot Bureau
|

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాశ్వతంగా డిలీట్ చేయాలనుకుంటున్నారా..? సాధారణంగా, ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేద్దామన్న ఆలోచన వచ్చిన వెంటనే చాలా మంది అకౌంట్ సెట్టింగ్స్ (Account Settings)లోకి ప్రవేశించి సెక్యూరిటీ (security) విభాగంలోని Deactivate your Account ఆప్షన్‌ను క్లిక్ చేస్తుంటారు. అయితే, ఇలా చేయటం వల్ల ఫేస్‌బుక్ సర్వీస్‌ను మీ టైమ్‌లైన్ అదృశ్యమైనప్పటికి మీ ఫేస్‌బుక్ డేటా సర్వర్‌లో అలానే ఉండి పోతోంది.

How to deactivate or permanently delete your Facebook account

ఈ క్రమంలో గతంలో మీరు మీ అకౌంట్ నుంచి మీరు షేర్ చేసిన డేటా ఇతరుల అకౌంట్‌లలో అలానే ఉండిపోతుంది. ఇలా కాకుండా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను సర్వర్ నుంచే పూర్తిగా తొలగించివేయాలంటే ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగినై ఆ తరువాత వేరొక ట్యాబ్‌లో ఈ క్రింది లింక్‌ను ఓపెన్ చేసి తదుపరి సూచనలను అనుసరిచండి.

Facebook అకౌంట్ డిలీట్

Facebook అకౌంట్ డిలీట్

https://www.facebook.com/help/delete_account ఈ ప్రక్రియ ద్వారా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసేందుకు ధరఖాస్తు చేసుకున్నట్లయితే 14 రోజుల తరువాత మీ అకౌంట్ పూర్తిగా డిలీట్ కాబడుతుంది.

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

ఆ తరువాత మెనూలోని సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

General Account Settings'లో క్రింద కనిపించే 'Download a copy of all your Facebook data' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు https://www.facebook.com/help/delete_account లింక్‌లోకి వెళ్లి Delete My Account option పై క్లిక్ చేయండి.

ఇలా చేసిన తరువాత Final Confirmation నిమిత్తం మీ ఫేస్‌బుక్ అకౌంట్ పాస్‌వర్డ్‌తో పాటు అక్కడ డిస్‌ప్లే అయ్యే captcha codeను ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

Final Confirmation పూర్తి అయిన వెంటనే 14 రోజుల‌లోపు మీ అకౌంట్‌ డిలీట్ కాబడుతుంది. ఈ 14 రోజుల్లోపు మీరు ఎప్పుడైనా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగినై deletion requestను క్యాన్సిల్ చేసుకోవచ్చు.

 

డేటాను కాపీ చేసుకోవడం ఎలా ?
 

డేటాను కాపీ చేసుకోవడం ఎలా ?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత మెనూలోని సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
అక్కడ కనిపించే Download a copy of your Facebook dataని క్లిక్ చేయండి. ఆ తర్వాత Download Archive అనే బటన్ పై క్లిక్ చేయండి. అది రెడీ కాగానే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. అలర్ట్ వచ్చిన తర్వాత Download Archiveని క్లిక్ చేస్తే zip file మీ పీసీలోకి డౌన్లోడ్ అవుతుంది.

అకౌంట్ డియాక్టివేట్ చేయడం ఎలా ?

అకౌంట్ డియాక్టివేట్ చేయడం ఎలా ?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత మెనూలోని సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

అక్కడ కనిపించే Generalలోకి వెళ్లండి. Manage your accountపై క్లిక్ చేయండి. అక్కడ కనిపించే Deactivate your accountపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఫేస్ బుక్ ని చూడలేరు. మళ్లీ మీరు యాక్టివ్ అయ్యేదాకా అది ఎవరికీ కనపడదు.

 

ఫేస్‍‌బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఎలా..?

ఫేస్‍‌బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఎలా..?

హోమ్ పేజీ పై బాగంలోని రైట్ కార్నర్‌లో కనిపించే down arrow పై క్లిక్ చేసినట్లయితే ఓ డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులోని Activity Log ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

Activity Log ఆప్షన్‌ను పై క్లిక్ చేసిన వెంటనే వివిధ ఆప్షన్‌లతో కూడిన ఓ జాబితా స్ర్కీన్ ఎడమ వైపు కనిపిస్తుంది. ఈ జాబితా లిస్ట్ ను మరింతగా expand చేసేందుకు More పై క్లిక చేయండి. ఇప్పుడు కనిపించే జాబితా లిస్ట్‌లో Search ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.Search ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించిన జాబితా ఓపెన్ అవుతుంది. వాటిలో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న సెర్చ్ ను ఎంపిక చేసుకని ఆ సెర్చ్ కు సంబంధింకి బ్లాక్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే డిలీట్ ఆప్షన్ మీకు కినిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ డిలీట్ కాబడుతుంది. మొత్తం సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలనుకుంటే, పేజీ టాప్‌లో కనిపించే Clear Search link పై క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే మొత్తం సెర్చ్ హిస్టరీ డిలీట్ కాబడుతుంది.

 

Best Mobiles in India

English summary
How to deactivate or permanently delete your Facebook account in simple steps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X